టీనగర్: అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేసినందుకు చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్యైపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరప్పన్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వేలాది ఏనుగులను హతమార్చి దంతాలు, చందనం దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. 2004 లో రాష్ట్ర ఎస్‌టీఎఫ్ దళాల చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ మృతదేహం సేలం జిల్లా, కొలత్తూరు సమీపాన ఉన్న మూలకాడులో ఖననం చేయబడింది.
ఆదివారం చందనపు స్మగ్లర్ వీరప్పన్ 11వ సంస్మరణ దినాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలక్కాడు, మేచ్చేరిలో అనేక చోట్ల పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మేచ్చేరిలో అనుమతి లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు మేచ్చేరి పోలీసులు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై కేసు నమోదు చేశారు.