పెద్దారవీడు: డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో మిర్చి లోడ్ లారీ బోల్తా పడింది. ఈ సంఘటన గురువారం వేకువజామున పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి చెందిన రైతులు మిర్చిని లారీలో లోడ్ చేసుకుని గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో దేవరాజుగట్టు సమీపంలో లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌తో సహా రైతులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు
ఏపీపీగా కేవీ రామేశ్వరరెడ్డి
ఒంగోలు: ఒంగోలు 3వ అదనపు జిల్జా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కేవీ రామేశ్వరరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఈ హోదాలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈయనకు నెలకు రూ.40 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.