Engineering student died
-
చెట్టును ఢీకొట్టిన కారు.. ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
కీసర: కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు విశ్వతేజ, యశ్వంత్, కలసాని రాజేందర్ కారులో బోగారం గ్రామం మీదగా ఘట్కేసర్ వైపు వెళ్తున్నారు. బోగారం దాటాక ఎల్లమ్మ గుడి మూలమలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న రాజేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న విశ్వతేజ (20) కాలు విరిగింది. వెనక సీటులో కూర్చున్న యశ్వంత్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బోగారంలోని హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఘట్కేసర్లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. రాజేందర్, యశ్వంత్‌ల స్వస్థలం ధర్మపురి. కాగా, విశ్వతేజది వేములవాడ. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని.. కాలేజీలో హఠాత్తుగా..
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని గెంట్యాల ప్రదీప్తి(18) గురువారం గుండెపోటుతో మృతి చెందింది. ప్రదీప్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం కాలేజీలో హఠాత్తుగా గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. ప్రదీప్తి హఠాన్మరణంతో ఆమె తల్లిదండ్రులు గెంట్యాల రేణుక–భూమేశ్‌లు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రదీప్తి మృతదేశాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్ల లోని స్వగృహానికి తరలించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే ఇంజినీరింగ్ విద్యార్థిని గుండెపోటుతో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: పాతబడిన భవనం వద్దకు తీసుకెళ్లి.. చిన్నారిపై దారుణంగా.. -
స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్: మిత్రులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాపులపాడు మండలం ఉమాహేశ్వరపురానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఉదయ్‌కిరణ్ (19) తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఏలూరుకు చెందిన తన స్నేహితులతో కలిసి కారులో మారేడుపల్లి విహారయాత్రకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామ సమీపంలో బ్రిడ్జిపై నుంచి కారు అదుపు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు ప్రాణాలతో బయట పడగా, ఉదయ్‌కిరణ్‌తో సహా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాలువలో గల్లంతైన మృతదేహాలను వెలికి తీసి విద్యార్థుల కుటుంబ సభ్యులకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త విని ఉదయ్‌కిరణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎంతో హుషారుగా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన తమ కొడుకు విగతజీవిగా మారటంతో కన్నీరుమున్నీరుగా రోదించారు. గ్రామంలోనూ విషాదం నెలకొంది. -
ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన లింగారెడ్డి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లింగారెడ్డి (21).. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సెయింట్ జాన్స్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భాస్కర్‌రెడ్డి సోదరుడు వినోద్ ఆదోనిలో ఉండటంతో లింగారెడ్డి అక్కడే ఉంచాడు. రోజూ బస్సులో కాలేజీకి వెళ్లివస్తున్నాడు. శుక్రవారం ఆదోని నుంచి తన స్నేహితుడి బైక్ తీసుకుని కాలేజీకి వెళ్లాడు. ఎమ్మిగనూరు సమీపంలోని షాదీఖానా దగ్గర ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో బైక్‌పై ఉన్న లింగారెడ్డితో పాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి. లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజులు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందించారు. బతకడం కష్టమని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లింగారెడ్డి మృతిచెందాదు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆకవీడు తరలించినట్లు ట్రాఫిక్ ఏఎస్ఐ నటరాజ్ తెలిపారు. -
అరకు నుంచి గంజాయి తరలిస్తూ బస్‌ను ఓవర్టేక్ చేయబోయి..
పెందుర్తి: నాయుడుతోట సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద బీఆర్టీఎస్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన గోపీ మనోజ్ (23), అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌కు చెందిన శేఖరమహంతి వరుణ్ కలిసి అరకు నుంచి నగరానికి స్కూటీపై వెళుతున్నారు. ఆర్ఆర్ వెంకటాపురం వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న ఆర్టీసీ బస్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో స్కూటీ అదుపు తప్పింది. దీంతో రోడ్డుపై తుళ్లిపడిన మనోజ్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న వరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరు ప్రయాణించిన స్కూటీని పరిశీలించగా అందులో రెండున్నర కిలోల గంజాయి(రెండు ప్యాకెట్లు) కనిపించింది. ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న క్రమంలో వీరు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన మనోజ్ నగరంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గాయపడ్డ వరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్ఐ బి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Guntur: ఫోన్ మాట్లాడుతుండగా బస్సు ఢీకొని యువకుడు మృతి -
మృత్యువే జయించింది
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం): క్యాన్సర్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉందని వైద్యులు చెప్పినప్పటికీ ఆ యువకుడు కుంగిపోలేదు. నాన్నా.. నాకు బతకాలని ఉందని ఆపరేషన్ చేయించండని ప్రాధేయపడ్డాడు. ఆర్థిక స్థోమత అంతగా లేకపోయినా స్నేహితులు, బంధువులు, దాతల సాయంతో అపరేషన్ చేయించారు. క్యాన్సర్ మహమ్మారి ముందు ఆ యువకుడి పోరాటం తలవంచింది. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి చేదుడుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలపై విధి చిన్నచూపు చూసింది. చిన్నప్పుడు కాలుకు తగిలిన గాయం ప్రాణాంతకంగా మారింది. బోన్‌మేరో (క్యాన్సర్) రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబలించింది. ఏడాదిపాటు మృత్యువుతో పోరాడి ఓడిన ఆ యువకుడి మృతి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వీరఘట్టం గ్రామానికి చెందిన గౌరీపతి మహాపాత్రో, గిరిజాకుమారి మహాపాత్రోల కుమారుడు సాయికిరణ్ మహాపాత్రో(22) బోన్‌మేరో క్యాన్సర్‌తో ఆదివారం రాత్రి మృతిచెందారు. సాయికిరణ్ టెక్కలి ఐతం కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్‌లో మూడో సంవత్సరం చదుతున్న సమయంలో (గతేడాది) కుడి కాలు మోకాలు వద్ద ఉబ్బింది. చదువు జ్యాసలో పడి కాలు గురించి పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత కాలు బాగా నొప్పిగా అనిపించడంతో తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడ వైద్యులకు కాలు ఎందుకు ఉబ్బిందో అర్థం కాలేదు. వెంటనే బైయాప్స్(క్యాన్సర్ నిర్థారణ) పరీక్ష చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో బైయాప్స్ పరీక్ష చేయించారు. 12 రోజుల తర్వాత వచ్చిన రిపోర్ట్స్‌లో క్యాన్సర్ తొలి దశలో ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెండు నెలల్లోనే మారిన పరిస్థితి.. ఆపరేషన్ పూర్తయిన తర్వాత రెండు నెలలు ఇంటిలోనే ఉం టూ చెలాకీగా కనిపించిన సాయికిరణ్‌కు ఆపరేషన్ జరిగిన చోటకాయ ఏర్పడింది. కాయ మూడు రోజుల్లో మూడింత లు పెరిగింది. వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని వెంటనే వ్యాధి ప్రబలిన కుడి కాలును తొలగించాలని, లేకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు సూచించారు. తన కాలు తీసేసి బతికించండని ప్రాధేయపడ్డాడు. నాలుగు నెలల కిందట కాలు తొలగించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. ముదిరిన వ్యాధి.. శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ చేసి కాలును తొలగించారు. అయినా వ్యాధి తీవ్రత తగ్గలేదు. కాలు నుంచి కాలేయం, గుండెకు క్యాన్సర్ ప్రబలడంతో చివరకు సాయికిరణ్ జీవితంపై ఆశలు వదులుకున్నాడు. ఏడాదిగా మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం రాత్రి తన ఇంటి వద్ద తుది శ్వాస విడిచాడు. సాయికిరణ్ మృతి చెందాడని తెలియడంతో టెక్కలి ఐతం కాళాశాల విద్యార్థులు, తల్లిదండ్రుల మిత్రులు, వీరఘట్టం కనోసా సిస్టర్లు, సిబ్బంది వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ధైర్యంగా నిలబడ్డాడు.. క్యాన్సర్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉందని వైద్యులు చెప్పినప్పటికీ సాయికిరణ్ కుంగిపోలేదు. నాన్నా.. నాకు బతకాలని ఉందని ఆపరేషన్ చేయించండని ప్రాధేయపడ్డాడు. ఆపరేషన్ చేయించే స్థోమత లేని ఆ కుటుంబానికి టెక్కలి ఐతం కళాశాల సహ విద్యార్థులు, మిత్రులు, బంధువులు, వీరఘట్టం కనోసా సిస్టర్స్‌తో పలువురు అండగా నిలిచారు. ఆపరేషన్‌కు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చారు. విశాఖపట్టణంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి, అగనంపూడిలోని టాటా క్యాన్సర్ ఆస్పత్రితోపాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు కూడా తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయించారు. ఆరు నెలల కిందట హైదరాబాద్ నిమ్స్‌లో శస్త్ర చికిత్స చేయించారు. తర్వాత రెండు నెలలకు సాయికిరణ్ ఆరోగ్యం కుదటపడింది. -
ఆత్మహత్యనా..వైద్యం వికటించిందా...
రాజంపేట(వైఎస్సార్‌కడప): స్థానికంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న మహమ్మద్‌బాషా అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా, సుబాన్ల పెద్ద కుమారుడు మహమ్మద్‌బాషా రాజంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. బోయనపల్లెలో అద్దె గదిలో సహచర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఏమి జరిగిందో తెలియదు కాని శనివారం రాత్రి భోజనం కోసం బయటకు వచ్చిన మహబూబ్‌బాషా విషద్రావణం తాగి రూముకు వెళ్లాడు. ఈ విషయం తోటి మిత్రులకు తెలిపాడు. వారు హుటాహుటిన ఆర్‌ఎస్‌రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేశాక కోలుకున్నాడు. ఆ తర్వాత నర్సు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడని తోటి విద్యార్థులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు మాట్లాడుతూ విద్యార్ధి మహబూబ్‌బాషా విషం తీసుకోవడం వల్ల చనిపోయాడా.. వైద్యం వికటించి మృతి చెందాడా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలుతుందన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
బైక్ రేసింగ్, ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
పాలక్కాడ్, కేరళ : బైక్ రైడింగ్ సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది. రేసింగ్‌లో భాగంగా బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పాలక్కాడ్ జిల్లాకు చెందిన మిధున్ కోశ్(22) నెహ్రూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ రైడింగ్ అంటే అతడికి ఇష్టం. బైక్ రేసింగ్లలో పాల్గొనడం అలవాటు. ఇప్పటికే పలు రేసింగ్‌లో పాల్గొన్న మిధున్ అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుండేవాడు. అదే కోవలో అమెరికాకు చెందిన ‘ఐరన్ బట్ అసోసియేషన్’ నిర్వహించిన రేసింగ్‌లో అతను పాల్గొన్నాడు. ఈ పోటీలో భాగంగా బైక్‌పై 24 గంటల్లో 1600 కిలో మీటర్లు ప్రయాణించాలి. అందుకోసం మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరిన మిధున్ కర్ణాటకకు చేరుకోగానే జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పాలక్కాడ్ నుంచి బయల్దేరిన తన కుమారుడు తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకోని లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పాడని అతడి తల్లి పేర్కొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని బ్యాగులో ట్రిప్‌కు సంబంధించిన మ్యాప్ లభించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తల్లిదండ్రుల ఆశలు ఆవిరి
అక్కిరెడ్డిపాలెం(గాజువాక)/ఆరిలోవ(విశాఖ తూర్పు): కుటుంబానికి అంది వస్తాడనుకున్న కొడుకుని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేయడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూపరులను కలిచివేస్తున్నాయి. ప్రైవేట్ గుమస్తాగా పనిచేస్తున్నప్పటికీ కుమారులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని కలలుకన్న ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. వీకెండ్ స్నేహితులతో గడిపేందుకు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. రుషికొండ సమీపంలో బీచ్‌రోడ్డులో శనివారం అర్థరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇంజినీరింగ్ విద్యార్థి రోహిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారకర ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 59వ వార్డు నాతయ్యపాలెంకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న తొంగడదీవి కాశీనాథ్, పద్మావతిలకు రోహిత్ (21), ఇంటర్ చదువుతున్న గుణంత్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రోహిత్ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గల మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆర్కే బీచ్‌లో తన స్నేహితుడు పుట్టినరోజు వేడుకకు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. రోహిత్‌తోపాటు మరో స్నేహితుడు విక్టర్ పాల్ కలిసి బైక్‌పై రుషికొండ వెళ్లారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్నేహితులకు రోహిత్ ఫోన్ చేశాడు. ఆర్కే బీచ్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నామని... అక్కడకు రావాలని స్నేహితులు చెప్పడంతో అర్థరాత్రి 2 గంటల సమయంలో రోహిత్, పాల్ కలిసి బయలుదేరారు. రుషికొండ కూడలి వద్ద బైక్ టర్న్ తిప్పారు. ఆ సమయంలో బైక్ అదుపు తప్పడంతో అక్కడే ఓ షాపు వద్ద టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులను బైక్‌తో ఢీకొట్టి పల్టీకొట్టారు. దీంతో బైక్ వెనుక కూర్చొన్న రోహిత్ కిందపడి తలకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న విక్టర్ పాల్‌తో పాటు టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు అమర్జాన్, బిషప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని ఆరిలోవ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, విక్టర్‌పాల్‌ను కేజీహెచ్‌కు తరలించారు. పాల్ ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పాల్ అచ్యుతాపురం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. విషయం తెలుసుకొన్న మృతుని తండ్రి కాశీనాథ్ ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు. అతని ఫిర్యాదు మేరకు ఎస్ఐ అప్పారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం రోహిత్ అంత్యక్రియలు స్వస్థలం నాతయ్యపాలెంలోని శ్మశానవాటికలో ఆశ్రునయనాల మధ్య నిర్వహించారు. -
కారు అదుపు తప్పి.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
గండేపల్లి (జగ్గంపేట): ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్‌కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ò ³ద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్‌ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు. లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్‌కు చెందిన పలువురు అక్కడికు చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్ కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్‌లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎసై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భీతిల్లిన సిబ్బంది షెల్టర్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్‌ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు. అతివేగమా.....రోడ్డుపై బురదగా ఉన్న గ్రావెలా? విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్‌ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
ఏలూరు (వన్‌టౌన్) : ద్వారకాతిరుమల దర్శనానికి బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా లారీ ఢీకొనడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన మల్లిరెడ్డి సునీత విజయవాడ హాస్టల్ ఉంటూ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో ఏడాది చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన లంక భరత్‌కుమార్ కూడా విజయవాడలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. ఈ నేపథ్యంలో ఇద్దరూ విజయవాడ నుంచి సోమవారం స్నేహితురాలితో బజాజ్ ఎవెంజర్ ద్విచక్రవాహనంపై ద్వారకాతిరుమల వెళ్లారు. తిరిగి విజయవాడ వెళుతుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం దగ్గరలోకి వచ్చేసరికి లారీ వీరిని ఢీకొట్టి ఆపకుండా వెళిపోయింది. ఈ ప్రమాదంలో భరత్‌కుమార్ తలపై నుంచి లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న సునీత స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం క్షతగాత్రురాలిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. సునీత తండ్రి కాకినాడలో వ్యవసాయం చేస్తుండగా, భరత్‌కుమార్ తండ్రి ఆంధ్రాబ్యాంకు అసిస్టెంట్ మేనేజరుగా కరీంనగర్లో పనిచేస్తున్నారు. పెదవేగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
టీ.నగర్, న్యూస్‌లైన్ : కేలంబాక్కం సమీపాన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రరాష్ట్రం గుంటూరుకు చెందిన పాసం వెంకటరెడ్డి కుమారుడు లింగారెడ్డి (20). కేలంబాక్కం సమీపం మేలకొట్టయూర్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఈసీ చదువుతున్నా డు. అతని స్నేహితులు ఇద్దరితో కండిగలో ఉన్న ఒక భవనంలోని తొమ్మిదో అంతస్తులో బసచేస్తూ వచ్చాడు. ఇలాఉండగా సోమవారం వేకువజామున మూడు గంటల సమయంలో అక్కడ వాచ్‌మన్ నిఘా పనుల్లో ఉన్నారు. అ ప్పుడు నేలపై రక్తపు మడుగులో లిం గారెడ్డి నిర్జీవంగా కనిపించడంతో ది గ్భ్రాంతి చెందాడు. దీనిగురించి తాళంబూరు పోలీసులకు సమాచారం తెలిపా రు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృ త దేహాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ జరిపారు. విచారణలో ఆది వారం అర్ధ రాత్రి వరకు లింగారెడ్డి స్నేహితులతో గదిలో టీవీ చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతని స్నేహితులు నిద్రపోయారు. లింగారెడ్డి మేడ పై నుంచి కిందికి చూసినట్లు తెలిసింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయంపై తెలియాల్సి ఉంది.