
మా వీరన్ పిళ్లై చిత్ర యూనిట్
చెన్నై : మా వీరన్ పిళ్లై.. వీరప్పన్ కథ కాదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. వీరప్పన్ కుమార్తె విజయలక్ష్మి కథానాయకిగా నటిస్తున్న చిత్రం ‘మా వీరన్ పిళ్లై’. కేఎన్‌ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్‌ఆర్ రాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ సంగీతం అందిస్తుండగా మంజునాథ్ చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను విజయలక్ష్మి శుక్రవారం మీడియాకు వివరించారు. వీరప్పన్ కథకు మావీరన్ పిళ్లై చిత్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇది ఒక జాతికి చెందిన కథ అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే కథతో ఈ చిత్రం రూపొందిందని వెల్లడించారు. ఇందులో తాను న్యాయవాదిగా నటించినట్లు చెప్పారు. ఢిల్లీలో రైతుల పోరాటం. ప్రేమలో మోసపోయిన యువతుల సమస్యలు, ఇతర సామాజిక అంశాలను స్పృశించినట్లు వివరించారు. నిర్మాత మాట్లాడుతూ సెన్సార్ పూర్తి చేసుకున్న మావీరన్ పిళ్లైను త్వరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: నా ఆరోగ్యం బాగుంది!
Comments
Please login to add a commentAdd a comment