
వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ 'ఓర్రీ'గా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఓర్రీ పవిత్ర వైష్ణోదేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో అతనితోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఓర్రీ వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు.
ఓర్రీ ఇటీవల పవిత్ర వైష్ణో దేవి మాత మందిరాన్ని సందర్శించాడు.ఈ సందర్బంగా అతనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 'వైష్ణోదేవి వైబ్స్' అనే శీర్షికతో స్నాప్‌చాట్‌లో మందిరం వైపు నడుస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతోపాటు వైరల్ కావడంతో ఓర్రీకి చెక్కెదురైంది. ఆలయం సమీపంలో మద్యం సేవించినందుకు ఓర్రీ , మరో ఏడుగురిపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎన్‌ఐ రిపోర్ట్ ప్రకారం మార్చి 17న కాత్రాలోని నిషేధిత ప్రాంతంలో మద్యం సేవించినందుకు రాష్ట్ర పోలీసులు ఓర్రీతో సహా ఎనిమిది మందిపై FIR నమోదు చేశారు.
చదవండి: మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
నిందితుల్లో రష్యన్ పౌరురాలు అనస్తాసియా అర్జామస్కినా కూడా ఉంది. ఓర్రీ ,అతని స్నేహితులతో కలిసి కాత్రాకు వెళ్లింది. ఈ సందర్బంగా కాట్రాలోని ఒక హోటల్లో మద్యం సేవించినట్టు ఆరోపణలు నమోదయ్యాయి. ఓర్రీతోపాటు దర్శన్ సింగ్, పార్థ్ రైనా, రితిక్ సింగ్, రాశి దత్తా, రక్షిత భోగల్, షగున్ కోహ్లీ ,అర్జామస్కినా ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిపై మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని అభియోగాలు నమోదయైనాయి. నిందితులకు నోటీసులు పంపుతామని, వారు మద్యం సేవించినట్లు తేలితే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఉదంతంపై దర్యాప్తు నిమిత్తం కాత్రా ఎస్పీ, డిప్యూటీ ఎస్పీ , ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మతపరమైన ప్రదేశాలలో మద్యం, మాంసం, లేదా మాదక ద్రవ్యాల వినియోగం లాంటి పనులతో చట్టాన్ని ఉల్లంఘించే ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తారని ఎస్‌ఎస్‌పి రియాసి ప్రకటించారు.
చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
కాగా పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన వైష్ణోదేవి మాత ఆలయ సమీపంలోని హోటళ్లలో మాంసాహారం, మత్తు పదార్థాల నిషేధంపై కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 'బాలీవుడ్ బీఎఫ్ఎఫ్'గా ఒర్రీ పాపులర్. ఎక్కడ ఏ సెలబ్రిటీ ఫంక్షన్ జరిగినా వాలిపోతూ ఉంటాడు. తన చేష్టలతో నెట్టింట హల్‌చల్‌గా మారతాడు.
Comments
Please login to add a commentAdd a comment