
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.ఏకాదశి రా.11.58 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: శ్రవణం రా.12.28 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: తె.4.23 నుండి 5.55 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.29 నుండి 9.17 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.45 వరకు, అమృత ఘడియలు: ప.1.55 నుండి 3.31 వరకు, మతత్రయ ఏకాదశి; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.04, సూర్యాస్తమయం: 6.07.
మేషం... వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కొత్త వస్తువుల సేకరణ. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
వృషభం... పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
మిథునం... చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కర్కాటకం... పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. ధనలాభం. వ్యవహార విజయం. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో కొంత పురోగతి.
సింహం... చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.
కన్య.... సన్నిహితులతో తగాదాలు.ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
తుల... ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం... ఉద్యోగ, వివాహయత్నాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
ధనుస్సు..... పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కుంభం.. వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యస్థితి. ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతాయి.
మీనం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.
Comments
Please login to add a commentAdd a comment