విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
Published Sat, Sep 14 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
టీనగర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం నగదు బహుమతులు అందజేశారు. హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ప్లస్‌వన్, ప్లస్‌టూ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులను ప్రో త్సహించాలనే ఉద్దేశంతో 2001-2002 లో ఉచిత సైకిళ్లు అందజేసే పథకం ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. 2005- 2006 లో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే అన్ని వర్గాల విద్యార్థులకు ఈపథకాన్ని వర్తింపజేశారు.
పస్తుత విద్యా సంవత్సరంలో రూ.212.4 కోట్లతో 6,43,867 సైకిళ్లు అందజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏడుగురు విద్యార్థులకు సైకిళ్లు అందజేసి పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పదో తరగతి పబ్లిక్ పరీక్ష ల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు పొందిన వా రికి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలచొప్పున అందజేశారు.
అటవీ శాఖ అధికారులకు జీపులు
రాష్ట్ర అటవీ శాఖాధికారులకు రూ.7.28 లక్షలతో జీపులను ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఆనందన్, ప్రభుత్వ కార్యదర్శి షీలాబాలకృష్ణన్, పర్యావరణ అటవీ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ మోహన్ వర్గీస్ సుంగత్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గౌతం డే ఇతర అధికారులు పాల్గొన్నారు.
12 ప్రభుత్వ కళాశాలల ప్రారంభం
ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 12 ప్రభుత్వ కళాశాలలను ప్రారంభించారు. పుదుక్కోట్టై జిల్లా కరంచకుడి, తంజావురు జిల్లా పేరావూరని, తిరువారూరు జిల్లా కాంగేయం, నామక్కల్ జల్లా, కుమారపాళయం, ధర్మపురి జిల్లా, కారిమంగళం, కృష్ణగిరి జిల్లా కారియమంగళం, కృష్ణగిరి జిల్లా హోసూరు, కాంచీపురం జిల్లా ఉత్తర మేరూరు, తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి, రామనాథపరం జిల్లా కడలాడి, తిరువాడనై, ముదుగళత్తూరు, విరుదునగర్ జిల్లా శివకాశిలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటుచేశారు. వాటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Advertisement
Advertisement