old woman die
-
మస్కిటో రిపెల్లెంట్తో మంటలు..
చెన్నై: మస్కిటో రిపెల్లెంట్తో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పొగతో ఊపిరాడక ఒక వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవరాళ్లు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం మనాలీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మత్తూర్కు చెందిన సంతానలక్ష్మి(65), 8 నుంచి 10 వయస్సున్న తన మనవరాళ్లు సంధ్య, ప్రియ రక్షిత, పవిత్రతో కలిసి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రించారు. మస్కిటో రిపెల్లెంట్‌ను వెలిగించి, తాము పడుకున్న నైలాన్ చాపకు సమీపంలో ఉంచారు. అయితే, రిపెల్లెంట్ ప్రమాదవశాత్తు చాపకు అంటుకుని, మంటలు వ్యాపించాయి. శనివారం ఉదయం చుట్టుపక్కల వారు పొగను గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి, ఇంట్లో పరిశీలించగా నలుగురూ విగతజీవులై కనిపించారు. మస్కిటో రిపెల్లెంట్ పొగ కారణంగా ఊపిరాడక వారు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, చిన్నారుల తండ్రి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తల్లి కూడా అక్కడే ఉండిపోయింది. దీంతో, వారు ముగ్గురూ బామ్మ వద్దకు నిద్రించేందుకు వచ్చినట్లు తెలిసిందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి కన్నుమూత.. వయసు ఎంతంటే..?
పారిస్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్ దేశస్తురాలు లూసిలీ ర్యాండమ్(118) తుది శ్వాస విడిచారు. కోవిడ్‌ను జయించిన అత్యంత వృద్ధుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించిన ఈమెను స్థానికులు సిస్టర్ ఆండ్రీగా పిలుస్తారు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని ఎలీస్ పట్టణంలో జన్మించిన ఈమె వృత్తిరీత్యా నర్సు. మంగళవారం టౌలూన్ పట్టణంలో ఈమె మరణించారని ఆమె తరఫు ప్రతినిధి వెల్లడించారు. 2021 జనవరిలో ఈమెకు కరోనా సోకింది. అయితే, పెద్దగా అనారోగ్య లక్షణాలేవీ కనిపించకపోవడం విశేషం. కోవిడ్‌ను జయించిన బామ్మగా ప్రాచుర్యంపొందారు. ‘కష్టంగా భావించకుండా ఇష్టంగా పనిచేయడమే నా ఆరోగ్య రహస్యం. 108 ఏళ్ల వరకు నా పనులు నేనే చేసుకున్నా. రోజూ ఒక చాక్లెట్ తినడం, ఒక గ్లాస్ వైన్ తాగడం నా అలవాటు’ అని ఆండ్రీ గతంలో చెప్పారు. ర్యాండమ్ మృతి తర్వాత స్పెయిన్‌లో నివసిస్తున్న 115 ఏళ్ల అమెరికన్ మరియా బ్రాన్యాస్ మొరేరా ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డులకెక్కారు. చదవండి: జనాభాలో చైనాను దాటేశాం -
కాటికి పంపేవారే కరువయ్యారు!
కోదాడ: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తుందో నిరూపించే విషాద ఉదంతమిది. ఊరంతా బలగం ఉన్నా.. కనీసం కడసారి చూపునకైనా కన్నెత్తి చూసినవారు కానరాలేదు. కాటికి సాగనంపడానికి.. పాడెమోసేందుకు నలుగురు బంధువులు కరువయ్యారు. దీంతో కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న మనుమడు పుట్టెడు కష్టంలో ఒక్కడే నాయనమ్మను కారులో కాటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మునగాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు కుమారులు చనిపోయారు. దీంతో ఆమె కొద్దిరోజులుగా రెండో కుమారుడి కొడుకు (మనుమడి) వద్ద ఉంటోంది. అనారోగ్యంతో ఆదివారం ఆమె మృతిచెందింది. ఇదే సమయంలో ఆమె మనుమడు వేరేచోట కరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్ని చూసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామానికి చెందిన కొందరు ఈ విషయాన్ని మనుమడికి చెప్పగా, తన పరిస్థితిని వివరించి బోరున విలపించాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గ్రామానికి చెందిన నలుగురు పెద్దలు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. రాత్రి 7 గంటల సమయంలో పాజిటివ్‌తో ఇబ్బంది పడుతున్న మనుమడు పీపీఈ కిట్ ధరించి కారులో ఇంటికి వచ్చి మృతదేహాన్ని ఒక్కడే కారులోకి చేర్చాడు. అదే కారును నేరుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లి నాయనమ్మ అంత్యక్రియలు నిర్వహించాడు. -
విద్యుదాఘాతంతో వృద్ధురాలి దుర్మరణం
మిడ్జిల్ : ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మిడ్జిల్ మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన ఉప్పరి నారమ్మ (65) సోమవారం సాయంత్రం ఇంట్లో టీవీ ఆన్‌చేయగా ప్రమాదవశాత్తు కేబుల్ వైరుకు విద్యుత్ ప్రసారమైంది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురికాగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు.