ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. అనుచిత హావభావాలు, ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు దినేష్ మోహానియా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆప్‌కు ఓటు వేయాలని ఓటర్లు కోరారు. ఈ క్రమంలో ర్యాలీలో ఓ మహిళతో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చూస్తూ సైగలు చేశారు. అనంతరం, ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పందంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. తాజగా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టి తెలిపారు.
दिल्ली के संगम विहार में शर्मनाक घटना!
आम आदमी पार्टी के विधायक प्रत्याशी दिनेश मोहनिया ने अपने रोड शो के दौरान भाजपा चुनाव कार्यालय के बाहर रोड शो रोककर हूटिंग की और महिलाओं को गंदे-गंदे इशारे किए। pic.twitter.com/1lVYsV9gSy— Panchjanya (@epanchjanya) February 3, 2025
ఇక, ఎన్నికల్లో ర్యాలీలో దినేష్ మోహానియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. దినేష్ మోహానియా సంగం విహార్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరోసారి తన నియోజకవర్గం నుండి పోటీలో నిలిచారు.
Dinesh Mohaniya’s lack of respect for women is evident in his actions during the road show. This kind of behavior reflects poorly on his leadership and party. #आप_के_चरित्र_हीन_प्रत्याशीpic.twitter.com/tL9EmmZGbK
— kinal (@kinal3418) February 3, 2025
మరోవైపు.. మోహానియా వివాదాలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం, తన నియోజకవర్గంలోని రోడ్డు పక్కన పండ్ల వ్యాపారిపై దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా తన వాదనను సమర్థించుకుంటూ, పండ్ల వ్యాపారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. ఎందుకంటే అతను మురుగు కాలువ ముందు తన దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, దీనివల్ల పౌర కార్మికుల పనికి ఆటంకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment