కంభం: చాయ్ కేఫ్‌లు ఇతర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న యువకులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ‘జూదం.. జీవితం ఛిద్రం’ శీర్షికన ఈనెల 26వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, మట్కా, ఇతర అసాంఘీక కార్యక్రమాలపై నిఘా పెంచారు. కంభం పట్టణంలో పలు చాయ్ కేఫ్‌ల్లో బుధవారం రాత్రి నుంచి ఎస్సై నరసింహారావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీ చేశారు. అనుమానస్పదంగా ఉన్న యువకుల మొబైల్ ఫోన్లు నిశితంగా పరిశీలించారు. కంభంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ మట్కా, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు తనిఖీలు చేస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
పోలీసుల ముమ్మర తనిఖీలు