పదో తరగతి బాలుడితో టీచర్‌ పరార్‌.. | Teacher Elopes With Tenth Class Student | Sakshi
Sakshi News home page

పదో తరగతి బాలుడితో టీచర్‌ పరార్‌..

Published Thu, Dec 20 2018 8:57 AM | Last Updated on Thu, Dec 20 2018 9:08 AM

Teacher Elopes With Tenth Class Student - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరితో గత నెల 19న వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగానికి వెళ్లారు. దీంతో ఆమె..

టీ.నగర్‌: వివాహమైన నెలకే ఉపాధ్యాయురాలు పదో తరగతి విద్యార్థితో పరారైంది. సేలం తిరువాగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రైవేటు ట్యుటోరియల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు బాగల్‌పట్టికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరితో గత నెల 19న వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగానికి వెళ్లారు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో కోరిమేడులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు రోజులుగా గాలిస్తూ వచ్చారు. ఇదిలాఉండగా ఉపాధ్యాయిని 17 ఏళ్ల బాలునితో మంగళవారం పోలీసుస్టేషన్‌కు జంటగా వచ్చింది. వారు కలిసి జీవిస్తామని  చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీచర్‌కు, బాలుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి వారి తల్లిదండ్రుల వెంట పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement