సైనికుల ఇళ్లలో చోరీ.. అధికారులు షాక్‌..! | Persons Theft Cash And Gold in Chennai Soldiers House | Sakshi
Sakshi News home page

సైనికుల ఇళ్లలో చోరీ.. అధికారులు షాక్‌..!

Apr 15 2018 8:27 PM | Updated on Oct 22 2018 8:44 PM

Persons Theft Cash And Gold in Chennai Soldiers House - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, టీనగర్‌: రక్షణ కల్పించే సైనికుల ఇళ్లకు భద్రతా కరువైంది. మిలటరీ క్వార్టర్స్‌లో వరుసగా మూడు ఇళ్లలో నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన చెన్నై పోర్ట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నేవీ నగర్‌లో చోటుచేసుకుంది.

వివరాలివి.. ఈ నేవీ నగర్‌లో మిలిటరీ, నేవీ సైనికులు నివశిస్తున్నారు. ఇక్కడ సాయుధ సైనికులు అన్ని వేళలా రక్షణ చర్యలు చేపడుతుంటారు. కానీ, ఆదివారం ఉదయం నేవీ అధికారులు సర్కార్తీజి, అఖిలేష్‌కుమార్‌, సెంథిల్‌కుమార్‌ ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. సమీపంలో నివశించే అధికారులు దీన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీం నిపుణులతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే వేరే ఊర్లకు వెళ్లిన అధికారులు వచ్చిన తర్వాతే నగదు, నగలు ఏమేరకు చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement