
బుక్ మై షో ప్రారంభించిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ (Red Lorry Film Festival ) సౌత్‌కు వచ్చేస్తోంది. మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో సినీప్రముఖులు తమ అనుభవాలను, సినిమా వెనక ఉండే కష్టాలను, సాహసాలను పంచుకోనున్నారు.
నిర్మాత రమేశ్ ప్రసాద్, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, శిఖరన్ బీచరాజు, శేఖర్ కమ్ముల, నటులు శివ బాలాజీ, నవదీప్, సినిమాటోగ్రఫీ వెంకట్ సి.దిలీప్, దర్శకరచయితలు వీఎన్ ఆదిత్య, జి. నీలకంఠ రెడ్డి, రచయిత అంజున్ రాజాబలి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సినీ ఇండస్ట్రీలో గమనించిన అంశాలను, వైవిధ్యాన్ని, కావాల్సిన మార్పుల గరించి వీరు మాట్లాడనున్నారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌లో క్లాసిక్స్‌గా నిలిచిన మాయాబాజర్, పుష్పక విమానం, మిస్సమ్మ, ఆదిత్య 369, హ్యాపీ డేస్, నేనే రాజు నేనేమంత్రి, చందమామ, మన్మథుడు వంటి చిత్రాలను మరోసారి బిగ్‌స్క్రీన్‌పై చూసే అవకాశం కల్పించనున్నారు.
చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్
Comments
Please login to add a commentAdd a comment