ఓటీటీకి వీరప్పన్ జీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Koose Munisamy Veerappan Life Story Web Series Streaming On Next month | Sakshi
Sakshi News home page

Veerappan: ఓటీటీకి  'కూసే మునిస్వామి వీరప్పన్'..  స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Sun, Nov 26 2023 12:28 PM | Last Updated on Sun, Nov 26 2023 12:30 PM

Koose Munisamy Veerappan Life Story Web Series Streaming On Next month - Sakshi

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. ఆడియన్స్ పల్స్‌కు తగినట్టుగానే ప్రతివారం కొత్త కంటెంట్‌తో ఓటీటీలు దూసుకెళ్తున్నాయి. కొత్త కొత్త సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ప్రతివారం ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన కోలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

తమిళనాడులో సంచలనంగా మారిన వీరప్పన్ గురించి అందరికీ తెలుసు. ఆయన జీవిత కథనే  వెబ్ సిరీస్‌(డాక్యుమెంటరీ) రూపంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అడవుల్లోకి పారిపోయి దాచుకుని దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థానికి ప్రభుత్వాలకు దొరకకుండా తప్పించుకున్న వ్యక్తి  వీరప్పన్. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కూసే మునిస్వామి వీరప్పన్. ఈ సిరీస్‌ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) టీమ్ చేసిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement