LINGAAREDDY
-
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ప్రొద్దుటూరులో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండలంలో దివ్యశతాధిక రజతోత్సవ సావనీర్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ..ఆర్యవైశ్యులు ఎప్పుడూ ఐకమత్యంతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు రాంమోహన్, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు దాటుతున్న బైకును మినీలారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పెద్దఅంబర్‌పేటకు చెందిన తంగెడుపల్లి లింగారెడ్డి (32) పెద్దఅంబర్‌పేట చౌరస్తా వద్ద బైక్‌పై వెళుతూ జాతీయ రహదారిని దాటుతున్నాడు. విజయవాడ వైపు నుంచి వేగంగా వచ్చిన మినీలారీ బైకును ఢీ కొట్టింది. దీంతో బైకుపై ఉన్న లింగారెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
టీ.నగర్, న్యూస్‌లైన్ : కేలంబాక్కం సమీపాన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రరాష్ట్రం గుంటూరుకు చెందిన పాసం వెంకటరెడ్డి కుమారుడు లింగారెడ్డి (20). కేలంబాక్కం సమీపం మేలకొట్టయూర్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఈసీ చదువుతున్నా డు. అతని స్నేహితులు ఇద్దరితో కండిగలో ఉన్న ఒక భవనంలోని తొమ్మిదో అంతస్తులో బసచేస్తూ వచ్చాడు. ఇలాఉండగా సోమవారం వేకువజామున మూడు గంటల సమయంలో అక్కడ వాచ్‌మన్ నిఘా పనుల్లో ఉన్నారు. అ ప్పుడు నేలపై రక్తపు మడుగులో లిం గారెడ్డి నిర్జీవంగా కనిపించడంతో ది గ్భ్రాంతి చెందాడు. దీనిగురించి తాళంబూరు పోలీసులకు సమాచారం తెలిపా రు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృ త దేహాన్ని స్వాధీనం చేసుకుని, విచారణ జరిపారు. విచారణలో ఆది వారం అర్ధ రాత్రి వరకు లింగారెడ్డి స్నేహితులతో గదిలో టీవీ చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతని స్నేహితులు నిద్రపోయారు. లింగారెడ్డి మేడ పై నుంచి కిందికి చూసినట్లు తెలిసింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయంపై తెలియాల్సి ఉంది.