ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి | ram gopal varama faction film vangaveeti coming to an end | Sakshi
Sakshi News home page

ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి

Published Thu, Jun 30 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి

ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో కాంట్రవర్షియల్ మూవీ వంగవీటి. విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో.. ప్రత్యేకంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వర్మ. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ తెగ హడావిడి చేసిన వర్మ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మకాం ముంబైకి మార్చేయటం, బాలీవుడ్లో వీరప్పన్ సినిమా ప్రమోషన్లో బిజీ కావటంతో వంగవీటి సినిమా ఆగిపోయినట్టే అని భావించారు. అయితే ఇప్పుడు వంగవీటి సినిమా షూటింగ్ పూర్తికావచ్చిందన్న వార్త టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎనౌన్స్ మెంట్ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా రిలీజ్ టైంకి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement