రోడ్డు దాటుతున్న బైకును మినీలారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రోడ్డు దాటుతున్న బైకును మినీలారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పెద్దఅంబర్‌పేటకు చెందిన తంగెడుపల్లి లింగారెడ్డి (32) పెద్దఅంబర్‌పేట చౌరస్తా వద్ద బైక్‌పై వెళుతూ జాతీయ రహదారిని దాటుతున్నాడు. విజయవాడ వైపు నుంచి వేగంగా వచ్చిన మినీలారీ బైకును ఢీ కొట్టింది. దీంతో బైకుపై ఉన్న లింగారెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.