Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Telangana BRS MLAs Defection Case March 25th Updates1
పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరుగుతోంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు వింటోంది. ఇరుపక్షాల వాదనలతో.. మధ్యలో బెంచ్‌ జోక్యంతో.. హాట్‌ హాట్‌గా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉంది. అలాంటప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుంది.: జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనంగత తీర్పులు కాదని ఎలా ముందుకు వెళ్లగలం?: సుప్రీంకోర్టుఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయిఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదుఅలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్లగలం? బీఆర్‌ఎస్‌ వాదనలు 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌ ఫిర్యాదు చేశాం: : బీఆర్‌ఎస్‌ న్యాయవాది ఆర్యమా సుందరంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్‌ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్‌ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది‌స్పీకర్‌ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్‌ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్‌ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్‌‌ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలి కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కోరిన ప్రతివాదులుప్రతివాదులపై సుప్రీం కోర్టు ఆగ్రహం కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి ధర్మాసనం ఆగ్రహంఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది: ధర్మాసనంరీజనబుల్‌ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయలేదా?అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్‌ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్‌ బెంచ్‌ జోక్యం సరైందో కాదో చూస్తాం?స్పీకర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు.. స్పీకర్‌ తరఫున కౌంటర్‌ దాఖలు చేసిన కార్యదర్శిస్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా?రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా?ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తాజాగా.. పిటిషనర్ల ఉద్దేశాలను తప్పుబడుతూ స్పీకర్‌ తరఫున కౌంటర్‌ను అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేశారు.‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్‌ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి నెలలు గడుస్తున్నా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఈ క్రమంలో.. గత విచారణ సందర్భంగా స్పీకర్, స్పీకర్‌ కార్యదర్శి, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీలోపు దీనిపై రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అఫిడవిట్‌లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్‌కు తాము రాజీనామా చేయ‌లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేర‌లేదని.. మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌లో నిజం లేదని.. కాబట్టి ఈ అన‌ర్హ‌త పిటీష‌న్ల‌కు విచార‌ణ అర్హ‌త లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్ట‌ర్ల‌ను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడ‌విట్‌లో జ‌త చేశారు. తాజాగా.. సోమవారం(మార్చి 24) స్పీకర్‌ తరఫున అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్‌ వేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యా‍యస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్​పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది.

Kommineni Comments On Chandrababu And Revanth Reddy2
గురు శిష్యుల కాకమ్మ కథలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్‌లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్‌ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్‌లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్‌ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్‌ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్‌గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్‌తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్‌ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్‌లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

E Shinde First Reaction On Kunal Kamra Episode Says This3
E Shinde: ముమ్మాటికీ పొలిటికల్‌ సుపారీనే!

ముంబై: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. కునాల్‌ ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగానే చేసినట్లు తాను అర్థం చేసుకోగలనని.. కానీ ప్రతిదానికి ఓ హద్దు ఉంటుందని అన్నారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకు దిగారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు స్టాండప్‌ కమెడియన్‌ కునాల్. ఈ నేపథ్యంలో ఆ షో జరిగిన హబిటాట్‌ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే అది ఎవరైనా సరే విధ్వంసానికి తన మద్దతు ఎప్పుడూ ఉండబోదని ఏక్‌నాథ్ షిండే అన్నారు. బీబీసీ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కునాల్‌ ఎపిసోడ్‌పై స్పందించారు.ప్రజాస్వా​మ్యంలో వాక్‌ స్వాతంత్రం అందరికీ ఉంటుంది. దీనిని కాదనలేం. నా సంగతి పక్కన పెట్టండి. ప్రధాని మోదీ, భారత మాజీ న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, హోం మంత్రి అమిత్‌ షా..వీళ్ల గురించే కాదు ప్రముఖ వ్యాపారులు, గొప్ప గొప్పవాళ్ల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడతను. ఇలాంటి వ్యాఖ్యల కోసం అతనికి ఎవరి నుంచి సుపారీ అందింది?. ఇది కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రే అని అన్నారాయన. ఈ వ్యవహారంలో ప్రజలు కూడా ప్రతిపక్షాలనే వేలెత్తి చూపిస్తున్నారని.. అయినా వాళ్ల విధానాలు మారడం లేదన్నారు. ఇక హబిటాట్‌ స్టూడియోపై జరిగిన దాడిని ఖండించిన షిండే.. అది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఏక్‌నాథ్‌ షిండే అనేది చాలా సున్నితమైన అంశం. నాపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. కానీ, నేను నా పనితోనే వాటికి బదులిస్తుంటా. విధ్వంసానికి నేను వ్యతిరేకం. కానీ, పార్టీ కార్యకర్తలు ఊరుకోలేరు కదా. చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

