mosquito repellent
-
మస్కిటో రిపెల్లెంట్తో మంటలు..
చెన్నై: మస్కిటో రిపెల్లెంట్తో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పొగతో ఊపిరాడక ఒక వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవరాళ్లు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం మనాలీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మత్తూర్కు చెందిన సంతానలక్ష్మి(65), 8 నుంచి 10 వయస్సున్న తన మనవరాళ్లు సంధ్య, ప్రియ రక్షిత, పవిత్రతో కలిసి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రించారు. మస్కిటో రిపెల్లెంట్‌ను వెలిగించి, తాము పడుకున్న నైలాన్ చాపకు సమీపంలో ఉంచారు. అయితే, రిపెల్లెంట్ ప్రమాదవశాత్తు చాపకు అంటుకుని, మంటలు వ్యాపించాయి. శనివారం ఉదయం చుట్టుపక్కల వారు పొగను గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి, ఇంట్లో పరిశీలించగా నలుగురూ విగతజీవులై కనిపించారు. మస్కిటో రిపెల్లెంట్ పొగ కారణంగా ఊపిరాడక వారు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, చిన్నారుల తండ్రి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తల్లి కూడా అక్కడే ఉండిపోయింది. దీంతో, వారు ముగ్గురూ బామ్మ వద్దకు నిద్రించేందుకు వచ్చినట్లు తెలిసిందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే...
ఇది చూడటానికి ఫ్యాషన్ రిస్ట్బ్యాండ్లా కనిపిస్తుంది. దీనిని చేతికి తొడుక్కుంటే, దోమలు ఆమడదూరం పరారైపోతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంజినీర్ కర్ట్ స్టోల్ రూపొందించిన ఈ పరికరాన్ని స్విస్ కంపెనీ ‘నోపిక్స్గో’ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! దోమల నుంచి రక్షణ కల్పించే ఈ హైటెక్ రిస్ట్‌బ్యాండ్, పరిసరాల్లో దోమలను గుర్తించగానే, విద్యుత్ తరంగాలను విడుదల చేస్తుంది. ఇందులోంచి వెలువడే విద్యుత్ తరంగాల తాకిడికి ఏదో తుఫాను ముంచుకొస్తున్నట్లుగా దోమలు గందరగోళంలో పడి, వెంటనే పారిపోతాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీని ఉత్పత్తి ప్రారంభించాలని ‘నోపిక్స్గో’ భావిస్తోంది. దీని ధర 70 యూరోల (రూ.6,255) వరకు పెట్టవచ్చని అంచనా! ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
దోమలను తరిమి కొట్టేందుకూ ఓ యాప్!!
ఈరోజుల్లో ఏ పనిచేయాలన్నా దానికి సంబంధించి స్మార్ట్ఫోన్లలో ఓ యాప్ కనిపిస్తోంది. తాజాగా, దోమల బారి నుంచి బయటపడటానికి కూడా ఒక యాప్‌ను తయారు చేశారు. ఇప్పటివరకు దోమలను తరిమి కొట్టాలంటే కాయిల్స్ గానీ, లిక్విడ్ గానీ లేదంటే మస్కిటో బ్యాట్లు గానీ ఉపయోగించేవారు. ఇప్పుడు అవేమీ అవసరం లేదని, స్మార్ట్‌ఫోన్‌లో తమ యాప్ ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుని, దాన్ని ఆన్ చేస్తే చాలని ఆ యాప్ రూపకర్తలు తెలిపారు. అదెలాగంటారా.. అయితే చదవండి. 'మస్కిటో రిపెల్లెంట్' అనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేయగానే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో అది శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దం భరించలేక దోమలు ఎక్కడివక్కడే పారిపోతాయి. ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న 'ఎం ట్రాకర్' అనే ఫీచర్‌తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది. ఈ యాప్ విడుదల చేసే శబ్దాలు కుక్క ఈలల కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటాయని, అందువల్ల మనుషులకు ఇబ్బందికరంగా అనిపించదని చెబుతున్నారు. పైగా, మన ప్రాంతానికి అనువుగా ఉండేలా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవచ్చు. దీనికి బ్యాటరీ కూడా పెద్దగా ఏమీ ఖర్చుకాదట.