సంగీత దర్శకుడు ఇళయరాజా బుధవారం తన సొంత స్టూడియోలో రికార్డింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. నలభై ఏళ్లుగా చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా తన సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ప్రసాద్ స్టూడియో నుంచి ఆయన్ను ఖాళీ చేయించే వ్యవహారంలో ఆ స్టూడియో అధినేతలకు, ఇళయరాజాకు మధ్య తలెత్తిన వివాదం పోలీస్ కేసులు, కోర్టుల వరకు వెళ్లింది. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ స్టూడియోలో తనకు సంబంధించిన సంగీత పరికరాలను, ఇతర సామగ్రిని ఇళయరాజా స్వాధీనం చేసుకున్నారు. టీ నగర్‌లోని ఎంఎం థియేటర్‌ను సొంతంగా కొనుగోలు చేసి దాన్ని రికార్డింగ్ థియేటర్‌గా నిర్మించుకున్నారు. దానికి ‘ఇళయరాజా స్టూడియో’ అని నామకరణం చేశారు. ఆ రికార్డింగ్ థియేటర్లో ఇళయరాజా బుధవారం సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. హాస్యనటుడు సూరి కథానాయకుడిగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలను ప్రప్రథమంగా రికార్డ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment