చెన్నై: మస్కిటో రిపెల్లెంట్‌తో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పొగతో ఊపిరాడక ఒక వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవరాళ్లు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం మనాలీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మత్తూర్‌కు చెందిన సంతానలక్ష్మి(65), 8 నుంచి 10 వయస్సున్న తన మనవరాళ్లు సంధ్య, ప్రియ రక్షిత, పవిత్రతో కలిసి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రించారు.
మస్కిటో రిపెల్లెంట్‌ను వెలిగించి, తాము పడుకున్న నైలాన్ చాపకు సమీపంలో ఉంచారు. అయితే, రిపెల్లెంట్ ప్రమాదవశాత్తు చాపకు అంటుకుని, మంటలు వ్యాపించాయి. శనివారం ఉదయం చుట్టుపక్కల వారు పొగను గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి, ఇంట్లో పరిశీలించగా నలుగురూ విగతజీవులై కనిపించారు. మస్కిటో రిపెల్లెంట్ పొగ కారణంగా ఊపిరాడక వారు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, చిన్నారుల తండ్రి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తల్లి కూడా అక్కడే ఉండిపోయింది. దీంతో, వారు ముగ్గురూ బామ్మ వద్దకు నిద్రించేందుకు వచ్చినట్లు తెలిసిందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment