veerappan movie
-
'మొసళ్లు సిద్ధంగా ఉన్నాయి'.. సూపర్ స్టార్‌కు స్వీట్ వార్నింగ్!
జైలర్ మూవీ సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ తలైవా మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా డిసెంబర్ 12న ఆయన తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విషెస్ తెలిపారు. అయితే రజినీకాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తలైవా పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. గతంలోనే తలైవాను హెచ్చరించినట్లు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. ఎంజీఆర్‌లాగే రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వీరప్పన్ ముందు జాగ్రత్తగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ సందర్భంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 రిలీజ్ చేసిన వీడియోలో కనిపించింది. కానీ అందులో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల నేపథ్యంలో వీరప్పన్ తనదైన శైలిలో స్పందించినట్లు తెలుస్తోంది. ఆయనను దోచుకునేందుకు.. మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని రజినీకాంత్‌ను వీరప్పన్ ఆ వీడియోలో హెచ్చరించారు. అయితే ఈ వీడియో మూవీ ప్రమోషన్స్‌లో భాగమే అయినప్పటికీ.. అందులో వీరప్పన్ మాట్లాడిన మాటలు నిజమేనని తెలుస్తోంది. వీడియోలో వీరప్పన్ మాట్లాడుతూ..'అప్పట్లో ఎంజీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. కానీ ఎంజీఆర్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టడం కష్టం. రజినీకాంత్ కూడా అలా అవుతారని నాకు బాగా తెలుసు. ఆయన దేవుడిని బాగా నమ్ముతారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. కానీ నేను మీకు విషయం చెప్పదలచుకున్నా. అయ్యా రజనీకాంత్.. మీరు రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ సపోర్ట్ చేయొద్దు. మిమ్మల్ని మింగడానికి అక్కడ మొసళ్లు రెడీగా ఉన్నాయి. ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి నువ్వు బలికావద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరలవుతోంది. వీరప్పన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి వీరప్పన్ జీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. ఆడియన్స్ పల్స్‌కు తగినట్టుగానే ప్రతివారం కొత్త కంటెంట్‌తో ఓటీటీలు దూసుకెళ్తున్నాయి. కొత్త కొత్త సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతివారం ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన కోలీవుడ్ వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తమిళనాడులో సంచలనంగా మారిన వీరప్పన్ గురించి అందరికీ తెలుసు. ఆయన జీవిత కథనే వెబ్ సిరీస్(డాక్యుమెంటరీ) రూపంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అడవుల్లోకి పారిపోయి దాచుకుని దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థానికి ప్రభుత్వాలకు దొరకకుండా తప్పించుకున్న వ్యక్తి వీరప్పన్. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కూసే మునిస్వామి వీరప్పన్. ఈ సిరీస్ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) టీమ్ చేసిన ఎన్కౌంటర్లో వీరప్పన్ మరణించారు. -
వీరప్పన్ డెన్‌లో నిధి ఉంది: కుమార్తె విజయలక్ష్మి
సాక్షి, చెన్నై: చందనపు దొంగ వీరప్పన్ రాజ్యమేలిన సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్టు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన చందనపు దొంగ వీరప్పన్ ఈరోడ్ జిల్లా సత్యమంగళం అడవుల్ని స్థావరంగా చేసుకుని చందనపు దుంగలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌లో రాజ్యమేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరప్పన్ లేడు. 2004లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం అంతమైనా, తరచూ వీరప్పన్ పేరు మాత్రం వార్తల్లోనే ఉంటూ వస్తున్నది. ఇందుకు కారణం ఆయన కుటుంబమే. వీరప్పన్‌కు సతీమణి ముత్తులక్ష్మి, విద్యారాణి, విజయలక్ష్మి కుమార్తెలు ఉన్నారు. విద్యారాణి బీజేపీలో చేరి మహిళా యువజన నేతగా ఉన్నారు. ఇక, విజయలక్ష్మి తమిళర్ వాల్మురిమై కట్చిలో ఉన్నారు. ఈనెలాఖరులో తెరకెక్కనున్న మావీ రన్ పిళ్లై చిత్రంలో నటించారు. ఈ చిత్రం చందనపు దొంగ జీవిత ఇతివృత్తంతో చిత్రికరించినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే పోస్టర్లు, టీజర్లు ఉండడం చర్చకు దారి తీశాయి. అయితే, దీనిని విజయలక్ష్మి ఖండించారు. పెద్ద డంప్.. చెన్నైలో చిత్ర యూనిట్ కలిసి జరిగిన సమావేశంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ఈ చిత్రానికి తన తండ్రి జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళాసాధికారితకు సంబంధించిన చిత్రంగా వివరించారు. తనకు తండ్రి వీరప్పన్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన సత్యమంగళం అడవుల్లోనే అత్యధిక కాలం జీవించారని పేర్కొన్నారు. ఈ అడవుల్లో తన తండ్రి దాచిపెట్టిన అతి పెద్ద నిధి ఉందని, దీనిని కనిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ నిధి గురించి తెలిసిన తన తండ్రి, ఆయన అనుచరుడు ఈ లోకంలో లేరని, ఈ దృష్ట్యా, ఆ నిధి ఎక్కడుందో ప్రశ్నార్థకమేనని ముగించడం గమనార్హం. చదవండి: అమిత్ షా రాజీనామా చేయాలి -
వీరప్పన్ చిత్రం విడుదలపై అభ్యంతరం
బెంగళూరు : తమ అనుమతిలేనిదే 'కిల్లర్ వీరప్పన్' సినిమా విడుదల చేయరాదని వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి మాత్రమే తన నుంచి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అనుమతి పొందారని చెప్పారు. అయితే కన్నడ, తమిళ భాషల్లో సినిమా తీయడానికి అనుమతి పొందలేదని ఆమె స్పష్టం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీ, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయాలన్నారు. అదికూడా మొదట తాను కిల్లర్వీరప్పన్ చిత్రం చూసిన తరువాతేనే ఆ సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కిల్లర్ వీరప్పన్ అనే సినిమా టైటిల్ అభ్యంతరంగా ఉందని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు వీరప్పన్‌ను అవహేళనగా చూపించినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమాలో వీరప్పన్‌ను చెడుగా చూపించినట్లైతే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు. 2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. కన్నడ, తమిళ భాషల్లో కిల్లర్ వీరప్పన్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేసే సమయంలో కేసు పెట్టి ఇలా అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు.