కేలంబాక్కం సమీపాన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రరాష్ట్రం గుంటూరుకు చెందిన పాసం వెంకటరెడ్డి కుమారుడు లింగారెడ్డి (20). కేలంబాక్కం సమీపం మేలకొట్టయూర్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్
టీ.నగర్, న్యూస్‌లైన్ : కేలంబాక్కం సమీపాన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రరాష్ట్రం గుంటూరుకు చెందిన పాసం వెంకటరెడ్డి కుమారుడు లింగారెడ్డి (20). కేలంబాక్కం సమీపం మేలకొట్టయూర్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఈసీ చదువుతున్నా డు. అతని స్నేహితులు ఇద్దరితో కండిగలో ఉన్న ఒక భవనంలోని తొమ్మిదో అంతస్తులో బసచేస్తూ వచ్చాడు. ఇలాఉండగా సోమవారం వేకువజామున మూడు గంటల సమయంలో అక్కడ వాచ్‌మన్ నిఘా పనుల్లో ఉన్నారు. అ ప్పుడు నేలపై రక్తపు మడుగులో లిం గారెడ్డి నిర్జీవంగా కనిపించడంతో ది గ్భ్రాంతి చెందాడు. దీనిగురించి తాళంబూరు పోలీసులకు సమాచారం తెలిపా రు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృ త దేహాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ జరిపారు. విచారణలో ఆది వారం అర్ధ రాత్రి వరకు లింగారెడ్డి స్నేహితులతో గదిలో టీవీ చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతని స్నేహితులు నిద్రపోయారు. లింగారెడ్డి మేడ పై నుంచి కిందికి చూసినట్లు తెలిసింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయంపై తెలియాల్సి ఉంది.