కీసర: కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు విశ్వతేజ, యశ్వంత్, కలసాని రాజేందర్ కారులో బోగారం గ్రామం మీదగా ఘట్‌కేసర్ వైపు వెళ్తున్నారు. బోగారం దాటాక ఎల్లమ్మ గుడి మూలమలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న రాజేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న విశ్వతేజ (20) కాలు విరిగింది.
వెనక సీటులో కూర్చున్న యశ్వంత్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బోగారంలోని హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఘట్‌కేసర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. రాజేందర్, యశ్వంత్‌ల స్వస్థలం ధర్మపురి. కాగా, విశ్వతేజది వేములవాడ. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment