సాక్షి, టీ.నగర్: రూ.3 వేల కోసం ఐదుగురిని హతమార్చిన యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి కంటోన్మెంట్ ఒత్తకడై ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ నైట్ వాచ్‌మన్‌గా రాంజీనగర్‌కు చెందిన సెంథిల్‌కుమార్ పనిచేస్తున్నాడు. గత రెండో తేదీ రాత్రి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ వద్ద దుప్పటితో నిద్రించసాగాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 25 ఏళ్ల యువకుడు సెంథిల్‌కుమార్‌పై బండరాయి వేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో స్పృహతప్పిన సెంథిల్‌కుమార్ చొక్కా జేబు నుంచి రూ.1000, సెల్‌ఫోన్ చోరీ చేశాడు.
ఇలావుండగా షాపింగ్ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా యువకుడి ఆకృత్యాలు వెలుగుచూశాయి. అతను ఇదివరకే పలు చోరీలు, హత్యల కేసుల్లో సంబంధమున్న వ్యక్తిగా కనుగొన్నారు. ఇతను పుదుక్కోట్టై జిల్లా, కర్బగకుడికి చెందిన రాజేష్‌కుమార్‌గా తెలిసింది. రాజేష్‌కుమార్ ఇదే విధంగా సేలం టౌన్‌లోను గత ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ముగ్గురు వాచ్‌మెన్‌లను ఇదే తరహాలో హతమార్చి నగదు చోరీ చేసినట్లు తెలిసింది. అతని కోసం సేలం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడైంది. చదవండి: వలంటీర్లపై తెలుగు తమ్ముళ్ల దాడి
ఇతను తన సొంతవూరిలో 2009లో క్రీడామైదానంలో నాలుగేళ్ల బాలుడిని, 2015లో ఒక వృద్ధురాలిని హతమార్చినట్లు విచారణలో తేలింది. దీంతో రాజేష్‌కుమార్‌ను శుక్రవారం కరంబకుడిలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతను కేవలం రూ.3 వేల కోసం ఐదుగురిని హతమార్చినట్లు విచారణలో తేలింది. అతను సైకో హంతకుడుగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment