T Nagar
-
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య?
టీ.నగర్ (చెన్నై): కరోనా ఆ కుటుంబాన్ని అప్పుల పాలుజేసింది. ఫలితంగా తీవ్ర దారిద్య్రంలో కూరుకుపోయిన ఆ దంపతులు ముగ్గురు బిడ్డలకు విషం ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన ఉసిలంపట్టిలో సోమవారం చోటు చేసుకుంది. మదురై జిల్లా, ఉసిలంపట్టికి చెందిన శరవణన్ నగల వర్క్‌షాపు నడుపుతుండేవాడు. ఇతని భార్య శ్రీనిధి. వీరికి కుమార్తెలు మహాలక్ష్మి (10), అభిరామి (5), కుమారుడు అముదన్ (5) ఉన్నారు. 20 ఏళ్లుగా వర్క్‌షాపు నడుపుతూ వచ్చిన శరవణన్ వ్యాపారాన్ని కరోనా పరిస్థితులు దారుణంగా దెబ్బతీశాయి. దీంతో గత కొన్ని నెలలుగా అప్పుల బాధతో అవస్థలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. అయితో రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ దంపతులు తమ ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి.. ఆ తర్వాత వారు సేవించారు. కొద్దిసేపటికే నురగలు కక్కుకుంటూ ఐదుగురూ మృతిచెందారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అలాగే సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. చదవండి: ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి -
వికృత చేష్టలు.. ‘పౌడర్’ స్వామి అరెస్ట్
టీ.నగర్/చెన్నై : దెయ్యం వదిలిస్తానంటూ మహిళలను కొరడాతో కొట్టి హింసిస్తున్న పౌడర్ స్వామిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నామక్కల్ జిల్లా కాదపల్లికి చెందిన అనిల్‌కుమార్ (42) మంజనాయకనూరు కరుప్పన్నస్వామి ఆలయాన్ని తన వికృత చేష్టలకు అడ్డాగా మార్చుకున్నాడు. దెయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో తన దగ్గరకు వచ్చిన మహిళలను కొరడాతో దారుణంగా కొట్టేవాడు. అతను ముఖానికి పౌడర్ పూసుకోవడంతో పౌడర్స్వామిగా పేరుపొందాడు. మహిళలను హింసిస్తున్న దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్ చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టడంతో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఎస్పీ శక్తిగణేశన్ ఆదేశాల మేరకు వేలగౌండం పోలీసులు అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
భర్త మరణించిన 10 నిమిషాలకే భార్య సైతం
వేలూరు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. వానియంబాడి తాలుకా కచ్చేరి రోడ్డుకు చెందిన అన్నామలై(78), లక్ష్మమ్మాల్(65) దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అన్నామలై వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. శుక్రవారం అన్నామలై గుండె పోటుతో మృతి చెందారు. అన్నామలై మృతదేహంపై రోదిస్తూ లక్ష్మమ్మాల్ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అన్నామలై మృతి చెందిన పది నిమిషాల్లోనే లక్ష్మమ్మాల్ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేసింది. వివాహిత ఆత్మహత్య టీ.నగర్: కరోనాతో భర్త మృతి చెందడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చెన్నైలో జరిగింది. ఐనావరానికి చెందిన రాజ్‌కుమార్(45) భార్య కల్పన (36). వీరి రెండేళ్ల కుమార్తె 2016లో అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా వైరస్ సోకి ఈ నెల 26న రాజ్‌కుమార్ మృతిచెందారు. కుమార్తె, భర్త మృతిని కల్పన తట్టుకోలేకపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందింది. ఐనావరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కల్పన తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ విద్యార్ధినితో ప్రేమ.. పెద్దలు ఒప్పుకోలేదని.. -
హోటల్ కస్టమర్లపై ఎస్ఐ ఓవరాక్షన్
సాక్షి, టీ.నగర్: కోవైలో హోటల్ కస్టమర్లపై దాడికి సంబంధించి ఎస్ఐపై బదిలీ వేటు పడింది. వివరాలు..హోసూరుకు చెందిన మహిళల సహా ఐదుగురు ఆదివారం కోయంబత్తూరు గాంధీపురం బస్టాండు చేరుకున్నారు. చాలావరకు హోటళ్లు మూసి ఉండడంతో భోజనం చేసేందుకు హోటళ్ల కోసం వెతికారు. ఒకచోట సగం షట్టర్ మూసి పనిచేస్తున్న ఓ హోటల్‌ను చూసి అక్కడికి వెళ్లారు. వారితో పాటు మరికొందరు అక్కడ భోజనం చేస్తుండగా, బస్టాండులో గస్తీకి వచ్చిన కాటూరు సబ్ ఇన్స్పెక్టర్ ముత్తు ఆ హోటల్ పనిచేస్తుండడం చూసి లోనికి ప్రవేశించారు. మహిళలతో సహా ఎనిమిది మందికి పైగా భోజనం చేస్తుండటం గమనించి వారిపై, హోటల్ సిబ్బందిపై వీరంగం చేశారు. కరోనా నియంత్రణకు నిర్ణీత సమయంలో హోటల్ మూసివేయాలనే ఉత్తర్వులను విస్మరించి, షట్టర్ సగం తెరచి వ్యాపారం చేస్తున్నారా? అంటూ హోటల్ సిబ్బందిపై లాఠీ ఝుళిపించాడు. భోజనం చేస్తున్నారనే కనికరం కూడా లేకుండా పురుషులు, మహిళలపై కూడా లాఠీతో ప్రతాపం చూపారు. దీంతో ఉద్యోగులు, మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారు. బయటికి వచ్చిన తర్వాత మరికొందరిని లాఠీతో తరిమినట్లు సమాచారం. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన వారు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన దీనిపై విచారణకు ఆదేశించారు. ఎస్ఐ హోటల్ కస్టమర్లపై దాడిచేయడం వాస్తవమని తేలడంతో ఆయనను కంట్రోల్ రూంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియురాలికి నిప్పంటించి.. -
సొంత స్టూడియోలో ఇళయరాజా రికార్డింగ్
సంగీత దర్శకుడు ఇళయరాజా బుధవారం తన సొంత స్టూడియోలో రికార్డింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. నలభై ఏళ్లుగా చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా తన సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ప్రసాద్ స్టూడియో నుంచి ఆయన్ను ఖాళీ చేయించే వ్యవహారంలో ఆ స్టూడియో అధినేతలకు, ఇళయరాజాకు మధ్య తలెత్తిన వివాదం పోలీస్ కేసులు, కోర్టుల వరకు వెళ్లింది. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ స్టూడియోలో తనకు సంబంధించిన సంగీత పరికరాలను, ఇతర సామగ్రిని ఇళయరాజా స్వాధీనం చేసుకున్నారు. టీ నగర్‌లోని ఎంఎం థియేటర్‌ను సొంతంగా కొనుగోలు చేసి దాన్ని రికార్డింగ్ థియేటర్‌గా నిర్మించుకున్నారు. దానికి ‘ఇళయరాజా స్టూడియో’ అని నామకరణం చేశారు. ఆ రికార్డింగ్ థియేటర్లో ఇళయరాజా బుధవారం సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. హాస్యనటుడు సూరి కథానాయకుడిగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలను ప్రప్రథమంగా రికార్డ్ చేశారు. -
రూ.3 వేల కోసం ఐదుగురి హత్య
సాక్షి, టీ.నగర్: రూ.3 వేల కోసం ఐదుగురిని హతమార్చిన యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి కంటోన్మెంట్ ఒత్తకడై ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ నైట్ వాచ్‌మన్‌గా రాంజీనగర్‌కు చెందిన సెంథిల్‌కుమార్ పనిచేస్తున్నాడు. గత రెండో తేదీ రాత్రి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ వద్ద దుప్పటితో నిద్రించసాగాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 25 ఏళ్ల యువకుడు సెంథిల్‌కుమార్‌పై బండరాయి వేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో స్పృహతప్పిన సెంథిల్‌కుమార్ చొక్కా జేబు నుంచి రూ.1000, సెల్‌ఫోన్ చోరీ చేశాడు. ఇలావుండగా షాపింగ్ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా యువకుడి ఆకృత్యాలు వెలుగుచూశాయి. అతను ఇదివరకే పలు చోరీలు, హత్యల కేసుల్లో సంబంధమున్న వ్యక్తిగా కనుగొన్నారు. ఇతను పుదుక్కోట్టై జిల్లా, కర్బగకుడికి చెందిన రాజేష్కుమార్గా తెలిసింది. రాజేష్‌కుమార్ ఇదే విధంగా సేలం టౌన్లోను గత ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ముగ్గురు వాచ్మెన్లను ఇదే తరహాలో హతమార్చి నగదు చోరీ చేసినట్లు తెలిసింది. అతని కోసం సేలం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడైంది. చదవండి: వలంటీర్లపై తెలుగు తమ్ముళ్ల దాడి ఇతను తన సొంతవూరిలో 2009లో క్రీడామైదానంలో నాలుగేళ్ల బాలుడిని, 2015లో ఒక వృద్ధురాలిని హతమార్చినట్లు విచారణలో తేలింది. దీంతో రాజేష్‌కుమార్‌ను శుక్రవారం కరంబకుడిలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతను కేవలం రూ.3 వేల కోసం ఐదుగురిని హతమార్చినట్లు విచారణలో తేలింది. అతను సైకో హంతకుడుగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మూడేళ్ల చిన్నారి దారుణ హత్య
టీ.నగర్ : కన్యాకుమారి జిల్లా మయిలాడి మార్తాండపురం వాటర్‌ట్యాంక్ రోడ్డుకు చెందిన సెంథిల్‌కుమార్ (35) మయిలాడి పట్టణ పంచాయతీలో పనిచేస్తున్నాడు. భార్య రామలక్ష్మి (34). వీరిక ఉమారుడు శ్యాంసుందర్ (6), కుమార్తె కాంచనా (3)ఉన్నారు. తిరునెల్వేలిలో జరిగే బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉన్నందున పిల్లలు ఇరువురూ మంగళవారం పాఠశాలకు వెళ్లలేదు. సెంథిల్‌కుమార్ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు సమీపాన సొంత ఇంటిలో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం శ్యాంసుందర్, తాత అవ్వల ఇంటికి వెళ్లి చాలాసేపయినా తిరిగి రాలేదు. దీంతో రామలక్ష్మి కుమారుడి కోసం వెళ్లగా అక్కడ ఒక గదిలో గొంతు బిగించబడిన స్థితిలో శ్యాంసుందర్ ప్రాణాలకు పోరాడుతున్నాడు. దీంతో రామలక్ష్మి దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని గొంతుకు ఉన్న తాడు తీసి నాగర్‌కోవిల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇలావుండగా తన ఇంట్లో ఉన్న కుమార్తె సంజనాను చూసుకోవాల్సిందిగా పక్కింటివారికి చెప్పారు. భర్త సెల్‌ఫోన్‌కు ప్రయత్నించగా అందలేదు. అతని కోసం పలుచోట్ల గాలించినా సమాచారం అందలేదు. మంగళవారం రాత్రి నాగర్‌కోవిల్ అస్పత్రిలో నగదు చెల్లించేందుకు రామలక్ష్మి ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింటివారి సాయంతో తలుపుపగులగొట్టి లోనికి వెళ్లగా సంజనా నీటితొట్టిలో శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న అంజుగ్రామం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతన్నారు. పోలీసుల విచారణలో దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లు తెలిసింది. యువకుడి దారుణ హత్య కోయంబత్తూరు : కోయంబత్తూరు సమీపాన మంగళవారం ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. కిణత్తుకడవు సమీపంలోని తామరైకుళం మదురైవీరన్ ఆలయం వీధికి చెందిన దినేష్‌కుమార్ (23) అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రియురాలి తమ్ముడు మణికంఠన్ (18) ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ప్రేమ నిరాకరించాల్సిందిగా దినేష్‌కుమార్‌ను మణికంఠన్ మందలించాడు. ఇలావుండగా దినేష్‌కుమార్ మంగళవారం అక్కడున్న వాటర్‌ట్యాంక్ సమీపాన వెళుతుండగా అక్కడికి వచ్చిన మణికంఠన్ మళ్లీ హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన మణికంఠన్ దినేష్‌కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. అక్కడున్న వారు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కిణత్తుకడవు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
నకిలీ చెక్కుతో రూ.45 లక్షల మోసం
సాక్షి, చెన్నై : నకిలీ చెక్‌తో రూ.45 లక్షల మేరకు మోసగించిన మేనేజర్ సహా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి నగర్‌లోని తాంబరం శానటోరియం జీఎస్ రోడ్డులోని ప్రముఖ నగల దుకాణంలో పార్థీబన్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నగల దుకాణం తరఫున తాంబరం పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు అందింది. అందులో గత ఏడాది డిసెంబర్లో నగల దుకాణంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన పార్థీబన్, వెంకటేశన్, నమ్మాళ్వార్ నకిలీ చెక్కు ఉపయోగించి రూ.45 లక్షల మేరకు నగల మోసానికి పాల్పడినట్లు తెలిపారు. దీనిపై శుక్రవారం పోలీసులు విచారణ జరపగా నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజ్ఞాతంలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని.. టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.75 లక్షలు మోసగించిన దిండుగల్ జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా, జలకంఠాపురానికి చెందిన సిద్ధురాజ్ (35). ఇతని భార్య రేవతి (30). అదే ప్రాంతానికి చెందిన కార్తి, జయలక్ష్మి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. వీరి బంధువు ఒకరు దిండుగల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలుసని, వారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో చేరవచ్చని నమ్మబలికారు. దీన్ని నమ్మిన సిద్ధురాజ్ మరో ముగ్గురు దిండుగల్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సహాయకునిగా పనిచేస్తున్న కరుప్పయ్య (54) నలుగురు కలిసి రూ.6.75 లక్షలను అందజేశారు. అయితే అతను ఉద్యోగాలు ఇప్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో వారు నగదు తిరిగివ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో నలుగురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కరుప్పయ్యను అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు సేలం జైలులో నిర్బంధించారు. -
నిలువెత్తు తెలుగుదనం గొల్లపూడి సోంతం: ఎస్పీ బాలు
-
గొల్లపూడికి కన్నీటి వీడ్కోలు
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత నటుడు, రచయిత, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఉదయం పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి పార్థివదేహానికి నివాళులర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత దగ్గుబాటి సురేశ్, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, సినీ ప్రముఖులు మారుతీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు గొల్లపూడి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రీయంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. 11.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై టీ నగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు రామకృష్ణ తలకొరివి పెట్టారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి
-
గొల్లపూడికి చిరంజీవి నివాళి
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం టీనగర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని వారు చెప్పారు. చిరంజీవి, సుహాసిని నివాళి గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీనగర్‌లోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చదవండి: గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు సాహితీ శిఖరం.. కళల కెరటం.. -
గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
-
గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు. -
పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!
చెన్నై: ఫ్యాన్సీ షాపులోకి పుస్తకం కొనేందుకు వచ్చిన విద్యార్థినిని వాటేసుకుని ముద్దిచ్చిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం త్రిచూర్ సమీపానగల సావక్కాడుకు చెందిన మునీర్ (35). ఇతనికి వివాహం కాలేదు. ఇతను కోయంబత్తూరు కారమడైలోగల ఒక ఫ్యాన్సీ స్టోర్‌లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఈ దుకాణానికి అదే ప్రాంతంలోగల ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని ఆంగ్ల పుస్తకం కొనేందుకు వచ్చింది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న మునీర్ విద్యార్థినిని దుకాణం లోపలికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమెను వాటేసుకుని ముద్దిచ్చాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని అక్కడ్నుంచి తప్పించుకుంది. తర్వాత ఇంటికి వచ్చి తన తల్లితో చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కారమడై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం మునీర్‌ను అరెస్టు చేశారు. -
ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..
టీ.నగర్: విరుదాచలం సమీపంలో ప్రేమ వివాహానికి వ్యతిరేకత తెలుపుతూ ప్రియురాలి తండ్రి ప్రేమికుడి తల్లిని శుక్రవారం విద్యుత్ స్తంభానికి కట్టి చిత్రహింసలకు గురిచేయడం ఆ ప్రాంతంలో సంచలం రేపింది. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని విలాంగట్టూరు గ్రామానికి చెందిన పొన్నుసామి భార్య సెల్వి (45). ఈమె కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన బంధువు కొలుంజి (60) కుమార్తెతో ప్రేమ ఏర్పడింది. ఇలావుండగా గత నెల ఇరువురూ ఇల్లు విడిచి పరారైనట్లు సమాచారం. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం సెల్వి ఇంటి ముందు నిలుచుని ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొలుంజి తన కుమార్తెను ఎక్కడ ఉంచారో చెప్పు! అంటూ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ అక్కడున్న విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సెల్విని రక్షించి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. సెల్వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొలుంజిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
పదో తరగతి బాలుడితో టీచర్ పరార్..
టీ.నగర్: వివాహమైన నెలకే ఉపాధ్యాయురాలు పదో తరగతి విద్యార్థితో పరారైంది. సేలం తిరువాగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రైవేటు ట్యుటోరియల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు బాగల్‌పట్టికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరితో గత నెల 19న వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగానికి వెళ్లారు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో కోరిమేడులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు రోజులుగా గాలిస్తూ వచ్చారు. ఇదిలాఉండగా ఉపాధ్యాయిని 17 ఏళ్ల బాలునితో మంగళవారం పోలీసుస్టేషన్‌కు జంటగా వచ్చింది. వారు కలిసి జీవిస్తామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీచర్‌కు, బాలుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వారి వారి తల్లిదండ్రుల వెంట పంపారు. -
అభిమానికి స్టార్ హీరో అశ్రు నివాళి
సాక్షి, చెన్నై: కోలీవుడ్ స్టార్ శింబు(శిలంబరసన్) హిట్ కొట్టి దశాబ్దంపైనే అవుతోంది. అయినా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. వివాదాల్లో చిక్కుకున్న సమయంలో కూడా ఆ అభిమానులే ఆయనకు అండగా నిలిచారు. అలాంటి ఫ్యాన్స్ కోసం శింబు కూడా అదే స్థాయిలో స్పందిస్తుంటాడు. ఆర్థికంగా ఎందరినో ఇప్పటికే ఆదుకున్నాడు కూడా. తాజాగా మరో అభిమాని కోసం శింబు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. టీనగర్‌కు చెందిన మదన్ అనే వ్యక్తి పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మదన్ ఎస్టీఆర్(శింబు) ఫ్యాన్ క్లబ్ కార్యదర్శి. బీప్ సాంగ్ వివాద సమయంలో మదన్ శింబుకు మద్ధతుగా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడిపాడు కూడా. అలాంటి మదన్ మృతి చెందంటంతో శింబు చలించిపోయాడు. అయితే ఆ సమయంలో దుబాయ్‌లో షూటింగ్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. తిరిగొచ్చాక ఆశ్రునివాళి పేరిట పోస్టర్లను రూపొందించి నగరంలో మొత్తం అంటించాలని ఫ్యాన్స్ అసోషియేషన్‌కు సూచించాడు. అంతేకాదు తానే స్వయంగా ఆ కార్యక్రమంలో శింబు పాల్గొన్నాడు. మదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, వారికి చేతనైనంత సాయం అందిస్తానని శింబు మీడియాకు తెలిపాడు. -
సైనికుల ఇళ్లలో చోరీ.. అధికారులు షాక్..!
సాక్షి, టీనగర్: రక్షణ కల్పించే సైనికుల ఇళ్లకు భద్రతా కరువైంది. మిలటరీ క్వార్టర్స్‌లో వరుసగా మూడు ఇళ్లలో నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన చెన్నై పోర్ట్ రైల్వేస్టేషన్ సమీపంలోని నేవీ నగర్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఈ నేవీ నగర్లో మిలిటరీ, నేవీ సైనికులు నివశిస్తున్నారు. ఇక్కడ సాయుధ సైనికులు అన్ని వేళలా రక్షణ చర్యలు చేపడుతుంటారు. కానీ, ఆదివారం ఉదయం నేవీ అధికారులు సర్కార్తీజి, అఖిలేష్‌కుమార్, సెంథిల్‌కుమార్ ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. సమీపంలో నివశించే అధికారులు దీన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం నిపుణులతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే వేరే ఊర్లకు వెళ్లిన అధికారులు వచ్చిన తర్వాతే నగదు, నగలు ఏమేరకు చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
సెల్ఫీ పిచ్చితో బుక్కయ్యాడు..
సాక్షి, టీ.నగర్: సోషల్ మీడియా నేటి యువతపై బాగానే ప్రభావం చూపుతుంది. ఓ యువకుడు సైనిక దస్తులు ధరించి, చేతిలో తుపాకీతో దిగిన ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ యువకుని వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా, మేచ్చేరికి చెందిన ప్రభు(35) ట్రావెల్స్ నడుపుతున్నాడు. ఇతను కొన్ని రోజుల కిందట తన ఫేస్బుక్, వాట్సాప్‌లో చేతిలో నాటు తుపాకీతో దిగిన ఫొటోలను పోస్టు చేశాడు. మరో ఫొటోలో సేనిక దుస్తులు ధరించి, ఎకే-47 తుపాకీతో కనిపించాడు. అంతేకాక తన ఫోన్ నంబర్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలను చూసిన అటవీశాఖ అధికారులు మేచ్చేరికి వెళ్లి ప్రభును అదుపులోకి తీసుకున్నారు. అధికారుల విచారణలో ప్రభు కొన్ని విషయాలను వెల్లడించారు. బోర్వెల్ సంస్థలో మేనేజర్‌గా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బస చేశానన్నాడు. ఆ సమయంలో అక్కడున్న స్నేహితుడి వద్ద తుపాకీ తీసుకుని ఫొటోకు ఫోజిచ్చినట్లు తెలిపాడు. అలాగే మరో స్నేహితుని వద్ద సైనిక దుస్తులు ధరించి ఫొటో దిగినట్లు తెలిపాడు. ఈ ఫొటోలు తీసుకుని రెండేళ్లవున్నట్లు ప్రభు పేర్కొన్నాడు. అటవీ శాఖ అధికారులు శుక్రవారం అతన్ని మేచ్చేరి పోలీసులకు అప్పగించారు. ప్రభుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
చెన్నై సిల్క్స్ షాపింగ్‌మాల్ లో అగ్నిప్రమాదం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీ నగర్‌లోని ప్రముఖ వస్త్ర నగల దుకాణం చెన్నై సిల్క్స్ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు చుట్టుముట్టాయి. 5 ఫైర్ ఇంజిన్లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మంటలు వ్యాపించగా... దాదాపు అయిదు గంటలు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అగ్ని మాపక సిబ్బంది. లోపల చిక్కుకున్న 10మంది సిబ్బందిని కూడా కాపాడారు. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
టీనగర్ : త్యాగదుర్గం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. విల్లుపురం జిల్లా త్యాగదుర్గం ప్రాంతానికి చెందిన పాండియన్ కుమారుడు ప్రదీప్‌కుమార్(24). అదే ప్రాంతానికి చెందిన సుకుమార్ కుమారుడు వినోద్‌కుమార్(24). ఇరువురూ ఎలక్ట్రీషియన్‌సగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితుడు సేదమంగళం గ్రామానికి చెందిన గణేశన్ కుమారుడు జయమూర్తి(20) ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. వినోద్‌కుమార్ కొత్త బైక్ కొనడంతో విరుగావూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం స్నేహితులకు విందు ఇచ్చాడు. ఇందులో వినోద్‌కుమార్, ప్రదీప్‌కుమార్, జయమూర్తితో సహా 10 మంది పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటికి తిరిగివస్తుండగా వడపూండి బస్టాండు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిగురించి వరంజరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. -
స్కూటర్ లాక్కెళ్లారని హిజ్రా ఆత్మాహుతి
పోలీసు స్టేషన్ ఎదుట ఘాతుకం పోలీసుల తీరుపై ఆక్రోశం ఆందోళనలతో సహచరుల ఆగ్రహం పోలీసులు బలవంతంగా తన స్కూటర్‌ను లాక్కెళ్లడంతో ఆవేదనకు లోనైన ఓ హిజ్రా బుధవారం అగ్నికి ఆహుతి అయింది. పోలీసు స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కారణంగా హిజ్రా ఆహుతి కావడాన్ని జీర్ణించుకోలేక సహచర హిజ్రాలు ఆందోళనలకు దిగారు. వీరిని బుజ్జగించడం పోలీసు ఉన్నతాధికారులకు తలకు మించిన భారంగా మారింది. చెన్నై: టీనగర్, పాండి బజార్ పోలీసులు మంగళవారం రాత్రి తిరుమలై పిళ్లై వీధిలో వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వేళ అటు వైపుగా వచ్చిన స్కూటర్‌ను ఆ పారు. ఆ స్కూటర్‌ను నడుపుకుంటూ వచ్చింది హిజ్రాగా గుర్తించారు. ఆ వాహనానికి ధ్రువీవీకరణ పత్రాలు, లైసెన్స్ లు గానీ చూపించేందుకు ఆ హిజ్రా నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్నట్టుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ స్కూటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని పాండి బజార్ స్టేషన్ కు తరలించారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో పాండి బజార్ స్టేషన్ కు వచ్చిన ఆ హిజ్రా తన స్కూటర్‌ను అప్పగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. స్టేషన్ సిబ్బంది నిరాకరించి బయటకు బలవంతంగా పంపించడంతో, తీవ్ర మనోవేదనకు, ఆగ్రహానికి గురైన ఆ హిజ్రా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోలీసు స్టేషన్ ఎదుటే తన మీద పోసుకుని నిప్పు అంటించుకుంది. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అక్కడి పోలీసులు పరుగులు తీశారు. మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. అంబులెన్స్ ను పిలిపించి , చికిత్స నిమిత్తం కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో కీల్పాకం ఆసుపత్రిలో చేర్పించిన హిజ్రాకు అక్కడి వైద్యులు చికిత్స అందించారు. ఆ హిజ్రా చూలైమేడు సమీపంలోని నమశ్శివాయ పురంకు చెందిర తార(33)గా గుర్తించారు. చికిత్సపొందుతున్న తార పది గంటల సమయంలో మరణించింది. ఈ సమాచారంతో చెన్నై నగరంలో ఉన్న హిజ్రాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన హిజ్రాలు వందలాది మంది కీల్పాకం ఆసుపత్రి వైపుగా దూసుకొచ్చారు. పోలీసులు హతమార్చి, ఆహుతి చేయడమే కాకుండా, ఆత్మాహుతి నాటకం ఆడుతున్నట్టుందని ఆరోపించడం మొదలెట్టారు. దీంతో పోలీసుల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో మరింత ఆగ్రహంతో పూందమల్లి హైరోడ్డుపై హిజ్రాలు ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. ఉదయాన్నే విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లకు తంటాలు తప్పలేదు. పోలీసుల మీదకు హిజ్రాలు దూసుకు రావడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఏమి చేయాలో తోచని స్థితిలో పోలీసులు కాసేపు సంయమనం పాటించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని హిజ్రాలను బుజ్జగించేం దుకు శ్రమించాల్సి వచ్చింది. తార స్కూటర్‌ను లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని హిజ్రాలు ఉంచిన డిమాండ్‌కు పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గక తప్పలేదు. పోలీ సు అధికారుల హామీతో ఆందోళనను విరమించారు.మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
డీఎంకే కౌన్సిలర్ హత్య
టీనగర్: పడప్పై చర్చి ప్రాంగణంలో డీఎంకే కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి ఆరుగురి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై తాంబరం సమీపాన పడప్పై, పెరియార్ నగర్ ఐదవ వీధికి చెందిన ధనశేఖరన్(35) పడప్పై పంచాయతీ డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా, పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తున్నారు. సొంతంగా లారీ ఉండడంతో ఇతను అదే ప్రాంతంలో ఇసుక క్వారీలను లీజుకు తీసుకున్నారు. కాగా డేవిడ్‌నగర్‌లో ఉన్న ఒక చర్చికి ఆదివారం ఉదయం మోటార్ బైక్‌లో ధనశేఖరన్ బయలుదేరాడు. ఆ సమయంలో రెండు బైకుల్లో వెంబడించిన ఆరుగురు వ్యక్తులు ధనశేఖరన్‌పై కత్తులతో దాడి జరిపింది. వారి నుంచి తప్పించుకున్న ధనశేఖరన్ అదే ప్రాంతంలోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలోకి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ధనశేఖరన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి డీఎంకే శ్రేణులు అధిక సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
చెన్నైలో ఆకట్టుకుంటున్న ఎకో ఫ్రెండ్లీ గణేషుడు
-
తల్లీకూతుళ్ల హత్య
టీనగర్: కుండ్రత్తూరులో మంగళవారం తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంటి నుంచి హంతకులు 50 సవర్ల బంగారు నగలు, నగదు దోచుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. కాంచీపురం జిల్లా, కుండ్రత్తూరు సమీపానగల బెస్లీగార్డెన్ ప్రాంతానికి చెందిన మహిళ వసంత (64). ఈమె కుమార్తె తేన్మొళి (32). కుండ్రత్తూరు ప్రాంతంలోగల ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ వచ్చింది. తేన్‌మొళికి సురభిశ్రీ (7), గుణశ్రీ ( 9 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. తేన్మొళి భర్త రామసామి (40). యెమన్ దేశంలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. గత మూడేళ్ల క్రితం బెస్లీ గార్టెన్‌లో ఇల్లు నిర్మించి అందులో కుటుంబీకులు నివశిస్తున్నారు. ఇలావుండగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు సురభిశ్రీ, గొంతుపై కత్తిగాయంతోపాటు ఏడుస్తూ గుణశ్రీతోపాటు పక్కింటికి వెళ్లింది. దీన్ని గ మనించిన వారు దిగ్భ్రాంతి చెందారు. వారు ఏమయ్యిందని ప్రశ్నించగా ఎవరో తమ అమ్మమ్మను, అమ్మను చంపేశారని సురభిశ్రీ ఏడుస్తూ చెప్పింది. వారు వెంటనే సురభిశ్రీని పోరూరులోగల ప్రైవేటు ఆస్పత్రికి పంపారు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లికూతుళ్లు కత్తిపోట్లకు గురై నిర్జీవంగా కనిపించారు. బీరువా పగులగొట్టి వుంది. దీనిగురించి వెంటనే కుండ్రత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. అంబత్తూరు డిప్యూటీ కమిషనర్ సుధాకర్, పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ అయ్యప్పన్ ఇతర పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. వసంత, తేన్మొళి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోలీసు క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. పోలీసు జాగిలం జూలి హత్యాప్రదేశం నుంచి పరుగెత్తుకుని వెళ్లి నిర్మాణంలోవున్న ఒక భవనం వద్దకు వెళ్లి ఆగిపోయింది. అక్కడ అనేక భవనాలు నిర్మాణంలో వున్నాయి. ఇక్కడ అనేక మంది ఉత్తర దేశస్తులు బసచేసి పనిచేస్తున్నారు. వీరిపై పోలీసులకు అనుమానం వేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో భార్యభర్తలను పోలిన ఇద్దరు మంగళవారం ఉదయం వసంత ఇంటికి వచ్చారు. వారు ఈ హత్యలు చేసి వుండొచ్చని భావిస్తున్నారు. దీనిగురించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ఇంట్లో 50 సవర్ల నగలు, నగదు చోరీ అయినట్లు భావిస్తున్నారు. దీనిగురించి విదేశంలో వున్న రామసామికి సమాచారం తెలిపారు. ఇద్దరు మహిళల హత్య: కోవిల్పట్టి సమీపాన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి బోస్‌నగర్‌కు చెందిన దంపతులు కరుప్పసామి (55), షణ్ముగత్తాయ్ (52). వీరి కుమారులు మాణిక్కరాజా (30), సముద్రపాండి (28). కొన్నేళ్ల క్రితం కరుప్పసామి హత్యకు గురయ్యారు. ఈ కారణంగా అదే వీథికి చెందిన సుందరరాజ్ కుటుంబీకులతో పాతకక్షలు వున్నాయి. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు షణ్ముగత్తాయ్ ఇంటి తలుపు తట్టారు. షణ్ముగత్తాయ్ తలుపులు తెరవగానే ఆమె కుమారుడు సముద్రపాండి ఎక్కడ? అని ప్రశ్నించారు. అందుకామె బయటికి వెళ్లాడని చెప్పగా ఆగ్రహించిన ముఠా కత్తులతో దాడి చేయ గా షణ్ముగత్తాయ్ రక్తపు మడుగులో కిందపడి మృతి చెందింది. తర్వాత ఇంటికి చేరుకున్న సమద్రపాండి తల్లి మృతిచెంది వుండడం చూసి బిగ్గరగా రోదించా డు. సుందరరాజ్ కుటుంబీకులు హత్య చేసి వుంటారని భావించిన సముద్రపాండి నేరుగా వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంట్లో వున్న సుందరరాజ్ భార్య సెల్లత్తాయ్ (48) పై కత్తితో దాడి చేశాడు. సెల్లత్తాయ్ సంఘటనా స్థలంలోనే విలవిలలాడి మృతిచెందింది. తూత్తుకుడి ఎస్పి అశ్విన్ కొట్నీస్, కోవిల్పట్టి పోలీసు లు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇరువురి మృతదేహాలను కోవిల్పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీనిగురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆస్తుల వివాదం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు తెలిసింది. ఈ జంట హత్యలకు సంబంధించి తండ్రి, కుమారులతో సహా నలుగురు పరారీలో వున్నారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కార్మికుడి హత్య: హోటల్ కార్మికుల మధ్య జరిగిన తగాదాలో ఒకరు హత్యకు గురయ్యారు. హంతకుని ట్రిప్లికేన్ పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. శివగంగై జిల్లా, దేవకోట్టైకు చెందిన వ్యక్తులు ఆరుముగం (52), మురుగానందం (40). ఇరువురూ చెన్నై, చేపాక్కం అక్బర్ హుసేన్ వీథిలోగల ఒక హోటల్లో బసచేసి పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఇరువురూ కూరగాయలు తరుగుతుండగా వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన మురుగానందం సమీపానగల కూరగాయల కత్తిని తసుకుని ఆరుముగంపై విసిరాడు. దీంతో అతనికి చేతిలో గాయం ఏర్పడింది. ఇలావుండగా సమాపాన వున్న వారు ఇరువురిని సమాధాన పరచి పంపివేశారు. అయినప్పటికీ కోపోద్రిక్తుడైన మురుగానందం మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆరుముగం వుంటున్న గదికి వెళ్లి గొంతుపిసికి చంపాడు. సమాచారం అందుకున్న ట్రిప్లికేన్ పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని ఆరుముగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోలీసులు మంగళవారం ఉదయం మురుగానందంను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం ఏర్పడింది. -
మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
టీనగర్: మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నమ్మాళ్ మృతిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే నేత రాందాస్, వీసీకే నేత తిరుమావళవన్, టీఎంసీ నేత వాసన్ తదితరులు సంతాపాలు ప్రకటించారు. రాహుల్ గాంధీ తన ప్రకటనలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీరాణి అవ్వ, సీనియర్ మహిళా నేత పొన్నమ్మాళ్ మృతి వార్త విని ఆవేదన చెందానని, ఆమె ఎడబాటుతో బాధపడుతున్న ఝాన్సీరాణి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నానన్నారు. ఆమె మృతి రాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె తన జీవితాంతం పార్టీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల పురోగతికి కృషి చేశారని తెలిపారు. వీసీకే నేత తిరుమావళవన్ తన ప్రకటనలో నిలకోట్టై, చోళవందాన్ నియోజకవర్గాలలో రాష్ట్ర అసెంబ్లీకి ఏడు సార్లు ఎన్నికయ్యారన్నారు. తాత్కాలిక స్పీకర్‌గాను సేవలందించారన్నారు. ఇదేవిధంగా పలువురు నేతలు తమ సంతాపాలు ప్రకటించారు. -
ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు
టీనగర్: ఇంటిని కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా మోసగించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే తనకు హత్యా బెదిరింపులు చేస్తున్నట్లు ఒక వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈరోడ్ జిల్లా, భవానీ రాణానగర్‌కు చెందిన వాసుదేవన్ దుప్పట్ల వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఈరోడ్ జిల్లా ఎస్పి సిబి చక్రవర్తికి మంగళవారం ఒక ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. తనకు భవాని అన్నానగర్‌లో 5,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, ఫ్యాక్టరీ ఉండేదని తెలిపారు. పక్కింటిలో నివసిస్తున్న భవాని నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే నారాయణన్ తన ఇంటిని విక్రయించమని కోరారని, రూ.1.40 కోట్లకు విక్రయిస్తానని తెలిపానని అన్నారు. తనకు మొదటి విడతగా రూ. 88.50 లక్షలు చెల్లించారని, మిగతా సొమ్ము తన భార్య సరస్వతి పేరిట ఇల్లు రాసిస్తే చెల్లిస్తానని తెలిపాడన్నారు. దీన్ని నమ్మి తాను అతని భార్య సరస్వతికి గత ఆగస్టు 26వ తేదీన ఇల్లు రాసిచ్చానన్నారు. ఆ తర్వాత మిగతా సొమ్ము 50 లక్షల రూపాయిలను కోరగా నగదు ఇవ్వడానికి నిరాకరించాడన్నారు. అంతేగాక తనకు హత్యా బెదిరింపులు చేసినట్లు పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. -
వీరప్పన్ భార్యపై కేసు
టీనగర్: అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేసినందుకు చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్యైపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరప్పన్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వేలాది ఏనుగులను హతమార్చి దంతాలు, చందనం దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. 2004 లో రాష్ట్ర ఎస్టీఎఫ్ దళాల చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ మృతదేహం సేలం జిల్లా, కొలత్తూరు సమీపాన ఉన్న మూలకాడులో ఖననం చేయబడింది. ఆదివారం చందనపు స్మగ్లర్ వీరప్పన్ 11వ సంస్మరణ దినాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలక్కాడు, మేచ్చేరిలో అనేక చోట్ల పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మేచ్చేరిలో అనుమతి లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు మేచ్చేరి పోలీసులు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై కేసు నమోదు చేశారు. -
సెల్‌ఫోన్‌ను గొలుసుతో కట్టి వుంచుకోండి
టీ నగర్: సరికొత్త పంధాలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న యువకుడు ఒకరు సెల్‌ఫోన్‌ను గొలుసుతో కట్టి వుంచుకోండంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నాడు. స్మార్ట్ ఫోన్ ఆగమనం తర్వాత వాట్సాప్ లో వచ్చే సంచలన వార్తలు, వాస్తవిక సంఘటనలు, మానవీయ కోణం వార్తలు అనేకం వినియోగదారుల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాయి. కొందరి బెదిరింపు ప్రకటనలు, శృంగార వార్తలు అనేకం వుంటున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధిత యువకుడు ఒకరు తన విలువైన సెల్‌ఫోన్ పోగొట్టుకున్నానని, తనలా మరెవరు సెల్ఫోన్లు పోగొట్టుకోకుండా వుండేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని కోరాడు. ఇతరులకు సెల్ఫోన్లు ఇవ్వకూడదని తెలిపారు. తాను ఒక వ్యక్తికి ఇదేవిధంగా సెల్‌ఫోన్ అందజేయగా అతడు వేరొక వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటించి సెల్‌ఫోన్‌తో కూడా బైక్‌లో ఉడాయించాడని తెలిపాడు. ఈ సెల్‌ఫోన్ విలువ 18 వేల రూపాయలని తెలిపాడు. ఇకపై ప్రాణాలు పోతున్నా ఎవరికీ సెల్‌ఫోన్ ఇచ్చి సాయపడకూడదంటూ హెచ్చరికలు చేశారు. ఈ మెసేజ్ ప్రస్తుతం అన్ని సెల్ఫోన్లలోను హల్చల్ చేస్తోంది. -
ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
టీ.నగర్, న్యూస్‌లైన్ : కేలంబాక్కం సమీపాన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రరాష్ట్రం గుంటూరుకు చెందిన పాసం వెంకటరెడ్డి కుమారుడు లింగారెడ్డి (20). కేలంబాక్కం సమీపం మేలకొట్టయూర్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఈసీ చదువుతున్నా డు. అతని స్నేహితులు ఇద్దరితో కండిగలో ఉన్న ఒక భవనంలోని తొమ్మిదో అంతస్తులో బసచేస్తూ వచ్చాడు. ఇలాఉండగా సోమవారం వేకువజామున మూడు గంటల సమయంలో అక్కడ వాచ్‌మన్ నిఘా పనుల్లో ఉన్నారు. అ ప్పుడు నేలపై రక్తపు మడుగులో లిం గారెడ్డి నిర్జీవంగా కనిపించడంతో ది గ్భ్రాంతి చెందాడు. దీనిగురించి తాళంబూరు పోలీసులకు సమాచారం తెలిపా రు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృ త దేహాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ జరిపారు. విచారణలో ఆది వారం అర్ధ రాత్రి వరకు లింగారెడ్డి స్నేహితులతో గదిలో టీవీ చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతని స్నేహితులు నిద్రపోయారు. లింగారెడ్డి మేడ పై నుంచి కిందికి చూసినట్లు తెలిసింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయంపై తెలియాల్సి ఉంది. -
చోరీ కేసులో వైద్య విద్యార్థుల అరెస్ట్
టీనగర్, న్యూస్‌లైన్:కాంచీపురంలోని పారిశ్రామిక వేత్త ఇంట్లో నగలను చోరీ చేసిన వైద్య విద్యార్థిని, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యా ఫీజులు, ఉల్లాస జీవితం కోసం ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. కాంచీపురం మునుసామి మొదలియార్ అవెన్యూలో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త ంటిలో ఇటీవల ఇంటి లాకర్లోని 135 సవర్ల బంగారు నగలు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలావుండగా జయకుమార్ ఇంటిపై అంతస్తులో ఉంటున్న ఈరోడ్ జిల్లా, భవానికి చెందిన గోవింద రాజన్ కుమార్తె సౌమ్య(వైద్య విద్యార్థిని) వద్ద పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఆమె తన స్నేహితుడు కృష్ణగిరి జిల్లా, పెద్దనపల్లికి చెందిన మణికంఠన్‌తో కలిసి చోరీకి పాల్పడినట్లు తెలిపింది. తాము ఇరువురం కాంచీపురం సమీపంలోగల వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నామని, విద్యా ఫీజులు కోసం, విలాస జీవితం కోసం ఈ చోరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరినీ పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచి జైలులో నిర్బంధించారు. -
530 సవర్ల నగలు స్వాధీనం
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: చెన్నై త్యాగరాజనగర్‌లో వ్యాపారి వద్ద నగలు చోరీ చేసిన చెన్నై విల్లివాక్కంకు చెందిన యువకున్ని పోలీసు బృందం అరెస్టు చేసింది. రూ.1.25 కోట్ల విలువ కలిగిన 530 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మాంబలం దురైసామి సబ్వే సమీపంలో మహేష్ కుమార్ నగల దుకాణం డుపుతున్నారు. ఈయన తన కారులో 5 కిలోల నగలను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మహేష్ కుమార్ దృష్టి మరల్చి 5 కిలోల నగలను చోరీ చేశారు. ఈ సంఘటనపై త్యాగరాయనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో విల్లివాక్కం లోని రాజమంగళం ప్రాంతానికి చెందిన ఏసుదాస్, అతని సహచరులకు ఈ చోరీలో సంబం ధం ఉన్నట్టు తెలిసింది. వీరి కోసం గాలించగా, ఏసుదాస్ మణలిలో బంధువుల వివాహానికి వస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు మణలిలో నిఘా వేశారు. కానీ ఏసుదాస్ అక్కడికి రాలేదు. ఈనెల 29వ తేదీ రాత్రి నుంగంబాక్కం వళ్లువర్ కోట్టం సుందర దిన పార్కు వద్ద ఉన్న ఏసుదాస్‌ను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఏసుదాస్ ఇచ్చిన సమాచారం మేరకు అతని వద్ద ఉన్న 530 సవర్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగలతో పాటు ఏసుదాస్‌ను కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రిపబ్లిక్‌డే రిహార్సల్స్
టీనగర్, న్యూస్‌లైన్: రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులతో రిహార్సల్స్ నిర్వహించారు. రిపబ్లిక్‌డేకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులను నియమించారు. కొన్నేళ్ల క్రితం సమద్ర మార్గంలో దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ తీవ్రవాదులు ముంబరుు తాజ్ హోటల్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో వంద మందికిపైగా బలయ్యారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత దేశానికి తీవ్రవాదుల నుంచి బెది రింపులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఆదివారం దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదివరకే హెచ్చరికలు చేశాయి. సముద్ర మార్గం ద్వారానే కాకుండా విమానాన్ని హైజాక్ చేసి విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి తీవ్రవాదుల నుంచి ప్రత్యక్ష బెదిరింపులు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ రామానుజం ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమవుతున్నారు. చెన్నై మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రోశయ్య జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, ముఖ్య ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో త్రివిధ దళాధిపతుల పరేడ్లు, విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలంకార శకటాల ప్రదర్శనలు జరుగుతాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎగ్మూర్, సెంట్రల్ వంటి ముఖ్య రైల్వే స్టేషన్లకు, కోయంబేడు, ప్యారిస్, తాంబరం వంటి బస్టాండు ప్రదేశాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
టీ.నగర్, న్యూస్‌లైన్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఓట్టాన్‌సత్రం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కారును లారీ ఢీకొనడంతో కేరళ నుంచి వస్తున్న ముగ్గురు వ్యాపారులు మృతిచెందారు. మరో సంఘటనలో బైకును లారీ ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. కేరళ ఎడుక్కి జిల్లా పెరువందానం ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఓట్టాన్ సత్రం పశువుల సంతకు సోమవారం వచ్చారు. పశువుల సంత జరగకపోవడంతో వీరు కోయంబత్తూరుకు తెల్లవారుజామున కారు లో బయలుదేరారు. కళ్లి మందయం సమీపంలో మంగళవారం ఉదయం 4.30 గంటల సమయంలో కారు వస్తుం డగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మహ్మద్ షా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన షాజహాన్, బషీర్, షికాబ్, అజిత్ బోన్‌ను మదురై ఆస్పత్రికి తరలించారు. ఇందులో బషీర్, షికాబ్ మార్గమధ్యంలో మృతి చెందారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతి : తిరుచ్చి జిల్లా మళప్పారై సమీపంలో గల నడువిపట్టి గ్రామానికి చెందిన బాలుస్వామి (32). ఇతని భార్య అర్చనాదేవి. వీరు నడివిపట్టిలో గల బంధువుల ఇంటి గృహ ప్రవేశానికి తిరుప్పూరు నుంచి బైక్‌లో వచ్చి సోమవారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. దిండుగల్ జిల్లా ఓట్టాన్ సత్రం సమీపంలో సాలైపొదూర్ అత్తికొంబై ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో వస్తుండగా తారాపురం నుంచి రామనాథపురం జిల్లా ఆర్ఎస్ మంగళం వెళుతున్న లారీని బైకు ఢీకొంది. ఈ సంఘటనలో దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదంపై విచారణ జరిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీడీల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
టీ.నగర్, న్యూస్‌లైన్: రిజిస్ట్రేషన్ పత్రాలను సీడీల రూపంలో అందచేసే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థల దస్తావేజుల రిజిస్ట్రేషన్, వివాహాల రిజిస్ట్రేషన్ వంటి పనులకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రజలు అధిక సంఖ్యలో ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో పని చేస్తున్నారుు. స్థల సౌకర్యం లేకుండా సిబ్బంది ఇబ్బందులు పడడాన్ని దృష్టిలో ఉంచుకుని సొంతంగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం నామక్కల్ జిల్లా పల్లిపాళ యం, పుదుసత్రం, వేలూరు జిల్లా జోలార్‌పేట, వాలాజా, ఆర్కాడు, కాలనై, తిరువణ్ణామలై జిల్లా దూసి, కీల్కొడుంగాలూరు, కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు, పెరియకాంచీపురం, తూత్తుకుడి జిల్లా పుదూర్, కడంబూరు, ఈరోడ్ జిల్లా కవుందపాడి, కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి, కృష్ణగిరి జిల్లా ఊత్తం గరై, దిండుగల్ జిల్లా గుజిలియం పారై రామనాథపురం జిల్లా కడలాడి, కడలూరు జిల్లా కమ్మాపురం, పుదుకోటై జిల్లా ఇలుపూర్, తిరువూర్ జిల్లా పల్లడం వంటి 20 ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయూలకు కొత్త భవనాలను రూ.9.83 కోట్ల ఖర్చుతో నిర్మించారు. చెన్నై లో రూ.49 లక్షలతో సబ్ రిజిస్ట్రార్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. వీటితోపాటు కొత్త హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పత్రాల రిజిస్ట్రేషన్లను సీడీల రూపం లో అందచేసే పథకాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలు రూ.50 చార్జీ చెల్లించి ఈ సీడీలను అందుకోవచ్చని తెలిపారు. తంజావూరు చిత్ర కళలో శిక్షణ రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించే విధంగా వంద మంది మహిళలకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో వంద మంది మహిళలకు తంజావూరు చిత్రకళలో శిక్షణ ఇప్పించే విధంగా రూ.5 వేల విలువైన ముడిసరుకులతో కూడిన కిట్లు శుక్రవారం అందజేశారు. వీరికి రాష్ట్ర, జాతీయస్థాయిలో తంజావూరు చిత్ర కళలో అవార్డులు పొం దిన వారితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. -
అగ్గిపెట్టెల కర్మాగారంలో అగ్ని ప్రమాదం
టీనగర్, న్యూస్‌లైన్: కోవిల్ పట్టి అగ్గిపెట్టెల కర్మాగారంలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షల విలువైన బండిల్స్ దగ్ధమయ్యాయి. తూత్తుకుడి జిల్లా, కోవిల్పట్టి మిల్లు వీధికి చెందిన జాన్సన్ (40) రెండవ వీధిలో అగ్గిపెట్టెల కర్మాగారాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ వంద మందికి పైగా పనిచేస్తున్నారు. ఉత్తర రాష్ట్రాల్లో వర్షాలు, ఎగుమతుల్లో సమస్య కారణంగా కోవిల్పట్టి, కళుగుమలై, శంకరన్ కోవిల్ ప్రాంతాల్లో అగ్గిపెట్టెల కర్మాగారాలకు గురువారం నుంచి సెలవు ప్రకటించారు. అదేవిధంగా జాన్సన్ కర్మాగారానికి సెలవు ప్రకటించారు. ఇలావుండగా గురువారం అర్ధరాత్రి జాన్సన్ అగ్గిపెట్టెల కర్మాగారంలో హఠాత్తుగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. కర్మాగారంలో పేర్చిపెట్టిన అగ్గిపెట్టెల బండిల్స్‌కు నిప్పంటుకోవడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న కోవిల్పట్టి, కళుగుమలై అగ్నిమాపక సిబ్బంది మంటలను అందులోకి తెచ్చారు. కోవిల్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. కెమికల్ కంపెనీలో అగ్నిప్రమాదం చెన్నై ప్యారిస్‌లోని ఓ కెమికల్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.లక్షల మేర ఆస్తినష్టం వా టిల్లింది. ప్యారిస్ స్ట్రింగర్స్ వీధిలో కెమికల్ కంపెనీ ఉంది. ఇక్కడ 15 మంది కా ర్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం మ ధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నట్టుండి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఎస్‌ప్లనేడు, హైకోర్టు, బేసిన్ బ్రిడ్జి నుంచి నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంట లను అదుపుచేశారుు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఎస్‌ప్లనేడు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
టీనగర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం నగదు బహుమతులు అందజేశారు. హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ప్లస్‌వన్, ప్లస్‌టూ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులను ప్రో త్సహించాలనే ఉద్దేశంతో 2001-2002 లో ఉచిత సైకిళ్లు అందజేసే పథకం ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. 2005- 2006 లో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే అన్ని వర్గాల విద్యార్థులకు ఈపథకాన్ని వర్తింపజేశారు. పస్తుత విద్యా సంవత్సరంలో రూ.212.4 కోట్లతో 6,43,867 సైకిళ్లు అందజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏడుగురు విద్యార్థులకు సైకిళ్లు అందజేసి పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పదో తరగతి పబ్లిక్ పరీక్ష ల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు పొందిన వా రికి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలచొప్పున అందజేశారు. అటవీ శాఖ అధికారులకు జీపులు రాష్ట్ర అటవీ శాఖాధికారులకు రూ.7.28 లక్షలతో జీపులను ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఆనందన్, ప్రభుత్వ కార్యదర్శి షీలాబాలకృష్ణన్, పర్యావరణ అటవీ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ మోహన్ వర్గీస్ సుంగత్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గౌతం డే ఇతర అధికారులు పాల్గొన్నారు. 12 ప్రభుత్వ కళాశాలల ప్రారంభం ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 12 ప్రభుత్వ కళాశాలలను ప్రారంభించారు. పుదుక్కోట్టై జిల్లా కరంచకుడి, తంజావురు జిల్లా పేరావూరని, తిరువారూరు జిల్లా కాంగేయం, నామక్కల్ జల్లా, కుమారపాళయం, ధర్మపురి జిల్లా, కారిమంగళం, కృష్ణగిరి జిల్లా కారియమంగళం, కృష్ణగిరి జిల్లా హోసూరు, కాంచీపురం జిల్లా ఉత్తర మేరూరు, తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి, రామనాథపరం జిల్లా కడలాడి, తిరువాడనై, ముదుగళత్తూరు, విరుదునగర్ జిల్లా శివకాశిలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటుచేశారు. వాటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. -
నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు
చెన్నై టీ.నగర్‌లోని రంగనాథన్ తెరులో 26 దుకాణాల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన గడువు పూర్తయినా ఆ దుకాణాలకు ఎందుకు సీల్ వేయలేదంటూ అధికారులపై మండిపడింది. చెన్నై కార్పొరేషన్, విద్యుత్, నీటి సర ఫరా విభాగాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై టీనగర్‌లోని రంగనాథన్ తెరు (రంగనాథన్ వీధి) ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పేరు పొందిన వస్త్ర, గృహోపకరణ దుకాణాలు ఉన్నాయి. నగరానికి షాపింగ్‌కు వచ్చేవారిలో 50 శాతానికిపైగా ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. పండుగరోజుల్లో కాలు మోపేందుకూ స్థలం ఉండదు. దీపావళి, సంక్రాంతి వంటి పండుగల్లో ప్రజలు ఊపిరాడక ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రంగనాథన్ తెరులో అనేక దుకాణాలు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు సాగించడమే ఈ ఇబ్బందులన్నింటికీ కారణం. దీనిపై వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 26 దుకాణాలకు చెన్నై కార్పొరేషన్ రెండు సంవత్సరాల క్రితం సీల్ వేసింది. అక్కడి వ్యాపారులు తొలుత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత సుప్రీంకోర్టు ద్వారా పోరాడుతున్నారు. ఆరు వారాల అనుమతి పొంగల్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకున్న సుప్రీంకోర్టు 2012 జనవరి 9వ తేదీ నుంచి ఆరువారాలు 26 దుకాణాల్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా కార్పొరేషన్‌కు సూచించింది. ఈ మేరకు దుకాణాలు తెరుచుకున్నాయి. ఆరువారాల గడువు పూర్తయినా మరలా వాటికి సీల్ వేసే ప్రయత్నం కార్పొరేషన్ అధికారులు చేయలేదు. మరోవైపు 26 దుకాణాల్లో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల తీరును ఎండగట్టా రు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దుకాణాల్లో యథేచ్ఛగా వ్యాపారం సాగుతుండడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన గడువు పూర్తికాగానే ఆ 26 దుకాణాలకు ఎందుకు సీల్ వేయలేదంటూ చెన్నై కార్పొరేషన్, విద్యుత్, నీటి సరఫరా విభాగాలకు నోటీసులు జారీ చేసింది.