IPL 2025: Delhi Capitals Captain Axar Patel Comments After Win Against LSG4
IPL 2025: ఆ ఓవర్‌ స్టబ్స్‌కు ఎందుకు ఇచ్చావని ఇప్పుడు ఎవరూ నన్ను తిట్టరు: అక్షర్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ పరుగు తేడాతో గెలిచింది. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా చివరికి విజయం సాధించింది. ఆశుతోష్‌ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. మిచెల్‌ మార్ష్‌ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఢిల్లీని అశుతోష్‌.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (22 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు), విప్రాజ్‌ నిగమ్‌ సాయంతో గెలిపించాడు. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్‌లో గెలుపుకు 6 పరుగులు కావాలి. తొలి బంతికి లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ మోహిత్‌ శర్మ స్టంపింగ్‌ను మిస్‌ చేశాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న ఢిల్లీ ఆ తర్వాత మూడో బంతిని అశుతోష్‌ సిక్సర్‌గా మలచడంతో సంబరాలు చేసుకుంది. ఐపీఎల్‌లో ఇంత భారీ లక్ష్యాన్ని (210) ఛేదించడం ఢిల్లీకి ఇదే మొదటిసారి. ఐపీఎల్‌లో ఓ జట్టు లక్నోపై 200 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదించడం​ కూడా ఇదే మొదటిసారి.మ్యాచ్‌ అనంతరం​ విన్నింగ్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఎందుకో తెలీదు నా కెప్టెన్సీలోనే ఇలా జరుగుతుంది. పరిస్థితులు అప్‌ అండ్‌ డౌన్‌గా ఉంటాయి. మొత్తానికి మేం గెలిచాం. ఇప్పుడు ఆ ఓవర్ స్టబ్స్‌కి ఎందుకు ఇచ్చావని జనాలు నన్ను తిట్టరు. చివరిసారిగా ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ ఎప్పుడు చూశానో గుర్తులేదు.మొదటి ఆరు ఓవర్లలో వాళ్ళు (మార్ష్‌, పూరన్‌) ఆడిన తీరు చూస్తే ఈజీగా 240 పైచిలుకు పరుగులు సాధిస్తారని అనుకున్నా. మా బౌలర్లు చాలా ఎక్కువ పరుగులు ఇచ్చారని అనిపించింది. మొదట్లో మేము కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాము. అయినా తిరిగి ఆటలోకి రాగలిగాము. విప్రాజ్‌ సామర్థ్యం గురించి మాకు ముందే తెలుసు.కాగా, ఈ మ్యాచ్‌లో అక్షర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌తో 13వ ఓవర్‌ వేయించాడు. అప్పటికే శివాలెత్తిపోయిన పూరన్‌ స్టబ్స్‌ బౌలింగ్‌లో మరింత రెచ్చిపోయి వరుసగా నాలుగు సిక్సర్లు, బౌండరీ సహా 28 పరుగులు పిండుకున్నాడు. అక్షర్‌ ఆ సమయంలో స్టబ్స్‌తో ఎందుకు బౌలింగ్‌ చేయించాడో ఎవరికీ అర్దం కాలేదు.

'9 Kgs Weight Loss In 3 Months Jyotika Shares Her Transformation Secrets Thanks Vidya Balan5
మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్‌ సీక్రెట్‌ ఆమే!

బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్‌. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్‌ 2024లో విద్యాబాలన్‌ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్‌కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్‌ బట్‌ ’నో ఎక్సర్‌ సైజ్‌’ రొటీన్‌ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్‌ ఫిట్‌నెస్‌ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్‌ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్‌ గ్రూప్‌ అమురా హెల్త్‌ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్‌ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్‌ ట్రైనింగ్‌ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్‌ డైట్‌ ప్లాన్‌ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్‌ ట్రైనింగ్‌ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్‌కు ధ్యాంక్స్‌ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్‌నెస్‌ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్‌ కర్రీ బిజినెస్‌ : సండే స్పెషల్స్‌, టేస్టీ ఫుడ్‌

Massive Encounter On The Border Of Dantewada Bijapur District6
మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా భద్రతా బలగాలు సాధ్వీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దులో గల అడవుల్లో మావోయిస్టుల స్థావరాన్ని 500 మంది బలగాలు చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఆపరేషన్‌పై నిఘా పెట్టారు. ఘటనా స్థలంలో కూంబింగ్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భధ్రతా బలగాలను రంగంలోకి దించారు.

Gold and silver rates today on market in Telugu states7
దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,850 (22 క్యారెట్స్), రూ.89,290 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,290 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 దిగి రూ.82,000కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి రూ.89,440 వద్దకు చేరింది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Oscar winning Palestinian filmmaker detained by Israeli military8
ఆస్కార్‌ దర్శకుడిపై దాడి.. ఆచూకీ కూడా గల్లంతు

అస్కార్‌ అవార్డ్‌ గ్రహిత దర్శకుడు హమ్దాన్ బల్లాల్‌పై ఇజ్రాయెల్ స్థిరనివాసులు దాడి చేశారు. 'నో అదర్ ల్యాండ్' డాక్యుమెంటరీ చిత్రానికి ఆయన కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రం విడుదల సమయంలో ఇజ్రాయెల్‌తో పాటు చాలా విదేశాల్లో ఉన్న ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పాలస్తీనాకు చెందిన బల్లాల్‌ ఈ సినిమాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చూపారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేస్తామని గతంలోనే వారు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నేళ్లుగా హింస జరుగుతున్న నేపథ్యంలో 'నో అదర్ ల్యాండ్' అనే డాక్యుమెంటరీతో దర్శకుడు హమ్దాన్ బల్లాల్‌ సంచలనం రేపాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్‌లోని వలసదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న బల్లాల్‌ను అడ్డగించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు సుమారు 20 మంది ముసుగులు ధరించి రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆపై ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుందని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఆయన మిత్రుడు యువల్ అబ్రహం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బల్లాల్ తల నుంచి అధిక రక్తస్రావం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు అతని ఆచూకి ఎక్కడ ఉందో తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు.

Hyderabad MMTS Incident: Police  Arrest Accused9
ఎంఎంటీఎస్‌ ఘటన: నిందితుడి గుర్తించిన బాధితురాలు

హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్‌ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకుని సికింద్రాబాద్‌ నుంచి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్‌లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విరుకుపడుతోంది.

How White House Officials Accidentally Shared Yemen War Plan With Journalist10
White House: ముందే లీక్‌.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

వాషింగ్టన్‌: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్‌ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. అమెరికా రక్షణశాఖమంత్రి పీట్‌ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్‌లోకి ఓ యూఎస్‌ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్‌లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్‌పై యుద్ధానికి సమాచారం పోస్ట్‌ చేశారు. ‘ద అట్లాంటిక్‌’ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్‌పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్‌లో యాడ్‌ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్‌ చేయలేదు. జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్‌హౌజ్‌ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్‌హౌజ్‌ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్‌ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్‌ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్‌ను హెచ్చరించారాయన. మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్‌ రాజధాని సనా, సదా, అల్‌ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్‌ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్‌ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement