#veerappanfirstlook ..Not a remake of Kannada superhit "Killing Veerappan" completely Remade in Hindi as a biopic pic.twitter.com/erEJOYia7K
— Ram Gopal Varma (@RGVzoomin) 12 April 2016
వర్మ... అప్పుడే తీసేశాడు
Published Wed, Apr 13 2016 7:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎనౌన్స్ చేయటమే తెలుస్తుంది. తరువాత ఆ సినిమాను ఎప్పుడు తీస్తాడు, ఎలా తీస్తాడు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అదే జోరులో ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. సౌత్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ల తరువాత వర్మ తీసిన హిట్ సినిమా కిల్లింగ్ వీరప్పన్. మంచి టాక్తో పాటు వసూళ్లను కూడా సాధించిన ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.
అయితే ప్రకటన తరువాత ఎలాంటి సమాచారం ఇవ్వని వర్మ, ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశాడు. అంతేకాదు 'ఈ సినిమా కన్నడ సినిమాకు రీమేక్ కాదు, పూర్తిగా హిందీలో తెరకెక్కించని సినిమా' అంటూ వివరణ కూడా ఇచ్చాడు. వీరప్పన్ పేరుతో బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వీరప్పన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు. వర్మ మార్క్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతన్న వీరప్పన్ మే 27న రిలీజ్ కానుంది.
Advertisement
Advertisement