మార్కాపురం: మార్కాపురం ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి ఎన్నిక విషయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను 13 మంది ఎంపీటీసీ సభ్యులు శివరసావహించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పేర్కొన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడిన ఎంపీటీసీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గురువారం మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడారు. అందరూ ఒకే తాటిపై నిలిచి లక్ష్మీదేవిని ఎంపీపీగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయంలో పోరెడ్డి అరుణా చెంచిరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఆమె రాజీనామాతో బండి లక్ష్మిదేవికి ఎంపీపీగా అవకాశం లభించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎన్నిక ముగియడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలని నూతన ఎంపీపీ లక్ష్మీదేవికి సూచించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు పోరెడ్డి చెంచిరెడ్డి, తుమ్మా వెంకటరెడ్డి, రఫీ, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి సోదరుడు కుందురు వెంకటరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, దేవండ్ల మల్లయ్య, పలువురు సర్పంచ్‌లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు