అగ్గిపెట్టెల కర్మాగారంలో అగ్ని ప్రమాదం
Published Sat, Sep 28 2013 12:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
టీనగర్, న్యూస్‌లైన్: కోవిల్ పట్టి అగ్గిపెట్టెల కర్మాగారంలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షల విలువైన బండిల్స్ దగ్ధమయ్యాయి. తూత్తుకుడి జిల్లా, కోవిల్‌పట్టి మిల్లు వీధికి చెందిన జాన్సన్ (40) రెండవ వీధిలో అగ్గిపెట్టెల కర్మాగారాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ వంద మందికి పైగా పనిచేస్తున్నారు. ఉత్తర రాష్ట్రాల్లో వర్షాలు, ఎగుమతుల్లో సమస్య కారణంగా కోవిల్‌పట్టి, కళుగుమలై, శంకరన్ కోవిల్ ప్రాంతాల్లో అగ్గిపెట్టెల కర్మాగారాలకు గురువారం నుంచి సెలవు ప్రకటించారు.
అదేవిధంగా జాన్సన్ కర్మాగారానికి సెలవు ప్రకటించారు. ఇలావుండగా గురువారం అర్ధరాత్రి జాన్సన్ అగ్గిపెట్టెల కర్మాగారంలో హఠాత్తుగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. కర్మాగారంలో పేర్చిపెట్టిన అగ్గిపెట్టెల బండిల్స్‌కు నిప్పంటుకోవడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న కోవిల్‌పట్టి, కళుగుమలై అగ్నిమాపక సిబ్బంది మంటలను అందులోకి తెచ్చారు. కోవిల్‌పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు.
కెమికల్ కంపెనీలో అగ్నిప్రమాదం
చెన్నై ప్యారిస్‌లోని ఓ కెమికల్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.లక్షల మేర ఆస్తినష్టం వా టిల్లింది. ప్యారిస్ స్ట్రింగర్స్ వీధిలో కెమికల్ కంపెనీ ఉంది. ఇక్కడ 15 మంది కా ర్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం మ ధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నట్టుండి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఎస్‌ప్లనేడు, హైకోర్టు, బేసిన్ బ్రిడ్జి నుంచి నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంట లను అదుపుచేశారుు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఎస్‌ప్లనేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement