టీ.నగర్ : కన్యాకుమారి జిల్లా మయిలాడి మార్తాండపురం వాటర్‌ట్యాంక్ రోడ్డుకు చెందిన సెంథిల్‌కుమార్ (35) మయిలాడి పట్టణ పంచాయతీలో పనిచేస్తున్నాడు. భార్య రామలక్ష్మి (34). వీరిక ఉమారుడు శ్యాంసుందర్ (6), కుమార్తె కాంచనా (3)ఉన్నారు. తిరునెల్వేలిలో జరిగే బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉన్నందున పిల్లలు ఇరువురూ మంగళవారం పాఠశాలకు వెళ్లలేదు. సెంథిల్‌కుమార్ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు సమీపాన సొంత ఇంటిలో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం శ్యాంసుందర్, తాత అవ్వల ఇంటికి వెళ్లి చాలాసేపయినా తిరిగి రాలేదు. దీంతో రామలక్ష్మి కుమారుడి కోసం వెళ్లగా అక్కడ ఒక గదిలో గొంతు బిగించబడిన స్థితిలో శ్యాంసుందర్ ప్రాణాలకు పోరాడుతున్నాడు. దీంతో రామలక్ష్మి దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది.
ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని గొంతుకు ఉన్న తాడు తీసి నాగర్‌కోవిల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇలావుండగా తన ఇంట్లో ఉన్న కుమార్తె సంజనాను చూసుకోవాల్సిందిగా పక్కింటివారికి చెప్పారు. భర్త సెల్‌ఫోన్‌కు ప్రయత్నించగా అందలేదు. అతని కోసం పలుచోట్ల గాలించినా సమాచారం అందలేదు. మంగళవారం రాత్రి నాగర్‌కోవిల్ అస్పత్రిలో నగదు చెల్లించేందుకు రామలక్ష్మి ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింటివారి సాయంతో తలుపుపగులగొట్టి లోనికి వెళ్లగా సంజనా నీటితొట్టిలో శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న అంజుగ్రామం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతన్నారు. పోలీసుల విచారణలో దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లు తెలిసింది.
యువకుడి దారుణ హత్య
కోయంబత్తూరు : కోయంబత్తూరు సమీపాన మంగళవారం ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. కిణత్తుకడవు సమీపంలోని తామరైకుళం మదురైవీరన్ ఆలయం వీధికి చెందిన దినేష్‌కుమార్ (23) అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రియురాలి తమ్ముడు మణికంఠన్ (18) ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ప్రేమ నిరాకరించాల్సిందిగా దినేష్‌కుమార్‌ను మణికంఠన్ మందలించాడు. ఇలావుండగా దినేష్‌కుమార్ మంగళవారం అక్కడున్న వాటర్‌ట్యాంక్ సమీపాన వెళుతుండగా అక్కడికి వచ్చిన మణికంఠన్ మళ్లీ హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన మణికంఠన్ దినేష్‌కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. అక్కడున్న వారు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కిణత్తుకడవు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment