
వీరప్పన్‌కు మంచి మార్కులు?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లే కనపడుతున్నాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఊపుతో.. వీరప్పన్ జీవితం మీద మరో సినిమా తీశాడు. ఈ సినిమాకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడ్‌లో ఓ పట్టాన ఏ సినిమానూ పెద్దగా మెచ్చుకోడని పేరున్న కమాల్ ఆర్ ఖాన్ కూడా వీరప్పన్ సినిమాను ప్రశంసించాడు. అయితే ఒక్క లీసా రే తప్ప అందులో అందరూ బాగా చేశారని, సినిమా చాలా అద్భుతంగా ఉందన్న టాక్ వినిపిస్తోందని ట్వీట్ చేశాడు. తాను ఈరోజే ఆ సినిమా చూస్తానని చెప్పాడు.
ఇక అత్యంత ప్రమాదకరమైన బందిపోటు దొంగ వీరప్పన్ జీవితం, అతడి కాలం గురించిన వివరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఆర్‌జీవీ మంచి ఫాంలో ఉన్నాడని కితాబిచ్చాడు. వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్ చాలా అద్భుతంగా చేశాడని కూడా అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మరోసారి రామ్ గోపాల్ వర్మ పెద్ద హిట్ సాధించడం ఖాయమేననిపిస్తోంది.
#Veerappan gives an insight into the life and times of the dreaded bandit. RGV is in good form. Sandeep Bhardwaj as Veerappan is superb.
— taran adarsh (@taran_adarsh) 26 May 2016
Reports are out n #Veerappan is a fantastic film. Every actor has done great job except Lisa Roy. So I will watch it today only.
— KRK (@kamaalrkhan) 26 May 2016