గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి (ఎన్‌టీసీ) టికెట్‌పై ఆమె కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి జూలై 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. ఇటీవల ఆమె నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని ఎన్‌టీకే పార్టీలో చేరారు
తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులను ఎన్‌టీకే నేత సీమాన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణగిరి నుంచి ఎన్‌టీకే అభ్యర్థిగా విద్యా రాణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మొత్తం 40 మంది ఎన్‌టీకే అభ్యర్థుల్లో సగం మంది మహిళలేని తెలిపారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి కృష్ణగిరిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు. ఆమె తన తండ్రి వీరప్పన్‌ను ఒకే ఒక్కసారి కలిశారట. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి తెలిపారు. తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్‌లోని తాతయ్య ఇంట్లో తన తండ్రిని మొదటిసారిగా, చివరిసారిగా చూశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment