టీ.నగర్, న్యూస్‌లైన్:
రిజిస్ట్రేషన్ పత్రాలను సీడీల రూపంలో అందచేసే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థల దస్తావేజుల రిజిస్ట్రేషన్, వివాహాల రిజిస్ట్రేషన్ వంటి పనులకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రజలు అధిక సంఖ్యలో ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో పని చేస్తున్నారుు.
స్థల సౌకర్యం లేకుండా సిబ్బంది ఇబ్బందులు పడడాన్ని దృష్టిలో ఉంచుకుని సొంతంగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం నామక్కల్ జిల్లా పల్లిపాళ యం, పుదుసత్రం, వేలూరు జిల్లా జోలార్‌పేట, వాలాజా, ఆర్కాడు, కాలనై, తిరువణ్ణామలై జిల్లా దూసి, కీల్‌కొడుంగాలూరు, కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు, పెరియకాంచీపురం, తూత్తుకుడి జిల్లా పుదూర్, కడంబూరు, ఈరోడ్ జిల్లా కవుందపాడి, కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి, కృష్ణగిరి జిల్లా ఊత్తం గరై, దిండుగల్ జిల్లా గుజిలియం పారై రామనాథపురం జిల్లా కడలాడి, కడలూరు జిల్లా కమ్మాపురం, పుదుకోటై జిల్లా ఇలుపూర్, తిరువూర్ జిల్లా పల్లడం వంటి 20 ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయూలకు కొత్త భవనాలను రూ.9.83 కోట్ల ఖర్చుతో నిర్మించారు. చెన్నై లో రూ.49 లక్షలతో సబ్ రిజిస్ట్రార్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. వీటితోపాటు కొత్త హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పత్రాల రిజిస్ట్రేషన్లను సీడీల రూపం లో అందచేసే పథకాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలు రూ.50 చార్జీ చెల్లించి ఈ సీడీలను అందుకోవచ్చని తెలిపారు.
తంజావూరు చిత్ర కళలో శిక్షణ
రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించే విధంగా వంద మంది మహిళలకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో వంద మంది మహిళలకు తంజావూరు చిత్రకళలో శిక్షణ ఇప్పించే విధంగా రూ.5 వేల విలువైన ముడిసరుకులతో కూడిన కిట్‌లు శుక్రవారం అందజేశారు. వీరికి రాష్ట్ర, జాతీయస్థాయిలో తంజావూరు చిత్ర కళలో అవార్డులు పొం దిన వారితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
సీడీల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
Published Sat, Nov 9 2013 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement