Veerappan
-
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె!
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి (ఎన్టీసీ) టికెట్‌పై ఆమె కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి జూలై 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. ఇటీవల ఆమె నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే పార్టీలో చేరారు తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులను ఎన్టీకే నేత సీమాన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణగిరి నుంచి ఎన్టీకే అభ్యర్థిగా విద్యా రాణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మొత్తం 40 మంది ఎన్టీకే అభ్యర్థుల్లో సగం మంది మహిళలేని తెలిపారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి కృష్ణగిరిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు. ఆమె తన తండ్రి వీరప్పన్‌ను ఒకే ఒక్కసారి కలిశారట. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి తెలిపారు. తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్లోని తాతయ్య ఇంట్లో తన తండ్రిని మొదటిసారిగా, చివరిసారిగా చూశానని తెలిపారు. -
వీరప్పన్ బిడ్డకు ఎంపీ టికెట్
-
ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ సిరీస్.. ఇందులో అదే స్పెషల్!
కూసీ మునిసామి వీరప్పన్ అంటే చాలా మందికి తెలియదు. అదే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈయన అసలు పేరు కూసీ మునిసామి వీరప్పన్. ఈయన గురించి ఇప్పటికే పలు చిత్రాలు, సీరియల్స్ రూపొందాయి. తాజాగా ఆయన నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'కూసీ మునిసామి వీరప్పన్' అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కింది. దీన్ని నక్కీరన్ గోపాల్(ఈయన టీమ్.. వీరప్పన్‌ను అప్పట్లో ఇంటర్వ్యూ చేశారు) కూతురు ప్రభావతి.. ధీరన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. శరత్ జ్యోతీ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ నేటి(డిసెంబర్ 14) నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నక్కిరన్ గోపాలన్‌తో ఆయన కూతురు ప్రభావతి చాలామంది నా దగ్గరకు వచ్చారు ఈ సందర్భంగా యూనిట్ వర్గాలు చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నక్కీరన్ గాపాలన్ మాట్లాడుతూ.. నక్కీరన్ అంటే ధైర్యం కావాలనీ, ఆ తరువాత వీరప్పన్ అంటే ఇంకా ధైర్యం కావాలని అన్నారు. కూసీ మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్‌తో ఈ రెండింటినీ సాధ్యం చేశారని పేర్కొన్నారు. వీరప్పన్ కథతో చిత్రాన్ని చేయడానికి చాలా మంది తన వద్దకు వచ్చారని, తన కూతురు అడగడానికి ముందు దివంగత దర్శకుడు బాలు మహేంద్ర కూడా తనను అడిగారనీ చెప్పారు. అయితే దాన్ని సరిగా చేయాలన్న ఉద్దేశంతో తాను వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. వీరప్పన్‌కు నేనంటే ఇష్టం ఈ వీడియో కోసం తన టీమ్ చాలా కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరప్పన్ గురించి ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలు, సీరియల్స్ అన్నీ పోలీసుల కథనాలతో రూపొందాయన్నారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ మాత్రమే వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో రూపొందించబడిందన్నారు. దీన్ని తన కూతురు టీమ్ చాలా బాగా రూపొందించిందని చెప్పారు. తనకు వీరప్పన్ అంటే ఇష్టం అనీ, ఆయనకు తానంటే ఇష్టం అనీ, అలాగని తాను ఈ సిరీస్‌తో వీరప్పన్‌కు అనుకూలంగా రిపోర్ట్ చేయలేదనీ చెప్పారు. తాము బాధింపుకు గురైన ప్రజల తరపునే నిలిచామని చెప్పారు. చదవండి: ఆ సీన్ లేకుంటే ‘యానిమల్’ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు: బాబీ డియోల్ -
'మొసళ్లు సిద్ధంగా ఉన్నాయి'.. సూపర్ స్టార్‌కు స్వీట్ వార్నింగ్!
జైలర్ మూవీ సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ తలైవా మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా డిసెంబర్ 12న ఆయన తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విషెస్ తెలిపారు. అయితే రజినీకాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తలైవా పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. గతంలోనే తలైవాను హెచ్చరించినట్లు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. ఎంజీఆర్‌లాగే రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వీరప్పన్ ముందు జాగ్రత్తగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ సందర్భంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 రిలీజ్ చేసిన వీడియోలో కనిపించింది. కానీ అందులో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల నేపథ్యంలో వీరప్పన్ తనదైన శైలిలో స్పందించినట్లు తెలుస్తోంది. ఆయనను దోచుకునేందుకు.. మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని రజినీకాంత్‌ను వీరప్పన్ ఆ వీడియోలో హెచ్చరించారు. అయితే ఈ వీడియో మూవీ ప్రమోషన్స్‌లో భాగమే అయినప్పటికీ.. అందులో వీరప్పన్ మాట్లాడిన మాటలు నిజమేనని తెలుస్తోంది. వీడియోలో వీరప్పన్ మాట్లాడుతూ..'అప్పట్లో ఎంజీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. కానీ ఎంజీఆర్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టడం కష్టం. రజినీకాంత్ కూడా అలా అవుతారని నాకు బాగా తెలుసు. ఆయన దేవుడిని బాగా నమ్ముతారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. కానీ నేను మీకు విషయం చెప్పదలచుకున్నా. అయ్యా రజనీకాంత్.. మీరు రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ సపోర్ట్ చేయొద్దు. మిమ్మల్ని మింగడానికి అక్కడ మొసళ్లు రెడీగా ఉన్నాయి. ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి నువ్వు బలికావద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరలవుతోంది. వీరప్పన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి వీరప్పన్ జీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. ఆడియన్స్ పల్స్‌కు తగినట్టుగానే ప్రతివారం కొత్త కంటెంట్‌తో ఓటీటీలు దూసుకెళ్తున్నాయి. కొత్త కొత్త సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతివారం ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన కోలీవుడ్ వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తమిళనాడులో సంచలనంగా మారిన వీరప్పన్ గురించి అందరికీ తెలుసు. ఆయన జీవిత కథనే వెబ్ సిరీస్(డాక్యుమెంటరీ) రూపంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అడవుల్లోకి పారిపోయి దాచుకుని దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థానికి ప్రభుత్వాలకు దొరకకుండా తప్పించుకున్న వ్యక్తి వీరప్పన్. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కూసే మునిస్వామి వీరప్పన్. ఈ సిరీస్ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) టీమ్ చేసిన ఎన్కౌంటర్లో వీరప్పన్ మరణించారు. -
‘రైతుబంధు పక్కదారి’ నిజమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం సొమ్మును పక్కదారి పట్టించిన విషయంపై వ్యవసాయ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో జరిగిన అక్రమాలు, మరణించిన లబ్దిదారుల పేరుతో ఇతరులు రైతుబంధు సొమ్ము తీసుకుంటున్న వైనంపై ‘రైతుబంధు పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. నల్లగొండ ఏడీఏ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో దేవరకొండ ఏడీఏ వీరప్పన్, ఇతర అధికారులు ముడుదండ్లలో శుక్రవారం విచారణ నిర్వ హించారు. పెరికేటి రాఘవాచారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. రైతుబంధు డబ్బులు రెండేళ్లుగా ఇతరుల అకౌంట్లలో జమ అవుతున్న తీరును అడిగారు. లబ్దిదారులు వాస్తవాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏడీఏ విచారణ నివేదిక ఇవ్వగానే అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తెలిపారు. -
రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్
కన్నడ సూపర్ స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్‌లకు ఎంతోమంది వీరాభిమానులున్నారు. వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కూడా పెద్ద నటుడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా.. తండ్రి రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసిన సమయంలో రజనీకాంత్ తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు శివ రాజ్‌కుమార్. ఆయన ఇటీవల కీలక పాత్రలో నటించిన జైలర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఉందని చెప్పుకొచ్చాడు. తండ్రిని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో రజనీ తన కుటుంబానికి ఎంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. 2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్ గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి వీరప్పన్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్‌తో చర్చలు జరిపింది. అటు వీరప్పన్.. ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. 108 రోజుల తర్వాత నవంబర్ 15న రాజ్‌కుమార్‌ను విడుదల చేశాడు. 2004 అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. చదవండి: Niharika: నిహారిక మీద బ్యాడ్ కామెంట్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్ -
పగడ్బందీ వ్యూహంతో వీరప్పన్‌ను హతమార్చాం
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): పగడ్బందీ ప్రణాళికలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నేర్పుతో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను హతమార్చామని తమిళనాడు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)కి నాయకత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి కె.విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం చెన్నై తరమణిలోని ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జరిగిన కార్యక్రమంలో.. మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ రాసిన (వీరప్పన్ ఛేజింగ్ ది బ్రిగాండ్) పుస్తకం ఆధారంగా 20 ఎపిసోడ్ల ఆడియో రికార్డులను ఆసియావిల్లే వ్యవస్థాపకుడు, సీఈఓ తుహిన్ ఆవిష్కరించారు. మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ సందర్భంగా థ్రిల్లింగ్ ట్రూ–క్రైమ్ పై ఆడిబుల్ ఒరిజినల్ పాడ్‌కాస్ట్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇందులో 1952లో గోపీనాథంలో పుట్టినప్పటి నుంచి 2004లో మరణించే వరకు వీరప్పన్ జీవితానికి సంబంధించిన అంశాలు మాజీ ఐపీఎస్ కె. విజయ్ కుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించామని వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విజయకుమార్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్‌ను ఎలాగైనా మట్టికరిపించాలనే లక్ష్యంతో పక్కా వ్యూహంతో హతమార్చగలిగామన్నారు. ఇందులో ఏకే 47 గన్ను వినియోగించామని చెప్పారు. ఎంతో మంది పోలీసులను, సాధారణ ప్రజలను కిరాతకంగా వీరప్పన్ చంపారని గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్‌కు ఎవరూ భంగం కలిగించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందే విషయాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాం.. అని ఆయన పేర్కొన్నారు. -
పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘పుష్ప అంటే ఫ్లవరనుకొంటివా.. ఫై..రు..’ అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ది గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర. ఈ సినిమా రావడానికి దశాబ్దాల కిందటే కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసి.. ఆ రాష్ట్రాల సరిహద్దుల్లోని సత్యమంగళం అడవుల్లో సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని.. యథేచ్ఛగా గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ, మారణహోమానికి సైతం తెగించిన వాడు వీరప్పన్. అటువంటి వీరప్పన్‌కు ముచ్చెమటలు పట్టించి, సజీవంగా బంధించిన ధీశాలి.. పందిళ్లపల్లి శ్రీనివాస్ మన గోదారమ్మ ముద్దుబిడ్డ కావడం విశేషం. సోమవారం ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. చదువు.. ఉద్యోగం.. పందిళ్లపల్లి అనంతరావు, జయలక్ష్మి దంపతులకు 1954 సెప్టెంబర్ 12న కాకినాడలో శ్రీనివాస్ జన్మించాడు. రాజమహేంద్రవరం ఫిషర్స్ కాలనీ పాఠశాలలో ప్రాథమిక విద్య చదివాడు. 1975–77లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదివి, బంగారు పతకం సాధించాడు. 1978లో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైన శ్రీనివాస్ 1979లో ఇండియన్ ఫారెస్టు సరీ్వస్(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం 1981లో కర్ణాటక కేడర్ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చామరాజనగర్‌లో అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌గా తొలి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. కర్ణాటకలో శ్రీనివాస్ చెల్లెలు ఆదివారం ప్రారంభించిన కాంస్య విగ్రహం అదే ఏడాది స్మగ్లింగ్ నిరోధక బాధ్యతలతో చిక్‌మగళూరు కేంద్రంగా డిప్యూటీ ఫారెస్టు కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాడు. ఈ విధులను శ్రీనివాస్ చాలా శ్రద్ధతో నిర్వహించాడు. సత్యమంగళం అడవుల్లో ఏనుగులను చంపి, వాటి దంతాలను అక్రమ రవాణా చేస్తున్న వీరప్పన్‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నిజాయితీ గల అధికారిగా అటవీ గ్రామాల్లో ప్రజల మన్ననలు చూరగొన్నాడు. 1985లో వీరప్పన్‌ను సజీవంగా పట్టుకుని, మైసూరు జిల్లా బూదిగపాడు అటవీ శాఖ అతిథి గృహంలో బంధించాడు. అయితే వీరప్పన్ తప్పించుకు పారిపోయాడు. సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ స్మగ్లింగ్ కార్యకలాపాలతో చెలరేగిపోతున్న వీరప్పన్‌కు అడ్డుకట్ట వేసేందుకు శ్రీనివాస్.. సాధారణంగా నేరస్తులను పట్టుకునే వ్యూహాలకు భిన్నంగా గాంధేయవాద పద్ధతులైన సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ వంటివి అమలు చేశారు. వీరప్పన్‌కు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదరణను దెబ్బ తీయడానికి ప్రజలను చైతన్యవంతులను, అక్షరాస్యులను, సంపాదనాపరులను చేశారు. పీహెచ్‌సీలు, పాఠశాలలు నెలకొల్పారు. రోడ్లు అభివృద్ధి చేశారు. మంచినీటి సౌకర్యాలు కల్పించారు. వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథంలో ప్రజల ఇష్టదైవం మారియమ్మన్ ఆలయాన్ని కట్టించాడు. ఈ నేపథ్యంలో వీరప్పన్ పట్ల ప్రజల్లో ఏర్పడిన నమ్మకం క్రమంగా సడలిపోసాగింది. లొంగిపోయిన నేరస్తులకు శ్రీనివాస్ పునరావాసం కల్పించారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ‘వాచ్ టవర్లు‘ ఏర్పాటు చేశారు. అటవీ ఉద్యోగులు నివసించడానికి, విధులకు అందుబాటులో ఉండడానికి చామరాజనగర్‌లో ‘ఫారెస్టు కాంప్లెక్స్’ నిర్మించారు. అనుచరులను దెబ్బ తీయడం, వెతుకులాట పెంచడం, ఉద్యోగులు మరింత సమర్థంగా పని చేసేలా చేయడం వంటి చర్యలతో వీరప్పన్ అక్రమ రవాణాను దెబ్బ తీశారు. తమ్ముడు, చెల్లెళ్లతో శ్రీనివాస్ (పాతచిత్రం) నమ్మించి.. హతమార్చి.. శ్రీనివాస్ ముమ్మర వ్యూహాలతో వీరప్పన్‌కు ఎటూ పాలు పోలేదు. దీంతో ఆయనను వంచించి, దెబ్బ తీయడానికి సిద్ధమయ్యాడు. శ్రీనివాస్ ఒంటరిగా వస్తే లొంగిపోతానని సహచరుడు అర్జున్‌తో వీరప్పన్ కబురు పంపాడు. ఆ మాటలు నమ్మిన శ్రీనివాస్.. 1991 నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున గోపీనాథం సమీపంలోని నెమళ్లకొండ వద్దకు వెళ్లారు. అప్పటికే వీరప్పన్ సూచనలను అందుకున్న అతడి అనుచరుడు పలాండీ.. తుపాకీతో శ్రీనివాస్‌ను కాల్చి చంపాడు. ఆయన వెన్నంటి వచ్చిన మరో ముగ్గురు అటవీ ఉద్యోగులను కూడా దారుణంగా హతమార్చారు. చనిపోయిన తరువాత కూడా శ్రీనివాస్ ఎక్కడ లేచి వస్తోడోననే భయంతో వీరప్పన్.. మొండెం నుంచి తల నరికి అడవుల్లోకి తీసుకుపోయాడు. దీనినిబట్టి వీరప్పన్‌కు చావు భయాన్ని శ్రీనివాస్ ఎంతలా చూపించారో అర్థం చేసుకోవచ్చు. చాలా గర్వంగా ఉంది శ్రీనివాస్ మా అన్నయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నీతి, నిజాయితీకి మారు పేరుగా నిలిచారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలయినా సరే ఇప్పటికీ జనం గుర్తు పెట్టుకుంటున్నారంటే ఆయనపై అభిమానం, ప్రేమ వెలకట్టలేనిది. మా అన్నగారంటే నాకు, నా ఇద్దరు చెల్లెళ్లకు చాలా ఇష్టం. – పందిళ్లపల్లి సత్యనారాయణ, సోదరుడు దైవంతో సమానంగా.. శ్రీనివాస్ చిత్రపటాన్ని మారియమ్మన్ గుడిలో స్థానికులు, ఆయన అభిమానులు దైవంతో సమానంగా ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనను వీరప్పన్ హతమార్చిన చోట స్మారక స్థూపం నిర్మించారు. మరణానంతరం శ్రీనివాస్‌కు కేంద్ర ప్రభుత్వం 1992లో కీర్తిచక్ర పురస్కారం ప్రకటించింది. యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన పందిళ్లపల్లి శ్రీనివాస్ పేరును రాజమహేంద్రవరంలో ఒక వీధికి పెట్టారు. శ్రీనివాస్ జీవిత చరిత్రను కొత్తగా శిక్షణకు వచ్చే ఐఏఎస్, ఐపీఎస్‌లకు బోధిస్తున్నారు. శ్రీనివాస్ చనిపోయిన 10వ తేదీని జాతీయ అటవీ అధికారుల అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్‌లో.. తన ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తూనే అడవుల్లో కార్చిచ్చు, కాలిపోతున్న అడవుల పరిరక్షణ చర్యలపై పరిశోధనకు శ్రీనివాస్ 1985లో అమెరికా వెళ్లాడు. అక్రమ రవాణాను నిరోధించేందుకు, వీరప్పన్‌ను పట్టుకునేందుకు కర్ణాటక – తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాయి. అందులో ప్రత్యేకాధికారిగా శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో ఆయన అమెరికా నుంచి తిరిగి మన దేశం వచ్చారు. వస్తూ వస్తూ సొంతూరైన రాజమహేంద్రవరం వెళ్లకుండా నేరుగా కర్ణాటక వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. చదవండి: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు -
అడవిబిడ్డల గుండెల్లో శ్రీనివాస్
మైసూరు: తమ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించి, అడవిదొంగ వీరప్పన్ చేతిలో 29 ఏళ్ల కిందట హతమైన ఆంధ్రాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిని కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని అడవి బిడ్డలు నేటికీ ఆరాధిస్తున్నారు. వీరప్పన్ జన్మస్థలంలో ఆ అధికారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రికి చెందిన పందిళ్లపల్లి శ్రీనివాస్ కర్ణాటకలో డిప్యూటీ ఫారెస్ట్ కన్సర్వేటర్గా ఉంటూ వీరప్పన్‌ను పట్టుకునే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో చామరాజనగర జిల్లాలోని గిరిజన గ్రామాలకు విద్యుత్, తాగునీరు, రోడ్ల నిర్మాణం, పక్కా ఇళ్ల మంజూరు వంటివి చేపట్టడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. వీరప్పన్ స్వగ్రామం గోపినాథంలో శ్రీనివాస్ సొంత డబ్బుతో మారియమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 1991, నవంబరు 10వ తేదీన తన స్వగ్రామం గోపినాథంలో లొంగిపోతానని శ్రీనివాస్‌కు వీరప్పన్ సమాచారం పంపించాడు. అయితే, వీరప్పన్ పథకం ప్రకారం గోపినాథం గ్రామంలోకి శ్రీనివాస్ రాగానే కాల్చి చంపాడు. శ్రీనివాస్ అందించిన సేవలను గోపినాథం, సమీప గ్రామాల అడవిబిడ్డలు నేటికీ మరిచిపోలేదు. శ్రీనివాస్ మరణించిన గోపినాథం గ్రామంలోని మారియమ్మ ఆలయం పక్కన ఆయన కాంస్య విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. (చదవండి: తల నరికేసే ఊరిలో రెండు దేశాల బోర్డర్) -
Veerappan: వీరప్పన్ సోదరుడి కన్నుమూత
చెన్నై: గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్(75) కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం(తమిళనాడు) ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. మత్తయ్యన్.. ఓ హత్య కేసులో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 1987లో ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు మత్తయ్యన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు పడగా.. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి. -
22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్‌కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన అకాలమరణం చెందారు. వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణించలేకుండా ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు, ప్రజలు దాదాపు 22 ఏళ్ల క్రితం పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి చర్చించుకుంటున్నారు. అదే పునీత్ రాజ్‌కుమార్ తండ్రి కిడ్నాప్. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. వీరప్పన్ నేరాల్లో ఈ సంఘటన ఇప్పటికి కూడా ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది. దీని గురించి ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్‌ను ఎందుకు కిడ్నాప్ చేశాడు.. తర్వాత ఏం జరిగింది వంటి తదితర వివరాలు.. (చదవండి: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు.. ) ఈ కిడ్నాప్ 2000 సంవత్సరం, జూలై 30న చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగిన సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. సంఘటన జరిగిననాడు.. రాజ్‌కుమార్.. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని గాజనూరు గ్రామంలో ఉన్న తన ఇంటికి వచ్చారు. అప్పటికి ఎనిమిది నెలల క్రితమే పునీత్ రాజ్‌కుమార్ వివాహం జరిగింది. (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) జూలై 30, రాత్రి 09.30 గంటలకు కిడ్నాప్... రాజ్‌కుమార్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో వీరప్పన్ తన అనుచరలతో కలిసి రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి.. ఆయనను కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. (చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు) ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని.. ఇది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) రాజ్‌కుమార్ కిడ్నాప్ గురించి ఏడాది ముందే సమాచారం వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గంధపు చెక్కల స్మగ్లర్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని.. కిడ్నాప్‌కు ఏడాది ముందే అనగా.. 1999లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించడంతో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..) ఫలించని చర్చలు.. 108 రోజుల బందీ రాజ్‌కుమార్ కిడ్నాప్ వ్యవహారంపై అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో వీరప్పన్‌తో చర్చలు జరిపింది తమిళ ప్రభుత్వం. నక్కిరన్ పత్రిక ఎడిటర్ ఆర్ఆర్ రాజగోపాల్ ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించినప్పటికి ఫలితం లేకపోయింది. అలా 108 రోజుల పాటు రాజ్‌కుమార్‌ను బంధించిన వీరప్పన్.. చివరకు 2000, నవంబర్ 15న ఆయనను వదిలేశాడు. చర్చలు జరిపినా మాట వినని వీరప్పన్.. ఉన్నట్లుండి రాజ్‌కుమార్‌ను విడుదల చేయడం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. (చదవండి: ఒక్కసారి కూడా నా తండ్రిని చూడలేదు) 19 ఏళ్ల పాటు సాగిన కేసు.. తమిళనాడు కోర్టులో రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఈ కేసు విచారణ సమయంలో రాజ్‌కుమార్ కుటుంబం ఎవరిని నిలదీయలేదు. కిడ్నాప్ అయిన 19 ఏళ్ల తర్వాత అనగా 2018, సెప్టెంబర్‌లో కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రాజ్‌కుమార్ కుటుంబం వీరికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయకపోవడంతో.. వీరంతా నిర్దోషులుగా విడుదల అయ్యారు. కేసు ముగియడానికి ముందే వీరప్పన్, రాజ్‌కుమార్ రెండు ఏళ్ల తేడాతో మృతి చెందారు. సిట్ బృందం చేతిలో 2004లో వీరప్పన్ మృతి చెందగా.. 2006లో రాజ్‌కుమార్ మృతి చెందారు. ఇక చర్చల సమయంలో వీరప్పన్ తన మీద ఉన్న మొత్తం 135 కేసులును ఎత్తేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు అంగీకరించేదట. చదవండి: వీరప్పన్‌కు ఇచ్చింది రూ.15 కోట్లు! -
మోస్ట్ వాంటెడ్ అస్సాం ‘వీరప్పన్’ హతం
అతనొక తిరుగుబాటు సంఘానికి సీనియర్ నేత. ఆ గ్రూప్‌లో మిగిలిన ఏకైక సభ్యుడు కూడా. కానీ, భద్రతా దళాలకు కొన్నేళ్లుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పైగా గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో ‘అస్సాం వీరప్పన్’గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కానీ, అనూహ్యంగా నిర్జీవంగా అడవుల్లో దొరికాడు. దిస్పూర్: మంగిన్ ఖల్‌హౌ.. యునైటెడ్ పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్(యూపీఆర్ఎఫ్) కీలక నేత. గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో అతనికి అస్సాం వీరప్పన్‌గా పేరొచ్చింది. అయితే ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని భద్రతా దళాలు అస్సాం దక్షిణ దిశగా కర్బి అడవుల్లో స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఏడాదిగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో యూపీఆర్ఎఫ్ సీనియర్లంతా చనిపోగా.. మంగిన్ మాత్రం దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. సొంతవాళ్ల చేతుల్లోనే? మంగిన్ది ఎన్కౌంటర్ కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతర్గత విభేధాలతో వాళ్లలో వాళ్లే కాల్చుకున్నారని, ఆ కాల్పుల్లోనే అతను చనిపోయాడని వెల్లడించారు. శనివారం, ఆదివారం మధ్య జరిగిన కాల్పుల్లో అతను చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుకీ కమ్యూనిటీకి చెందిన ప్రజలతో ఏర్పడిందే యూపీఆర్ఎఫ్. సింగ్హసన్ పర్వతాల గుండా స్థావరాల్ని ఏర్పరుచుకుని భద్రతా దళాలపై తరచూ దాడులు చేస్తున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో గ్రూప్ కమాండర్ మార్టిన్ గుయిటెను పోలీస్ కాల్పుల్లో మరణించగా.. శాంతి ఒప్పందానికి సిద్ధపడుతూ ప్రభుత్వానికి యూపీఆర్ఎఫ్ ఓ లేఖ కూడా రాసింది. కానీ, ఆ లొంగుబాటు ఆలస్యం అవుతూ వస్తుండగా.. ఈ మధ్యలో ఎదురుకాల్పుల్లో గ్రూప్ సభ్యులు చనిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగిన్కు, యువ సభ్యులకు మధ్య పొగసకపోవడమే అతని మరణానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మంగిన్ మరణంపై సంఘం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. -
వీరప్పన్ డెన్‌లో నిధి ఉంది: కుమార్తె విజయలక్ష్మి
సాక్షి, చెన్నై: చందనపు దొంగ వీరప్పన్ రాజ్యమేలిన సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్టు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన చందనపు దొంగ వీరప్పన్ ఈరోడ్ జిల్లా సత్యమంగళం అడవుల్ని స్థావరంగా చేసుకుని చందనపు దుంగలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌లో రాజ్యమేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరప్పన్ లేడు. 2004లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం అంతమైనా, తరచూ వీరప్పన్ పేరు మాత్రం వార్తల్లోనే ఉంటూ వస్తున్నది. ఇందుకు కారణం ఆయన కుటుంబమే. వీరప్పన్‌కు సతీమణి ముత్తులక్ష్మి, విద్యారాణి, విజయలక్ష్మి కుమార్తెలు ఉన్నారు. విద్యారాణి బీజేపీలో చేరి మహిళా యువజన నేతగా ఉన్నారు. ఇక, విజయలక్ష్మి తమిళర్ వాల్మురిమై కట్చిలో ఉన్నారు. ఈనెలాఖరులో తెరకెక్కనున్న మావీ రన్ పిళ్లై చిత్రంలో నటించారు. ఈ చిత్రం చందనపు దొంగ జీవిత ఇతివృత్తంతో చిత్రికరించినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే పోస్టర్లు, టీజర్లు ఉండడం చర్చకు దారి తీశాయి. అయితే, దీనిని విజయలక్ష్మి ఖండించారు. పెద్ద డంప్.. చెన్నైలో చిత్ర యూనిట్ కలిసి జరిగిన సమావేశంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ఈ చిత్రానికి తన తండ్రి జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళాసాధికారితకు సంబంధించిన చిత్రంగా వివరించారు. తనకు తండ్రి వీరప్పన్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన సత్యమంగళం అడవుల్లోనే అత్యధిక కాలం జీవించారని పేర్కొన్నారు. ఈ అడవుల్లో తన తండ్రి దాచిపెట్టిన అతి పెద్ద నిధి ఉందని, దీనిని కనిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ నిధి గురించి తెలిసిన తన తండ్రి, ఆయన అనుచరుడు ఈ లోకంలో లేరని, ఈ దృష్ట్యా, ఆ నిధి ఎక్కడుందో ప్రశ్నార్థకమేనని ముగించడం గమనార్హం. చదవండి: అమిత్ షా రాజీనామా చేయాలి -
ఇది వీరప్పన్ కథ కాదు!
చెన్నై : మా వీరన్ పిళ్లై.. వీరప్పన్ కథ కాదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. వీరప్పన్ కుమార్తె విజయలక్ష్మి కథానాయకిగా నటిస్తున్న చిత్రం ‘మా వీరన్ పిళ్లై’. కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్ రాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ సంగీతం అందిస్తుండగా మంజునాథ్ చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను విజయలక్ష్మి శుక్రవారం మీడియాకు వివరించారు. వీరప్పన్ కథకు మావీరన్ పిళ్లై చిత్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది ఒక జాతికి చెందిన కథ అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే కథతో ఈ చిత్రం రూపొందిందని వెల్లడించారు. ఇందులో తాను న్యాయవాదిగా నటించినట్లు చెప్పారు. ఢిల్లీలో రైతుల పోరాటం. ప్రేమలో మోసపోయిన యువతుల సమస్యలు, ఇతర సామాజిక అంశాలను స్పృశించినట్లు వివరించారు. నిర్మాత మాట్లాడుతూ సెన్సార్ పూర్తి చేసుకున్న మావీరన్ పిళ్లైను త్వరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నా ఆరోగ్యం బాగుంది! -
వీరప్పన్ కూతురు కథానాయికగా తెరంగేట్రం
చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్‌ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. కాగా వీరప్పన్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా అవతారమెత్తారు. విజయలక్ష్మి కథానాయికగా నటిస్తున్న చిత్రానికి మావీరన్ పిళ్లై అనే టైటిల్‌ని నిర్ణయించారు. కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్. రాజ్శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదల చేశారు. విశేషమేమిటంటే మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్ వారసురాలు సినీరంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: మలైకాకు కోవిడ్ వ్యాక్సిన్ -
వీరప్పన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన డిపార్ట్మెంట్
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుండడం ఓ పోలీసు అధికారిని ఇరకాటంలో పడేసింది. ఆయన్ను బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ పోలీసు బాసుల నిర్ణయం తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా రాణిరంజితం పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ దాఖలు, ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే జిల్లాలో నగర అదనపు కమిషనర్‌గా ఆమె భర్త వెల్లదురై పనిచేస్తుండడంతో రచ్చకెక్కింది. చందనపు దొంగ వీరప్పన్ ఎన్కౌంటర్ టీంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అనేక ఎన్కౌంటర్లతో ఎన్కౌంటర్ వెల్లదురైగా పేరు గడించిన ఈ అధికారికి భార్య రూపంలో విధి నిర్వహణలో చిక్కులు తప్పలేదు. దీంతో తిరునల్వేలి కమిషనర్ అన్బు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అధికార అన్నాడీఎంకే నుంచి చీలిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంలో ఈ అధికారి సతీమణి పోటీ చేస్తుండడం కాబోలు, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చెన్నై డీజీపీ కార్యాలయంలో ఎన్నికల విధులకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టడం గమనార్హం. శ్రీరంగంలో చిన్నమ్మ పూజలు సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం చిన్నమ్మ శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని కూడా సందర్శించారు. పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నైకు వచ్చిన 41 రోజుల తర్వాత ఇంటి నుంచి శశికళ అడుగు బయటపెట్టారు. గురువారం తంజావూరులోని కులదైవం ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం తిరుచ్చి శ్రీరంగం చేరుకుని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం తిరుచ్చిలోని బంధువు కళియ పెరుమాల్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శనివారం చిన్నమ్మ భర్త నటరాజన్ మూడో వర్ధంతి. ఈసందర్భంన్ని పురస్కరించుకుని తంజావూరు ముల్లైవాయికాల్ స్తూపం ఎదురుగా ఉన్న నటరాజన్ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ తిరుచ్చి ఆలయ సందర్శన సమయంలో ఆమె వెన్నంటి అన్న కుమారుడు వెంకటేషన్ మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వీవీఐపీగా ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ ఇప్పుడు సాదాసీదా వ్యక్తిగా వెళ్లి దర్శించుకుని వచ్చారు. -
వీరప్పన్‌కు ఇచ్చింది రూ.15 కోట్లు!
బనశంకరి: ఒకప్పటి కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ రాజ్‌కుమార్‌ను అపహరించిన గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కు ఆయన విడుదల కోసం కర్ణాటక సర్కారు భారీగా నగదు ముట్టజెప్పిందని ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాచార పాత్రికేయుడు శివ సుబ్రమణ్యన్ రాసిన పుస్తకంలో పలు కొత్త అంశాలు వెలుగుచూశాయి. రాజ్‌కుమార్ విడుదల కోసం మూడు విడతులుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం వీరప్పన్‌కు అందజేసిందని పుస్తకంలో పేర్కొన్నారు. వీరప్పన్ జీవితంపై లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ అనే పుస్తకాన్ని శివసుబ్రమణ్యన్ విడుదల చేశారు. 2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించి సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. 108 రోజుల తరువాత నవంబర్ 15న విడుదల చేశాడు. ఆ సమయంలో రాజ్‌కుమార్ కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. రాజ్‌కుమార్ విడుదల కోసం మొదట డిమాండ్ చేసింది కోటి రూపాయలు. క్రమంగా ఆ మొత్తం పెరుగుతూ పోయింది. రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు అందించాలని డిమాండ్ పెట్టాడు. ఎస్ఎం కృష్ణ శాటిలైట్ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రెండుసార్లు రూ.5 కోట్లు చొప్పున, తుది విడతగా రూ.5.22 కోట్ల నగదును పంపించారని పుస్తకంలో తెలిపారు. కాగా, 2004, అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోవడం తెలిసిందే. చదవండి: సీఎం కుర్చీ నుంచి నన్నెవరూ దింపలేరు -
ఒక్కసారి కూడా నా తండ్రిని చూడలేదు
సాక్షి, చెన్నై : పుట్టినప్పటి నుంచి తాను తన తండ్రిని చూడలేదని, కేవలం మృతదేహం మాత్రమే కాసేపు చూశానని గందపు చెక్కల దొంగ వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్ అన్నారు. ఇటీవల ఆమెకు బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో విద్యా సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. తనజీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజం తనను ఓ శత్రువుగానే, ప్రత్యర్ధిగానో చూడలేదన్నారు. మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. (వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి) తాను నేర్చుకున్న విద్య, ఉపాధ్యాయుల భోదనలు తన ఎదుగుదలకు ఎంతో దోహద పడ్డాయని విద్యారాణి వివరించారు. తాను చిన్నతనం నుంచి తండ్రిని చూడలేదని, ఆయన గురించి పలువురు మంచితనంతో ఎన్నో మాటలు చెప్పినట్లు గుర్తుచేశారు. ఒక్క రోజు కూడా తన తండ్రిని చూసే సమయం లభించలేదని, ఆయన మృతదేహం మాత్రమే కాసేపు చూశానని పేర్కొన్నారు. జీవచ్చవంగా ఉన్న తన తండ్రిని ఏదో ఆందోళన, ఉరుకులు పరుగులుగా చూసినట్లు చెప్పారు. బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. -
వీరప్పన్ కుమార్తెకు కీలక పదవి
సాక్షి, చెన్నై : ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్యా వీరప్పన్‌కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య గత పిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యకు రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టారు. మరోవైపు పాత వీరప్పన్ వర్గాన్ని మొత్తం బీజేపీ వైపుకు తిప్పలా విద్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్ 2004లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
హోసూరు: ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్‌ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు. -
వీరప్పన్ అనుచరుడి భార్య అరెస్ట్
కర్ణాటక, యశవంతపుర : మూడు కేసులకు సంబంధించి అటవీ దొంగ వీరప్పన్ సహచరుడి భార్యను చామరాజనగర పోలీసులు అరెస్ట్ చేశారు. హనూరు తాలూకా మాట్కళ్లి గ్రామానికి చెందిన స్టెల్లా అలియాస్ స్టెల్లామేరిని ఆరెస్ట్ చేశారు. పాలార్ బాంబ్ పేలుళ్లకు సంబంధించి అక్రమంగా మారణాయుధాలను సమకుర్చిన కేసులో మేరి నిందితురాలు. 27 ఏళ్లు నుండి కేసు జరుగుతోంది. అనంతరం కేసును చామరాజపేట పోలీసులు ఛేదించారు. మేరి తన 13 ఏటనే వీరప్పన్ బృందంలో చేరింది. వీరప్పన్ సంపాదించి పెట్టిన డబ్బులను స్టెల్లా బావ శేషరాజ్లు కలిసి దొంగలించారు. విషయం తెలుసుకున్న వీరప్పన్ స్టెల్లాను, ఆమె బావ శేషరాజ్లను కిడ్నాప్ చేశాడు. దొంగలించిన డ బ్బులను ఇవ్వాలని డి మాండ్ చేశా రు. అయి న వీరు ఇవ్వలేదు. ఇదే సమయంలో వీరప్పన్ మరో సహచరు డు సుండ వెల్లెయన్ స్టెల్లా ను ప్రేమి ంచి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఏడాదిన్నరపాటు వీరప్పన్ బృందంలోనే పని చేస్తూ స్టెల్లా పాలార్ బాంబ్ పేలుళ్లు కేసు, రామాపుర పోలీసుస్టేషన్‌కు నిప్పు పెట్టిన కేసుతో పాటు టాడా కేసు నమోదు చేశారు. 27 ఏళ్లు తరువాత ఆమెను అరెస్ట్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
తమిళనాడు ప్రభుత్వ తీరుపై షణ్ముగప్రియ మండిపాటు
-
మళ్లీ తెరపైకి షణ్ముగప్రియ
కోయంబత్తూరు: తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించి మూడేళ్లు గడిచినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు షణ్ముగప్రియ. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని తమిళనాడు ప్రభుత్వానికి పీఎంఓ సూచించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రాష్ట్రాన్ని వణికించిన ఘరానా స్మగ్లర్‌ను పట్టించినందుకు తనకు దక్కిన గౌరవం ఇదేనా అంటూ వాపోయారు. ఇంతకీ ఎవరీ షణ్ముగప్రియ? మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించారీమె. కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతానికి చెందిన షణ్ముగ ప్రియ.. వీరప్పన్‌కు సంబంధించిన కీలక సమాచారం అందించి పోలీసులకు సహాయపడ్డారు. వీరప్పన్‌ను పట్టుకునే ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందానికి సహకరించేందుకు 2004లో ఆమెను ఉన్నతాధికారి శాంతమరై కన్నన్ నియమించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి నాలుగు నెలలు తన ఇంటిని అద్దెకిచ్చి సన్నిహితురాలిగా మెలిగారు. అతడికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టి పోలీసులకు అందించారు. నీలగిరి కొండల్లో భార్యను కలుసుకునేందుకు వీరప్పన్ వస్తున్నాడన్న సమాచారాన్ని పోలీసులకు చెప్పింది షణ్ముగప్రియ కావడం గమనార్హం. అయితే అప్పుడు వీరప్పన్‌ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. చివరకు బాధే మిగిలింది.. ‘వీరప్పన్ అనారోగ్యం, అతడి చూపు మందగించిన విషయం, అడవుల్లో అతడు ఎక్కడ దాక్కున్నాడనే దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాను. నా జీవితాన్ని ఫణంగా పెట్టి పోలీసులకు సహకరించాను. ఇన్ని చేసినా చివరకు నాకు బాధే మిగిలింది. చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరూ ముందుకు రాని సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఈ ఆపరేషన్‌లో పాలు పంచుకున్నాను. ఆ సమయంలో ఎన్నో బాధలు, సమస్యలు ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా వీరప్పన్ ప్రతి కదలికపై పోలీసులకు సమాచారం అందించాను. రివార్డు సంగతి ప్రక్కన పెడితే కనీసం ప్రభుత్వం, పోలీసు విభాగం నుంచి గుర్తింపు కూడా దక్కలేద’ని షణ్ముగప్రియ వాపోయారు. 2004, అక్టోబర్ 18న వీరప్పన్, అతడి నలుగురు అనుచరులను ఎస్టీఎఫ్ హతమార్చింది. ఈ ఆపరేషన్‌లో తమకు సహకరించిన షణ్ముగప్రియకు తగినవిధంగా రివార్డులిస్తామని ఎస్టీఎఫ్ అప్పట్లో ప్రకటించింది. పదేళ్లు గడిచినా తనను పట్టించుకోకపోవడంతో 2015లో ప్రధాని కార్యాలయానికి ఆమె లేఖ రాశారు. షణ్ముగ ప్రియకు న్యాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆమెకు ప్రతిఫలం మాత్రం దక్కలేదు. నేనేమి చెప్పలేను: కన్నన్ ఈ విషయంపై శాంతమరై కన్నన్ మాట్లాడుతూ... ‘వీరప్పన్‌ను పట్టుకునేందుకు చాలా ఆపరేషన్లు నిర్వహించాం. కానీ అవన్నీ ఫలించలేదు. ఇలాంటి వాటిలో షణ్ముగప్రియ కూడా పాల్గొన్నారు. వీరప్పన్‌కు సంబంధించిన విలువైన సమాచారం ఆమె అందించారు. అయితే వీరప్పన్‌ను హతమార్చిన ఆపరేషన్‌లో ఉన్న వారికి మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించాం. షణ్ముగప్రియ విషయంలో నేనేమి చెప్పలేను’ అని అన్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ టీకే రాజేంద్రన్ ఇంకా స్పందించలేదు. -
వీరప్పన్ సహా అందరూ నిర్దోషులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ దివంగత రాజ్‌కుమార్‌ను ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దాదాపు 18 ఏళ్లుగా ఈ కేసును కోర్టు విచారిస్తోంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నేరం నిరూపితం కాకపోవడం, నేరాన్ని రుజువు చేసే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. 2000 జూలై 30న ఈరోడ్ జిల్లా తొట్టకాజనూరులోని రిసార్టుకు భార్య పార్వతమ్మాళ్తో కలసివచ్చిన రాజ్‌కుమార్‌ను ఆరోజు రాత్రి వీరప్పన్ తన సహచరులతో కలసి కిడ్నాప్ చేశాడు. దీంతో వీరప్పన్, అతని అనుచరులు 14 మందిపై కేసు నమోదైంది. తమిళనాడు జర్నలిస్టు నక్కీరన్ గోపాల్‌సహా పలువురు సాగించిన రాయబారాల ఫలితంగా 107 రోజుల తర్వాత రాజ్‌కుమార్ విడుదలయ్యాడు. అయితే, 2004 అక్టోబర్‌లో పోలీస్ ఎన్కౌంటర్లో వీరప్పన్, అతని అనుచరులు గోవిందన్, చంద్రగౌడ తదితరులు హతమయ్యా రు. 2006లో రాజ్‌కుమార్, గత ఏడాది ఆయన భార్య కన్నుమూశారు. -
ఆయనే బతికుంటే..తోకాడించేవారా!
టీనగర్: తన భర్త వీరప్పన్ బతికి ఉండి ఉంటే కావేరి జలాల విషయంలో కర్ణాటక తోక తిప్పి ఉండేదా అని ముత్తులక్ష్మి వీరప్పన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. తంజావూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మన్‌కాకుం వీరతమిళర్ పేరమైప్పు ఆధ్వర్యంలో తంజావూరు జిల్లా కల్లనైలో ఈ నెల 30న భారీ ర్యాలీ జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ సంఘాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధీరన్, ప్రస్తుత ఎమ్మెల్యేలు తనియరసు, కరుణాస్, తమీమున్ అన్సారీ పాల్గొననున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు విద్యుత్ సరఫరా చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ ఎన్నెల్సీ సంస్థ చైర్మన్ శరత్‌కుమార్‌ను కలువనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా రాష్ట్రానికి కావేరి జలాలను ఇవ్వకుండా కర్ణాటక వంచిస్తోందని ఆరోపించారు. కర్ణాటకకు విద్యుత్‌ను అందజేయకుండా ఆయనపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన భర్త బతికి ఉంటే ఒక్క క్యాసెట్ చాలని వ్యాఖ్యానించారు. గతంలో కర్ణాటక తమిళనాడుకు నీళ్లివ్వకుండా మారాం చేసిన సందర్భాల్లో తన భర్త వినూత్న పంథాను అనుసరించడం జరిగిందని, ఈ విషయం కొందరికే తెలుసని వివరించారు. రూ. 30 పెట్టి ఒక ఆడియో కేసెట్ కొనుగోలు చేసి, అందులో తన భర్త వీరప్పన్ కర్ణాటకకు హెచ్చరిక పంపేవారని, మరుక్షణమే నీళ్లు తమిళనాడుకు వచ్చిన సందర్భాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తన భర్త బతికి ఉంటే కర్ణాటక చర్యలను ఎండగట్టి తమిళనాడులోకి నీళ్లు రప్పించి ఉండేవారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక స్పందించకుండా ఉండి ఉంటే కేఆర్ఎస్ డ్యాంను బాంబులతో పేల్చి ఉండేవారని హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పును అమలుపరచాల్సిన బాధ్యత కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాలపై ఉందని అన్నారు. -
నరకలోకం టు నరలోకం!
2200 సంవత్సరం:నరకానికి వచ్చి బోలెడు సంవత్సరాలవుతున్నా... జస్ట్ నిన్నగాక మొన్న వచ్చినట్లే ఉంది వీరప్పన్‌కు.నరకం చాలా బోర్‌గా ఉంది. ఎక్కడి ఎర్రచందనపు చెక్కలు.... ఎక్కడి మనుషుల వేపుళ్లు! నిద్రలో రోజూ గంధపు చెక్కల సువాసనభరిత కలలే!‘‘ఈ నరకంలో ఒక్క గంధపు చెట్టూ లేదు. ఉన్నా వాటిని కొట్టే చాన్స్ ఇవ్వరు. ఛీ... వెధవ చావు అయిపోయింది’’ నిట్టూర్చాడు వీరప్పన్.ఈలోపే... ‘‘అన్నా గుడ్‌న్యూస్’’ అని పరుగెత్తుకు వచ్చాడు పక్క సెల్లో ఉండే కూరప్పన్.‘‘గుడ్‌న్యూస్ అనే మాట వినక ఎన్ని సంవత్సరాలవుతుందిరా కూరప్పన్. ఇంతకీ ఏమిటా న్యూస్?’’ ఆసక్తిగా అడిగాడు వీరప్పన్.‘‘సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను మన భూలోకంలో జాతీయ పర్వదినాల సందర్భంగా విడుదల చేస్తుంటారు అనే విషయం నీకు తెలుసు కదా! భూలోకంలోలాగే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి సిస్టమే అమలు చేయబోతున్నారు’’ చెప్పాడు కూరప్పన్.‘‘మరి ఇక్కడ జాతీయపర్వదినాలేవీ జరుపుకోరు కదా!’’ అనుమానంగా అడిగాడు వీరప్పన్.‘‘యమధర్మరాజుగారి బర్త్‌డేనే మన జాతీయ పర్వదినం... అది ఎప్పుడో కాదు... ఎల్లుండే... ఈ సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన కొందరు నరకవాసులను విడుదల చేస్తారు’’ అన్నాడు ఆనందంగా కూరప్పన్.‘‘ఇక్కడ సత్ప్రవర్తన లేనిది ఎవడికని? ఈ నరకంలో ప్రతివాడూ చచ్చినట్లు మంచివాడుగానే ఉండాలి. ఈ లెక్కన అందరూ మంచివాళ్లే కదా... మరి అందరినీ ఎలా విడుదల చేస్తారు?’’ అడిగాడు వీరప్పన్.‘‘చాలా మంచి క్వశ్చన్ వేశావు భయ్యా.... ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకునే సార్ బర్త్ డే రోజు లక్కీ డ్రా తీస్తారు. ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. ఆ ముగ్గురు నిరభ్యంతరంగా భూమి మీద వారి సొంత ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. అక్కడ సుఖంగా జీవించవచ్చు’’ చెప్పాడు కూరప్పన్. ఆరోజు యమధర్మరాజు బర్త్‌డే.‘‘యమధర్మరాజుగారి పుణ్యమా అని తీయని కేక్ తినే మహా అవకాశం మనకు వచ్చింది. ఈ తీయని సందర్భంలో కేక్ కంటే తీయని పాట ఎవరైనా పాడితే చాలా బాగుంటుంది. మీలో ఎవరు పాడతారు?’’ అడిగాడు చిత్రగుప్తుడు.‘‘సర్... నేను పాడతాను’’ అంటూ ‘గానఘోరగంధర్వ’ తిత్తిసత్తిపండు అనే గాయకుడు స్టేజీ మీదకు వచ్చాడు. పాట అనగానే యమధర్మరాజుకు హుషారు వచ్చింది. ‘‘మానవా... త్వరగా పాడవా’’ అన్నాడు. సత్తిపండు ‘యమగోల’ సినిమాలో పాట అందుకున్నాడు...‘సమరానికి నేడే ప్రారంభంయమరాజుకి మూడెన్ ప్రారబ్దంనరకలోకమున కార్మికశక్తికితిరుగులేదని చాటిద్దాం.ఇంక్విలాబ్ జిందాబాద్... ఇంక్విలాబ్ జిందాబాద్... లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్’పాట విని యమధర్మరాజుకు యమ మండింది.‘‘ఏమీ అసందర్భ గీతం... అభ్యంతరకర రోతం... నీ ఖేల్ ఖతం... లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైటా... వీడిని లెఫ్ట్ వైపుకు తీసుకెళ్లి రైట్ చెంప మీద నాలుగిచ్చుకోండి... అలాగే రైట్ వైపుకు తీసుకెళ్లి... లెఫ్ట్ చెంప మీద నాలుగిచ్చుకోండి. అటు పిమ్మట వీడిని సలసల కాగు నూనెలో లెఫ్ట్ అండ్ రైట్ బాగా కాల్చండి’’ అని ఆదేశించాడు యమధర్మరాజు. బర్త్‌డే వేడుకల అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. యమధర్మరాజు మునిమనవని ముని మునవడు చిరంజీవి ఘనధర్మరాజ్ మూడు చీటీలు తీశాడు. మొదటి పేరు: పీటర్ కాస్గ్రోవ్, ఆస్ట్రేలియా.పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి.రెండో పేరు: మాల్కం జఫా జఫా, ఇండోనేసియా.మరోసారి గట్టిగా హర్షధ్వానాలు.‘‘చూశావారా కూరప్పన్... ఇక్కడ కూడా మన ఇండియాకు అన్యాయం జరుగుతుంది’’ అన్నాడు ఆవేదనగా వీరప్పన్. ‘‘బాధ పడకన్నా... ఇంకో అవకాశం ఉంది కదా’’ అంటూ ఓదార్చాడు కూరప్పన్. ఇంతలో మూడో పేరు వినిపించింది. ‘కూసుమునిస్వామి వీరప్పన్, ఇండియా’కలా? నిజమా?... ఆనందం పట్టలేక అదేపనిగా ఏడ్చాడు వీరప్పన్. అందరికీ వీడ్కోలు చెప్పి భూలోకానికి పయనమయ్యాడు. భూలోకానికి రావడంతోనేతమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం టౌన్లో అడుగుపెట్టాడు. అక్కడ అందరూ ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి ఉన్నారు.‘‘ఈ టౌన్లో అందరూ మాస్క్‌లు «పెట్టుకొని తిరుగుతున్నారేమిటి?’’ దారిన పోయే దానయ్యను అడిగాడు వీరప్పన్.‘‘ఈ టౌన్ అని ఏమిటి! ఈ భూలోకంలో అన్ని టౌన్లలో, ఊళ్లలో మాస్కులు పెట్టుకుంటున్నారు’’ అన్నాడు దానయ్య.‘‘మాస్క్‌ల గొడవ నాకెందుకుగానీ... ఇక్కడ పెద్ద ఫారెస్ట్ ఉండాలి కదా ఏది?’’ అని ఆరాతీశాడు వీరప్పన్.‘‘ఫారెస్టా? అంటే?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ కుర్రాడు. ‘‘అదేనయ్యా... అడవి... అంటే... పెద్ద ఎత్తున చెట్లన్నీ ఒక చోట ఉండటం... అందులో గంధపు చెట్లు కూడా ఉంటాయి’’ వివరించాడు వీరప్పన్.‘‘మ్యూజియంలో తప్ప ఇప్పుడు చెట్లు ఎక్కడా కనిపించడం లేదు. అడవులనేవి ఇప్పుడు ఎక్కడా లేవు’’ అన్నాడు కుర్రాడు. ‘‘మరి జనాలు ఎలా బతుకుతున్నారయ్యా?’’ ఆశ్చర్యంగా అడిగాడు వీరప్పన్.‘‘టేటినో 3.5 సెవన్ లాక్ 4 బై 2 పేరుతో ఆర్టిఫిషియల్ చెట్లు, ఆర్టిఫిషియల్ గాలి, ఆక్సిజన్ మాస్క్‌లు... ఇలా రకరకాలు వచ్చాయి. కృత్రిమ ఆక్సిజన్ కోసం ఎప్పటికప్పుడు బాడీని రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే ఈ భూమి మీద నూకలు కాదు చేతిలో డబ్బులు ఉండాలి...’’ అని చెప్పాడు దానయ్య. కాసేపటికి వీరప్పన్ కళ్లు తిరిగాయి. గాలి లేక శ్వాస ఆడటం లేదు.....‘‘ఇతనికి శ్వాస ఆడటం లేదు... ఎయిర్ అంబులెన్స్‌కు ఫోన్ చేయండి...’’ ఎవరో అంటున్నారు.‘‘దయచేసి నన్ను బతికించవద్దు. చెట్లు లేని ఈ భూలోకం కంటే నరకమే ఎన్నో రెట్లు మేలు’’ అంటూనే కన్ను మూసి.... నరకానికి మరోసారి క్షేమంగా చేరుకున్నాడు వీరప్పన్! – యాకుబ్ పాషా -
వీరప్పన్ ను ఇలా చంపారట!
► హత్యకు ప్రముఖ పారిశ్రామికవేత్త సహకారం ► వీరప్పన్ శిబిరంలోకి మారువేషంలో ఎస్ఐ ► కంటి చికిత్సకని తీసుకొచ్చి కాల్పులు ► ఐపీఎస్ పుస్తకంలోని సమాచారం లీక్! సాక్షి ప్రతినిధి, చెన్నై: మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అంత ఈజీగా పోలీసులకు ఎలా దొరికాడబ్బా అనే సందేహం 13 ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. అతడిని మట్టుపెట్టిననాటి తన అనుభవాలపై మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా అందులోని కొంత సమాచారం బహిర్గతమైంది. అతడిని చంపడంలో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వీరప్పన్ కోసం విజయకుమార్ సాగించిన వేట, పన్నిన వ్యూహం వివరాలివి. పారిశ్రామికవేత్తతో దోస్తీ: చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముంది. దీంతో ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘాపెట్టారు. వీరప్పన్ వర్గంలోని రహస్య గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటల్‌కు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు పథకం పన్నారు. చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్ చేసిన ఎస్ఐ వెల్లదురైని.. వీరప్పన్ వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్ నిర్ణయించారు. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మదురై లేదా తిరుచ్చిలో వీరప్పన్ కు కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్ వస్తారన్నాడు లాటరీ ముక్కను నమ్మి..: విజయకుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ వెల్లదురై ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్నాడు. తనవద్దనున్న తొలిసగంతో సరిపోల్చు కున్నాక ఎస్సైని వీరప్పన్ నమ్మకస్తుడిగా భావించాడు. వెల్లదురై చెప్పినట్లుగానే వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్ ను అతని సహచరులను ఎస్ఐ వెల్లదురై ఎక్కించాడు. ధర్మపురి వద్ద సిద్ధంగా ఉన్న కమెండో పోలీసులు వీరప్పన్ పై కాల్పులు జరిపి హత మార్చారు. వీరప్పన్ ను హతమార్చేందుకు సహకరించడంతో సదరు పారిశ్రామికవేత్తపై కేసులు పెట్టలేదు. ఆ వ్యాపారి ఎవరనేది కుమార్ బైటపెట్టలేదు. -
ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో కాంట్రవర్షియల్ మూవీ వంగవీటి. విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో.. ప్రత్యేకంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వర్మ. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ తెగ హడావిడి చేసిన వర్మ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మకాం ముంబైకి మార్చేయటం, బాలీవుడ్లో వీరప్పన్ సినిమా ప్రమోషన్లో బిజీ కావటంతో వంగవీటి సినిమా ఆగిపోయినట్టే అని భావించారు. అయితే ఇప్పుడు వంగవీటి సినిమా షూటింగ్ పూర్తికావచ్చిందన్న వార్త టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎనౌన్స్ మెంట్ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా రిలీజ్ టైంకి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. -
నేను మారువేషంలోని పోలీసును: వర్మ
చాలారోజులకు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నాడు. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఆయనకు 'వీరప్పన్' సినిమా విజయంతోపాటు ప్రశంసలను తెచ్చిపెడుతున్నది. ఇటీవల బాలీవుడ్లో విడుదలై ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో వర్మ ఓ విషయాన్ని అంగీకరించాడు. అదేమిటంటే తాను మారువేషంలో ఉన్న పోలీసు అట. బాగా స్టడీ చేసి 'వీరప్పన్' సినిమా తీయడం వల్ల కాబోలు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'నేనొక విషయాన్ని ఒప్పుకోవాలి. నిజానికి నేను దర్శకుడి వేషంలో ఉన్న పోలీసును' అంటూ వర్మ తాజాగా ట్వీట్ చేశారు. నిత్యం ట్విట్టర్లో కామెంట్స్ చేస్తూ.. వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ తాజాగా మాత్రం ఈ ట్విస్టుతో అభిమానుల దృష్టి ఆకర్షించాడు. అంతేకాకుండా పోలీసు వేషంలో తానున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశాడు. -
వీరప్పన్‌కు మంచి మార్కులు?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లే కనపడుతున్నాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఊపుతో.. వీరప్పన్ జీవితం మీద మరో సినిమా తీశాడు. ఈ సినిమాకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడ్లో ఓ పట్టాన ఏ సినిమానూ పెద్దగా మెచ్చుకోడని పేరున్న కమాల్ ఆర్ ఖాన్ కూడా వీరప్పన్ సినిమాను ప్రశంసించాడు. అయితే ఒక్క లీసా రే తప్ప అందులో అందరూ బాగా చేశారని, సినిమా చాలా అద్భుతంగా ఉందన్న టాక్ వినిపిస్తోందని ట్వీట్ చేశాడు. తాను ఈరోజే ఆ సినిమా చూస్తానని చెప్పాడు. ఇక అత్యంత ప్రమాదకరమైన బందిపోటు దొంగ వీరప్పన్ జీవితం, అతడి కాలం గురించిన వివరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ మంచి ఫాంలో ఉన్నాడని కితాబిచ్చాడు. వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్ చాలా అద్భుతంగా చేశాడని కూడా అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మరోసారి రామ్ గోపాల్ వర్మ పెద్ద హిట్ సాధించడం ఖాయమేననిపిస్తోంది. #Veerappan gives an insight into the life and times of the dreaded bandit. RGV is in good form. Sandeep Bhardwaj as Veerappan is superb. — taran adarsh (@taran_adarsh) 26 May 2016 Reports are out n #Veerappan is a fantastic film. Every actor has done great job except Lisa Roy. So I will watch it today only. — KRK (@kamaalrkhan) 26 May 2016 -
ఇలాంటి సినిమాలు అవసరం : వర్మ
'నాకు నచ్చిందే నేను తీస్తాను, మీకు ఇష్టమైతేనే నా సినిమా చూడండి' అంటూ మొండిగా వాదించే దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ, తన తదుపరి సినిమా విషయంలో మాత్రం కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను వీరప్పన్ సినిమా ఎందుకు తీశాడో తన ట్వీట్ల ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఇలాంటి క్రిమినల్స్ జీవితం గురించి తెలుసుకోవటం అవసరం అంటూ సందేశం ఇస్తున్నాడు. 'వీరప్పన్ లాంటి క్రిమినల్స్ గురించి తెలుసుకోవటం అవసరం, ఎందుకంటే ఇలాంటి వాళ్లను ఎలా అంతమొందించాలో తెలిసినప్పుడే సమాజంలో ప్రగతి సాధ్యమవుతుంది. వీరప్పన్ తీయటంలో దుర్మార్గులను గొప్పగా చూపించే ఉద్దేశం లేదు. అతడు ఆ స్థాయికి ఎలా వచ్చాడో తెలియజేసే ప్రయత్నం మాత్రమే. వీరప్పన్ కథ ఓ సామాన్యుడు ప్రస్తుత వ్యవస్థను ఎలా మలుపు తిప్పగలడో తెలియజేసే నిదర్శనం. వీరప్పన్, రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకోవటం ఆసక్తికరమైన విషయమేం కాదు, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసిన వీరప్పన్‌కు సాధారణంగానే నెక్ట్స్ టార్గెట్ రజనీకాంత్'. అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న వీరప్పన్.. హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమిళనాట ఈ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు ఎదురుకావచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్మ వివరణ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. కన్నడ, తెలుగు భాషలో మంచి విజయం సాధించిన వీరప్పన్ బాలీవుడ్లో కూడా సక్సెస్ సాధిస్తుండన్న నమ్మకంతో ఉన్నాడు వర్మ. it's very important to study bad people like Veerappan because knowledge of how to finish bad people is what which advances society — Ram Gopal Varma (@RGVzoomin) 25 May 2016 Making Veerappan is not about glorifying a criminal but it's to put a mirror to how he was allowed to happen in the first place — Ram Gopal Varma (@RGVzoomin) 25 May 2016 Story of Veerappan is a proof that just one unpredictable man can overturn an entire existing system..same is true for Donald Trump too — Ram Gopal Varma (@RGVzoomin) 25 May 2016 What's surprising in Veerappan wanting to kidnap Rajnikanth? He kidnapped Kannada Super Star Rajkumar..Rajnikanth is a natural extension — Ram Gopal Varma (@RGVzoomin) 25 May 2016 -
రజనీకాంత్ కిడ్నాప్‌కు వీరప్పన్ ప్రయత్నం!
కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడట. అసలు రజనీ కంటే తానే గొప్పవాడినని వీరప్పన్ అనుకునేవాడని, అందుకే ఓ సమయంలో కిడ్నాప్ చేసినప్పుడు తనకు డబ్బులు ఇవ్వడానికి బదులు తనమీద ఒక సినిమా తీయాలని డిమాండ్ చేశాడని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పాడు. కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్‌తో మళ్లీ వీరప్పన్ సినిమా తీస్తున్న వర్మ.. అతడి జీవితంపై బాగా రీసెర్చ్ చేశాడు. వీరప్పన్ గ్యాంగులో ఉన్న మాజీ సభ్యుల ఇంటర్వ్యూలు, ప్రభుత్వానికి - వీరప్పన్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లను సంప్రదించి వీరప్పన్ గురించిన వివరాలు సేకరించాడు. వీరప్పన్ కొత్త సినిమాను బాలీవుడ్ హీరో సచిన్ జోషి నిర్మించడంతో పాటు అందులో నటిస్తున్నాడు. ఈ సినిమాలోనే రజనీకాంత్ కిడ్నాప్‌నకు వీరప్పన్ ప్రయత్నించిన సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ విషయాన్ని వీరప్పన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారి నుంచి తెలుసుకున్న వర్మ.. అదే అంశాన్ని తన సినిమాలో ప్రధాన సన్నివేశాల్లో ఒకటిగా తీసుకున్నాడు. Veerappan used to think he is more famous than Rajnikanth and at one point he demanded a film to be made on him as a part of his Ransom — Ram Gopal Varma (@RGVzoomin) 17 May 2016 -
వర్మ... అప్పుడే తీసేశాడు
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎనౌన్స్ చేయటమే తెలుస్తుంది. తరువాత ఆ సినిమాను ఎప్పుడు తీస్తాడు, ఎలా తీస్తాడు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అదే జోరులో ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. సౌత్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్‌ల తరువాత వర్మ తీసిన హిట్ సినిమా కిల్లింగ్ వీరప్పన్. మంచి టాక్‌తో పాటు వసూళ్లను కూడా సాధించిన ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ప్రకటన తరువాత ఎలాంటి సమాచారం ఇవ్వని వర్మ, ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశాడు. అంతేకాదు 'ఈ సినిమా కన్నడ సినిమాకు రీమేక్ కాదు, పూర్తిగా హిందీలో తెరకెక్కించని సినిమా' అంటూ వివరణ కూడా ఇచ్చాడు. వీరప్పన్ పేరుతో బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వీరప్పన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు. వర్మ మార్క్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతన్న వీరప్పన్ మే 27న రిలీజ్ కానుంది. #veerappanfirstlook ..Not a remake of Kannada superhit "Killing Veerappan" completely Remade in Hindi as a biopic pic.twitter.com/erEJOYia7K — Ram Gopal Varma (@RGVzoomin) 12 April 2016 -
హిందీలో ‘గవర్నమెంట్’
మాఫియా సినిమాలు తీయడంలో రామ్‌గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ‘సత్య, కంపెనీ, సర్కార్’ తదితర చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు మళ్లీ మాఫియా నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ‘గవర్నమెంట్’ పేరుతో ఓ సినిమా రూపొందించనున్నారు. ఇది హిందీ చిత్రం. మాఫియా డాన్లు దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ల మధ్య నెలకొన్న మనస్పర్థలు, వాళ్లిద్దరూ విడిపోయాక పుట్టగొడుగుల్లా వచ్చిన ఛోటా ఛోటా డాన్లు, హఠాత్తుగా అబూ సలేమ్ డాన్‌గా ఎదగడం వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూడు పాత్రలతో పాటు ఇంకా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, శివసేన అధినేత దివంగత బాల్ థాకరే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, నటి మోనికా బేడి, ఛోటా రాజన్ సతీమణి సుజాత... ఇలా పలువురి జీవితాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. దావూద్ ఇబ్రహీమ్-ఛోటా రాజన్ల జీవితం ఆధారంగా ‘కంపెనీ’ తీసినప్పటికీ అది కాల్పనిక కథ అనీ, ‘గవర్న మెంట్’ సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. ‘సర్కార్ 3’కీ, దీనికీ కూడా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. -
అంతర్జాతీయ స్థాయిలో 'వీరప్పన్' సినిమా: వర్మ
తాజా సినిమా 'కిల్లింగ్ వీరప్పన్'తో మరోసారి తన సత్తా చాటుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ చిత్రాన్ని యథాతథంగా హిందీలో విడుదల చేయబోనని ప్రకటించాడు. ఇందుకు బదులుగా మొదట గంధపు చెక్కల స్మగ్లర్ 'వీరప్పన్' జీవితకథను సినిమాగా తీసి.. దీనిని హిందీలోనూ, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తానని ట్విట్టర్లో తెలిపారు. ఆ తర్వాత 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు. 'వీరప్పన్' జీవిత కథను అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కించేందుకు దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త, అతని పార్ట్నర్ ముందుకొచ్చారని వర్మ చెప్పారు. 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా కన్నడంలో సూపర్‌హిట్ అయినప్పటికీ.. దానిని యథాతథంగా ఉత్తర భారత ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్త సినీ ప్రియులకు అందించబోనని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన నేరగాడైన వీరప్పన్ గురించి దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు కనుక.. అతని ఆత్మకథను తెలియజేయకుండానే అతడు ఎలా చనిపోయాడనేది 'కిల్లింగ్ వీరప్పన్'లో చూపించామని, అయితే ఉత్తరాది వారికి, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు వీరప్పన్ గురించి తెలియకపోవడంతో 'కిల్లింగ్ వీరప్పన్'కు వారికి అర్థం కాకపోవచ్చునని, అందుకే మొదట 'వీరప్పన్' ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తానని, 'కిల్లింగ్ వీరప్పన్'లోని వారు కాకుండా ఈ సినిమాలో పూర్తిగా వేరే నటీనటులు ఉంటారని చెప్పారు. ఆ తర్వాత వీరప్పన్‌ను ఎలా చంపారనేది సినిమాగా చూపిస్తామని వర్మ క్లారిటీ ఇచ్చారు. -
కిల్లర్ వీరప్పన్
-
వీరప్పన్ భార్యపై కేసు
టీనగర్: అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేసినందుకు చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్యైపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరప్పన్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వేలాది ఏనుగులను హతమార్చి దంతాలు, చందనం దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. 2004 లో రాష్ట్ర ఎస్టీఎఫ్ దళాల చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ మృతదేహం సేలం జిల్లా, కొలత్తూరు సమీపాన ఉన్న మూలకాడులో ఖననం చేయబడింది. ఆదివారం చందనపు స్మగ్లర్ వీరప్పన్ 11వ సంస్మరణ దినాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలక్కాడు, మేచ్చేరిలో అనేక చోట్ల పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మేచ్చేరిలో అనుమతి లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు మేచ్చేరి పోలీసులు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై కేసు నమోదు చేశారు. -
సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా?
నటి కుష్బు పేరు మరోసారి వార్తల్లో కెక్కింది. దర్శకుడు ఏఎం ఆర్మ్రేష్ ఆమెపై ధ్వజమెత్తారు. ఇంతకుముందు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో వనయుద్ధం, రాజీవ్‌గాంధీ హత్యోదంతో కుప్పి చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా ఒరు మెల్లియకొడు పేరుతో చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశిధర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్ర కథ గురించి చెప్పాలని చిత్ర యూనిట్ సభ్యులను కుష్బు డిమాండ్ చేసినట్లు దర్శకుడు రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు కుష్బు చర్యలను ఆయన మండిపడ్డారు. కుష్బు తమ యూనిట్‌కు చెందిన ఒకరితో చిత్ర కథ గురించి విచారించారన్నారు. సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా? అంటూ అడిగారని అన్నారు. అయితే తన చిత్ర కథను ఎవరికి చెప్పేది లేదన్నారు. ఏ దర్శకుడు, నటుడు తన చిత్ర కథ గురించి బయటకు చెప్పరన్నారు. అయినా కుష్బు తన సహాయ దర్శకుడిని కథ గురించి అడిగేకంటే డెరైక్ట్‌గా తననే అడగవచ్చన్నారు. నిజమే తన చిత్రం ఒక మర్మ హత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమేనని స్పష్టం చేశారు. మనీషా కొయిరాల హత్యకు గురవుతారన్నారు. ఆ హత్య గురించి ఇన్వెస్టిగేషన్నే చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని దర్శకుడు రమేష్ అన్నారు. నేను ఎవరినీ అడగలేదు : రమేష్ ఆరోపణలను నటి కుష్బు ఖండించారు. దీని గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంలో చిత్రం రూపొందుతోందని ఆ చిత్ర కథ గురించి చెప్పాలని తాను డిమాండ్ చేసినట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. నిజానికి అలా తాను ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. అర్జున్ భార్య చిత్రంలో నటించమని తనను అడిగారన్నారు. తాను చిత్రాల్లో నటించడం మానేసి చాలా కాలం అయ్యిందని వారికి చెప్పానని అంతేకానీ కథ గురించి కూడా అడగలేదని కుష్బు పేర్కొన్నారు. -
కన్నీటి సంద్రం
వీరప్పనూరుగా నామకరణం ఒకప్పుడు వీరప్పన్ వద్ద అనుచరులుగా ఉంటూ ఎర్ర చందనం తరలిస్తున్న వారు వీరప్పన్ గుర్తుగా జవ్యాది కొండపై వీరప్పనూర్గా నామకరణం చేశారు. నేటికీ ఆ గ్రామంలో దాదాపు 90 శాతం ప్రజలు కట్టెలు కొట్టడంలోనే నిమగ్నం అయ్యారు. వీరప్పన్ ఉండే సమయంలో ఈ గ్రామంలోని ప్రజలందరూ వీరప్పన్ వద్ద పనిచేసే వారు. ప్రస్తుతం చిన్నచిన్న కట్టెలు కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం తరలిస్తున్నట్లు తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను ఆంధ్ర పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం విదితమే. వీరిలో 12 మంది తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం, జవ్యాది కొండవాసులుగా గుర్తించారు. మృతి చెందిన వారి వివరాలను ఆంధ్ర పోలీసులు వాట్సాప్ ద్వారా తమిళనాడు పోలీసులకు సమాచారం అందించి అటవీ ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. మృతి చెందిన వారి వివరాలు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా అనంతపురం సమీపంలోని మురుగంబాడి గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు మునస్వామి(38), అదే గ్రామానికి చెందిన మూర్తి(36), గాంధీనగర్‌కు చెందిన శివాజీ కుమారుడు మహేంద్రన్(23), కళశ ముత్తు గ్రామానికి చెందిన వేలు కుమారుడు పయణి(38), పడవేడు సమీపంలోని వేటగిరి బానయత్త గ్రామానికి చెందిన పెరుమాల్(38), వేటగిరిపాళ్యంకు చెందిన మురుగన్(36), అదే గ్రామానికి చెందిన శశికుమార్(35) గా గుర్తించారు. జవ్యాది కొండ సమీపంలోని మేల్ కనవనూర్ గ్రామానికి చెందిన రామస్వామి కుమారుడు పన్నీర్‌సెల్వం(25), మేల్కుప్పసనూర్కు చెందిన గోవిందన్ కుమారుడు రాజేంద్రన్(32), అదే గ్రామానికి చెందిన సడయాన్ కుమారుడు గోవిందస్వామి(38), వెల్లయ్యన్ కుమారుడు వళ్లిముత్తు(22), చిన్నపయ్యన్ కుమారుడు చిన్నస్వామి(47)గా ఉన్నారు. ప్రస్తుతం మృతి చెందిన వారిలో నలుగురు మేల్కుప్పసనూర్ గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలోని ప్రజలు శోక సముద్రంలో మునిగి పోయారు. బందోబస్తు నడుమ మృత దేహాలు అప్పగింత ఆంధ్ర పోలీసులు తిరుపతిలో పోస్టుమార్టం నిర్వహించిన మృత దేహాలను వేలూరు, తిరువణ్ణామలై, తిరువ ళ్లూరు జిల్లాలకు చెందిన అధికారులకు అప్పగించారు. ఈ మృత దేహాలను ఆంధ్ర పోలీసులు తమిళనాడు అంబులెన్స్ ద్వారా ఆంధ్ర సరిహద్దు వరకు తీసుకొచ్చారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న తమిళనాడు పోలీసులు మృత దేహాలను పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తిరువణ్ణామలైకి తీసుకొచ్చారు. కన్నీరు మున్నీరు మృత దేహాలను చూసిన బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీర య్యారు. మృత దేహాల కోసం, భార్య పిల్లలతో సహా తల్లులు, బంధువులు రాత్రంగా ఎదురు చూస్తూ తీవ్ర శోకంలో మునిగిపోయారు. మృత దేహాలను అంబులెన్స్ ద్వారా పోలీసులు తీసుకు రావడంతో ఒక్కసారిగా బిగ్గరగా రోదించారు. మృతదేహాలతో రాస్తారోకో ఎన్కౌంటర్లో మృతి చెందిన వేటగిరి పాళ్యంకు చెందిన శశికుమార్, మురుగన్, పెరుమాల్ బంధువులు మృత దేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం ఆ మృత దేహాలను తీసుకొని పడవేడు మెయిన్ రోడ్డుకు ఊరేగింపుగా వెళ్లి మృత దేహాలను నడిరోడ్డుపై పెట్టి రాస్తారోకో చేశారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలని, మృత దేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని నినాదాలు చేశారు. మృత దేహాలను చూసేందుకు మంత్రు లు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ రాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. మృతదేహాలకు కాళ్లు, చేతులు మాయం సొంత గ్రామాలకు చేరుకున్న మృత దేహాలను పరిశీలించారు. కన్నమంగళం సమీపంలోని కాళ సముద్రం గ్రామానికి చెందిన పయణి బీఎడ్ పట్టభద్రుడు. ఇతనికి మూడు నెలల మగ బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను చేతిలో పెట్టుకొని భార్య లోగనాయగి కన్నీరు మున్నీరయింది. ఆ సమయంలో పయణి కుడి కాలు కనిపించక పోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బుల్లెట్ శరీరంలో తగిలి ఉంటే ఒక కాలు లేకుండా పంపడం ఎందుకని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా పుదూర్ కొళ్లమేడుకు చెందిన మహేంద్రన్ మృత దేహంలో కూడా కుడి కాలు లేకపోవడంతో బంధువులు ఆశ్చర్య పోయారు. వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని తల్లి చిత్ర, సోదరుడు మాధవన్ డిమాండ్ చేశారు. కూలీలను చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపి ఉంటారని ఆంధ్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కన్న మంగళంలో దుకాణాలు మూసివేత మృతి చెందిన 12 మంది కూలీలు కన్నమంగళం, జవ్యాది కొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు కావడంతో వారి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒక్కరోజు దుకాణాలు మూసివేసి వ్యాపారులు ధర్నా చేశారు. పార్టీలకు అతీతంగా వ్యాపారులు దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శోక సంద్రంలో అటవీ ప్రాంతవాసులు ఒక్కసారిగా పక్కపక్క గ్రామాలకు చెందిన అటవీ ప్రాంత వాసులు 12 మంది మృతి చెందడంతో జవ్యాది కొండ, కన్నమంగళం వంటి చుట్టు పక్కల గ్రామస్తులు శోక సముద్రంలో మునిగి పోయారు. అటవీ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ మృత దేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి మృత దేహాలుగా మిగిలి పోయారని వాపోయారు. కూలీలను తరలించే ఏజెంట్ల కోసం గాలింపు తిరువ ణ్ణామలై, వేలూరు జిల్లాల నుంచి ఎర్ర కూలీలను తీసుకెళ్లే ఏజెంట్ల కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. కూలీలను ఏ ప్రాంతానికి చెందిన ఏజెంట్లు తీసుకెలుతున్నారు. వారిని ఎలా అడవికి తరలిస్తున్నారు. కూలీలు తీసుకొచ్చే ఎర్ర చందనాన్ని ఎక్కడికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వేలూరు, జవ్యాది కొండ, కన్నమంగళం, పోలూరు, తిరుపత్తూరు వంటి అటవీ ప్రాంతాల గ్రామస్తుల వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆ భూముల్లోకి బాంబులు ఎలా వచ్చాయి?
చెన్నై : ఒక వైపు అటవీ భూమి, మరోవైపు స్పెషల్ టాస్క్ఫోర్సు అధికారుల పర్యవేక్షణ ఇవేమీ నిందితుల ఆగడాలను అడ్డుకోలేకపోయాయి. అయినా గుట్టుచప్పుడు కాకుండా భయంకరమైన పేలుడు పదార్థాలను భూమిలో పాతిపెట్టేసి, చల్లగా జారుకున్నారు. సేలం జిల్లా మేట్లూరు సమీపంలోని కొలత్తూరు అటవీ భూముల్లో మంగళ, బుధవారాల్లో బయటపడిన పేలుడు పదార్థాల డంప్ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఒకప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ సంచరించిన ప్రాంతం, 20 ఏళ్ల క్రితం విడుదలై చిరుతైగళ్ అనే విప్లవకారులు రహస్యంగా శిక్షణ పొందిన ప్రదేశం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతంగా పరిగణిస్తోంది. అందుకే ఈ అటవీ ప్రాంతంలో అన్యుల ప్రవే శాన్ని అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్ఫోర్సు పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖవారు 50 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యూరు. మొక్కల కోసం మంగళవారంనాడు అటవీ సిబ్బంది గుంతలు తవ్వుతుండగా లోహపు శబ్దాలు వినపడ్డాయి. మరింత లోతుకు తవ్విచూడగా భూమి లోతుల్లో దాచివుంచిన పాత ఇనుప బేరల్ దొరికింది. ఆ బేరల్‌ను పగులగొట్టి చూరగా, అందులో అనేక చేతి బాంబులు, డిటోనేటర్లు, తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించింది. అంతేగాక మూడు పాలిథిన్ కవర్లలో తుపాకీ విడిభాగాలు లభ్యమయ్యూయి. వాటిని చూసి హడలిపోయిన అటవీ సిబ్బంది సేలం ఎస్పీ శక్తివేల్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్పీతోపాటూ క్యూబ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదే పరిసరాల్లో తవ్విచూడగా మరిన్ని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఆయా పేలుడు పదార్థాల్లో కొన్నింటిపై ఎల్టీటీఈ అని రాసి ఉండటాన్ని కనుగొన్నారు. డంప్ దొరికిన స్థలానికి సమీపంలోని గోడమీద బుల్లెట్ తగిలిన గుర్తులను కనుగొన్నారు. 1980లో విడుదలై చిరుతైగళ్ అనే విప్లవకారులు పేలుడు పదార్థాల వినియోగం, తుపాకీ కాల్పులపై శిక్షణ పొందిన ప్రాంతంలో ఈ డంప్ దొరకడం అధికారులను ఆలోచింపజేసింది. డంప్‌లో దొరికిన పేలుడు సామగ్రి ఎక్కడా తప్పుపట్టినట్లుగా లేదు. రెండు దశాబ్దాలకు పైగా మట్టిలో పూడ్చిపెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా తుప్పుపట్టి ఉండేవి. పోనీ విద్రోహశక్తులు ఇటీవలే దాచిపెట్టారా అందామంటే ఈ భూములు 20 ఏళ్లుగా స్పెషల్ టాస్క్ఫోర్సు ఆధీనంలో ఉన్నారుు. ఈ భూముల్లో డంప్‌ను పాతిపెట్టడం ఎలా సాధ్యమని తలలు పట్టుకుంటున్నారు. మందు గుండు సామగ్రి దొరికిన చోట బందోబస్తును ఏర్పాటు చేసి క్యూ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'దండుపాళ్యం' తెచ్చిన గంధపు చెక్క లాంటి ఆఫర్
-
'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ గ్యాంగ్..'
ఎర్ర చందనం అక్రమ రవాణాలో వీరప్పన్ అనుచరుల హస్తం ఉండవచ్చనే అనుమానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చీఫ్ బి ప్రసాదరావు వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను స్మగ్లర్లు హత్య చేయడం ఆందోళన కలిగిస్తోంది అని ప్రసాదరావు అన్నారు. హత్యలను, సంఘటనలను బట్టి చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ గ్యాంగ్ ఉందేమో అనే అనుమానం కలుగుతోంది అని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ అనుచరుల పాత్ర ఉందో లేదో అని స్పష్టంగా చెప్పలేము కాని.. అక్రమ కలప రవాణకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లేనని డీజీపీ అన్నారు. అక్రమ కలప రవాణ మాఫియాను అరికట్టేందుకు ఫారెస్ట్ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఫారెస్ట్ అధికారులతోపాటు, ఆయుధాలు ధరించిన పోలీసులతో చెక్ పోస్ట్ ల వద్ద భారీ నిఘాను పెట్టమాని ప్రసాదరావు ఓప్రశ్నకు సమాధానంగా జవాబిచ్చారు. 2013 సంవత్సరంలో అక్రమ ఎర్రచందనం రవాణా వ్యవహారంలో 3249 మందిని అరెస్ట్ చేసి.. 531 కేసుల్ని నమోదు చేశామని తెలిపారు. -
దొంగ పోలీసులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఇద్దరు పోలీసు అధికారులు వీరప్పన్ అవతారం ఎత్తారు. స్మగ్లర్లతో కుమ్మక్కై ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమ రవాణాతో కొల్లగొట్టిన సొమ్మును పంచుకుతింటున్నారు. ఎర్రచందనం దుంగల వాహనాలకు ఓ పోలీసు అధికారి పైలట్‌గా వ్యవహరిస్తే.. మరో అధికారి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. నిఘా వర్గాల విచారణలో ఇద్దరు ఎస్సైల అక్రమాల దందా బహిర్గతమవడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలో విస్తరించిన నల్లమల అడవుల్లో ఎర్రచందనం దుంగలు విస్తారంగా లభిస్తోన్న విషయం విదితమే. తమిళనాడు, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన స్మగ్లర్లు కూలీలను పెట్టి.. ఎర్రచందనం దుంగలను నరికించి, అక్రమ రవాణా చేస్తోన్న విషయం విదితమే. ఎర్రచందనం అక్రమ రవాణాపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు వ్యూహం మార్చారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను అనంతపురం జిల్లా గుండా బెంగళూరుకు తరలించి, కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో కదిరి రేంజ్‌లోని ఓ అటవీ శాఖ అధికారి తొలుత స్మగ్లర్లతో చేతులు కలిపారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను కదిరి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో ఆ అధికారి సహకారంతో దాచి.. గుట్టుగా బెంగళూరుకు తరలించేవారు. ఇది గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఏడాది క్రితం కదిరి పరిసర ప్రాంతాల్లోని అడువుల్లో నిర్వహించిన దాడుల్లో అటవీ శాఖ అధికారి దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు తమదైన శైలిలో విచారించడంతో ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. కదిరి పరిసర ప్రాంతాల్లో దాచిన ఎర్రచందనం దుంగలను కదిరి, ఓడీసీ, గోరంట్ల మీదుగా కర్ణాటక సరిహద్దుల్లోకి చేర్చి.. బెంగళూరుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో అటవీ శాఖ అధికారి అంగీకరించారు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వాహనానికి ఆ ప్రాంతంలో పనిచేస్తోన్న ఓ ఎస్సై తన వాహనంలో పైలట్‌గా వ్యవహరిస్తారని విజిలెన్స్ అధికారులకు చెప్పారు. ఇదే అంశాన్ని అప్పట్లో విజిలెన్స్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడంతో.. ఆ ఎస్సైపై బదిలీ వేటుతో సరిపుచ్చుకున్నారు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఇటీవల కదిరి ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించిన అధికారి ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్‌గా అవతారం ఎత్తారు. స్మగ్లర్లతో కుమ్మక్కై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నల్లమల అడవుల్లో పర్యటించి.. ఎర్రచందనం వృక్షాలను గుర్తిస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రదేశాలకు కూలీలను పంపి.. వాటిని నరికించి, కదిరి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోకి చేర్చుతున్నారు. ఆ తర్వాత వాటిని బెంగళూరుకు ఆ పోలీసు అధికారే చేర్చుతున్నారు. ఈ పోలీసు అధికారికి గతంలో ఈ ప్రాంతంలో పని చేసి, బదిలీ అయిన ఎస్సై సహకారం అందిస్తున్నారు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు చేర వేశాయి. పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్సైల వ్యవహార శైలిపై సమగ్ర విచారణ చేశారు. ఇద్దరు ఎస్సైల అక్రమాల దందా ఉన్నతాధికారుల విచారణలో బహిర్గతమైంది. ఆ ఇద్దరు ఎస్సైలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఉపక్రమించిన సందర్భంలోనే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది. దాంతో.. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమం నేపథ్యంలో ఆ ఇద్దరు ఎస్సైలపై చర్యలు తీసుకుంటే.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వెనక్కుతగ్గారు. ఇదే అలుసుగా తీసుకున్న ఆ ఇద్దరు ఎస్సైలు ఇటీవల మరింత రెచ్చిపోతుండటంతో ఉన్నతాధికారులు ఆగ్రహించారు. ఇద్దరిపై సస్సెన్షన్ వేటు వేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడటం ఖాయమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. -
వీరప్పన్ వస్తున్నాడు
మూడు రాష్ట్రాల పోలీసుల్ని గడగడలాడించి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. అతని జీవిత కథాంశంతో రూపొందిన చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘వీరప్పన్’ పేరుతో అనువాదమవుతోంది. ఎ.ఎమ్.ఆర్.రమేష్ దర్శకుడు. ఎమ్.వెంకట్రావ్, ఎ.ఎమ్.ఆర్.రమేష్, కె.రామకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. అర్జున్, లక్ష్మీరాయ్, కిషోర్, రవి కాలె ఇందులో ముఖ్యతారలు. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వీరప్పన్ ఎక్కడ నివసించాడు? ఏఏ ప్రాంతాల్లో తిరిగాడు? అతని జీవన శైలి ఏంటి? వంటి అంశాలను ఇందులో దర్శకుడు క్లియర్‌గా చూపించారు. వీరప్పన్ తిరిగిన రియల్ లొకేషన్స్‌లోనే చిత్రీకరణ చేశారు. వీరప్పన్ పాత్రలో కిషోర్ అద్భుతంగా నటించారు. పోలీస్ అధికారిగా యాక్షన్ కింగ్ అర్జున్ అదరగొట్టారు. సందీప్ చౌతా సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్‌గా ఉంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ మిల్టన్.