ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన లింగారెడ్డి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లింగారెడ్డి (21).. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సెయింట్ జాన్స్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
భాస్కర్‌రెడ్డి సోదరుడు వినోద్ ఆదోనిలో ఉండటంతో లింగారెడ్డి అక్కడే ఉంచాడు. రోజూ బస్సులో కాలేజీకి వెళ్లివస్తున్నాడు. శుక్రవారం ఆదోని నుంచి తన స్నేహితుడి బైక్ తీసుకుని కాలేజీకి వెళ్లాడు. ఎమ్మిగనూరు సమీపంలోని షాదీఖానా దగ్గర ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో బైక్‌పై ఉన్న లింగారెడ్డితో పాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి.
లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజులు ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందించారు. బతకడం కష్టమని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లింగారెడ్డి మృతిచెందాదు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆకవీడు తరలించినట్లు ట్రాఫిక్ ఏఎస్‌ఐ నటరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment