చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాణాసంచా గోడౌన్ కావడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి భారీగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటల అదుపులోకి తెచ్చుందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment