తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీ నగర్‌లోని ప్రముఖ వస్త్ర నగల దుకాణం చెన్నై సిల్క్స్ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు చుట్టుముట్టాయి. 5 ఫైర్ ఇంజిన్లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మంటలు వ్యాపించగా... దాదాపు అయిదు గంటలు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అగ్ని మాపక సిబ్బంది. లోపల చిక్కుకున్న 10మంది సిబ్బందిని కూడా కాపాడారు. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.