
హనుమాన్‌జంక్షన్ రూరల్: మిత్రులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాపులపాడు మండలం ఉమాహేశ్వరపురానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఉదయ్‌కిరణ్ (19) తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఏలూరుకు చెందిన తన స్నేహితులతో కలిసి కారులో మారేడుపల్లి విహారయాత్రకు వెళ్లాడు.
తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామ సమీపంలో బ్రిడ్జిపై నుంచి కారు అదుపు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు ప్రాణాలతో బయట పడగా, ఉదయ్‌కిరణ్‌తో సహా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
కాలువలో గల్లంతైన మృతదేహాలను వెలికి తీసి విద్యార్థుల కుటుంబ సభ్యులకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త విని ఉదయ్‌కిరణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎంతో హుషారుగా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన తమ కొడుకు విగతజీవిగా మారటంతో కన్నీరుమున్నీరుగా రోదించారు. గ్రామంలోనూ విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment