
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడికి పాఠాలు చెప్పే టీచర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. బాలుడితో ఆమె శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ టీచర్ చెన్నైకి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబత్తూర్‌లో ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలలో పనిచేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి మూడేళ్లుగా పాఠాలు బోధిస్తోంది. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. కానీ, ఆమెకు ఇటీవల మరొకరితో నిశ్చితార్థం కావడంతో బాలుడికి బ్రేకప్ చెప్పింది. అతడు మాత్రం రిలేషన్ కొనసాగిద్దామన్నాడు. టీచర్ అందుకు నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
12 తరగతి పరీక్షల అనంతరం ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడి మరణానికి మరేదైనా కారణం ఉంటుందని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో అతని ఫోన్ చెక్ చేయగా.. టీచర్‌తో చనువుగా ఉన్న ఫోటోలు కన్పించాయి. వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.
చదవండి: మహిళల నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం
Comments
Please login to add a commentAdd a comment