జైలర్ మూవీ సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ తలైవా మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా డిసెంబర్ 12న ఆయన తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విషెస్ తెలిపారు. అయితే రజినీకాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తలైవా పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. గతంలోనే తలైవాను హెచ్చరించినట్లు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. ఎంజీఆర్‌లాగే రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వీరప్పన్ ముందు జాగ్రత్తగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ సందర్భంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 రిలీజ్ చేసిన వీడియోలో కనిపించింది. కానీ అందులో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల నేపథ్యంలో వీరప్పన్ తనదైన శైలిలో స్పందించినట్లు తెలుస్తోంది. ఆయనను దోచుకునేందుకు.. మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని రజినీకాంత్‌ను వీరప్పన్ ఆ వీడియోలో హెచ్చరించారు. అయితే ఈ వీడియో మూవీ ప్రమోషన్స్‌లో భాగమే అయినప్పటికీ.. అందులో వీరప్పన్ మాట్లాడిన మాటలు నిజమేనని తెలుస్తోంది.
వీడియోలో వీరప్పన్ మాట్లాడుతూ..'అప్పట్లో ఎంజీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. కానీ ఎంజీఆర్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టడం కష్టం. రజినీకాంత్ కూడా అలా అవుతారని నాకు బాగా తెలుసు. ఆయన దేవుడిని బాగా నమ్ముతారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. కానీ నేను మీకు విషయం చెప్పదలచుకున్నా. అయ్యా రజనీకాంత్.. మీరు రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ సపోర్ట్ చేయొద్దు. మిమ్మల్ని మింగడానికి అక్కడ మొసళ్లు రెడీగా ఉన్నాయి. ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి నువ్వు బలికావద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరలవుతోంది. వీరప్పన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment