ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన భౌతికకాయానికి కన్నమ్మపేట దహనవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీనగర్‌లోని గొల్లపూడి నివాసంలో ఆయన భౌతికకాయానికి చిరంజీవి, సుహాసిని సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.