Orry
-
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో ఒర్రీ సందడి.. సెలబ్రిటీలందరితో పోజులు
-
బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఓరీ.. థాయ్‌లాండ్‌లో రచ్చ (ఫొటోలు)
-
లైగర్ బ్యూటీ బర్త్‌డే.. ఇక్కడికీ వచ్చేశాడ్రా బాబూ! (ఫోటోలు)
-
గజినిలా మారిపోయిన ఓరీ.. సడన్‌గా ఎందుకిదంతా?
అల్లాటప్పాగా తిరుగుతూ, చిత్రవిచిత్రంగా పోజులిస్తూ ఫేమస్ అయ్యాడు ఓరీ. బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ, అక్కడున్నవారితో ఫోటోలు దిగుతూ రెండు చేతులా సంపాదించుకుంటున్నానంటాడు. తాజాగా ఇతడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌లా మారిపోయాడు. ఆమిర్ సినిమా లుక్స్‌ను రీక్రియేట్ చేస్తూ స్పెషల్ ఫోటోషూట్ చేశాడు.ఆ పోస్టర్లను రీక్రియేట్ చేసిన ఓరీసినిమా టైటిల్స్‌లోనూ తన పేరును ఇరికించేశాడు. ఈ పోస్టర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన గజిని, తారే జమీన్ పర్, లగాన్, దిల్ చహ్తా హై, రంగ్‌దే బసంతి, తలాష్, 3 ఇడియట్స్, మంగళ్ పాండే, పీకే, దంగల్, రాజా హిందుస్తానీ ఇలా అన్ని సినిమా పోస్టర్లను రీక్రియేట్ చేశాడు. దీని గురించి ఓరీ మాట్లాడుతూ.. '18 ఏళ్లకంటే చిన్నవారికి ఆమిర్ ఖాన్ సినిమాలు తెలిసి ఉండకపోవచ్చు. అందుకోసమే ఇదంతా..ఉదాహరణకు తారే జమీన్ పర్ వచ్చి 17 ఏళ్లవుతోంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసున్న వారికి ఈ సినిమా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్లు ఈ లోకంలో అడుగుపెట్టింది. యంగ్ జెనరేషన్‌లోని చాలామందికి ఈ సినిమాలన్నీ తెలిసి ఉండవు. అలాంటివారికి ఆమిర్ గురించి, ఆయన టాలెంట్ గురించి కచ్చితంగా తెలియాలనే ఇలా చేశాను.బహుముఖ ప్రజ్ఞాశాలిఅనుకున్నట్లుగానే అందరిలోనూ ఈ సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేరేపించాను. ఆమిర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన చిత్రాల ద్వారా ఏదో ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చేవారు. మూవీలో నటించడమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్‌గానూ పని చేశాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ ఇంతవరకు ఆయనను కలుసుకోలేదు.ఎంత ఖర్చయిందంటే?ఈ మూవీ పోస్టర్లు రీక్రియేట్ చేయడానికి నాకు రూ.1.5 లక్షలు ఖర్చయింది. ప్రతి పోస్టర్‌కు హెయిర్‌స్టైల్ మారిపోతూ ఉండాలి. అదే అన్నింటికంటే కష్టంగా అనిపించింది. ఈ సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చినది గజిని' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) చదవండి: అద్దె కట్టేందుకు డబ్బుల్లేవు.. అయినా పైసా తీసుకోకుండా ఐటం సాంగ్స్! -
ఓరీతో చహల్, పృథ్వీ షా.. ఫొటోలు వైరల్
-
ఓర్రీ న్యూ లుక్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓర్రీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. సినీతారలు. హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్లో అంతలా ఫేమస్ అయ్యాడు. రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఓర్రీ తాజాగా న్యూ హెయిర్ కట్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. నేను ప్రతి సాయంత్రం మేల్కొంటాను.. మీరు ఇప్పటికీ 9 నుంచి 5 వరకు పనిచేస్తూనే ఉంటారు.. అది ఎంత చెడ్డదోనని ఆశ్చర్యపోతున్నానంటూ పోస్ట్ చేశారు.అయితే ఒర్రీ హెయిర్ స్టైల్‌పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అతని న్యూ లుక్‌ను ఉద్దేశించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అతని లుక్‌ను చికెన్ హెయిర్ కట్ అంటూ కోడిపుంజుతో కొందరు పోల్చారు. మరికొందరేమో నా పాతబట్టలు తీసుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ఇంకొందరైతే ఏకంగా చికెన్ సెంటర్లో పనిచేసే వాడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు.ఎవరీ ఓర్రీ...ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్ కూడా ఆడతాను. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) -
అయిందా.. బాగయిందా.. అంబానీని కూడా వదిలిపెట్టవా? (ఫోటోలు)
-
నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?
నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది గానీ ఇన్ స్టాలో మాత్రం కూతురితో కలిసి దర్శనమిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం బాలీవుడ్లో వైరల్ స్టార్ ఓరీతో క్యూట్ పోజులిచ్చి చాలామందిని అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ సురేఖావాణి పక్కనున్నది ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే)పైన ఫొటోలో సురేఖావాణి భుజంపై చేయి వేసి క్లోజ్‌గా ఉన్న వ్యక్తి పేరు ఓరీ. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతో కనిపిస్తున్న ఒకేఒక్కడు ఇతడే. అలా అని ఇతడు యాక్టర్ కాదు. ఇతడి చేసే పనెంటో పెద్దగా తెలియదు. కానీ హిందీ హీరోయిన్లకి మాత్రం బెస్టీ. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి హీరోయిన్లతో ఎప్పుడూ అంటిపెట్టుకుని కనిపిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు తెలుగు నటి సురేఖా వాణితో కనిపించడం ఆసక్తికరంగా మారింది.అలానే సురేఖావాణి, ఓరీ ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు తెలియదు. హైదరాబాద్ లేదా ముంబయిలో పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది. ఎక్కడనేదా సురేఖావాణి చెబితే తప్పితే క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా ఓరీ దగ్గర ఐదుగురు మేనేజర్లు పనిచేస్తున్నారు. ఇతడితో ఫొటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని ఇతడే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు సురేఖావాణి కూడా అలానే ఫొటో దిగిందా అనే సందేహం?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
అటు సోషల్ మీడియాలో ఇటు బాలీవుడ్ పార్టీల్లో కనిపిస్తూ ఓ వ్యక్తి తెగ పాపులర్ అయిపోయాడు. అలా అని ఇతడు హీరోనా అంటే కాదు. జస్ట్ స్టార్ హీరోహీరోయిన్లతో కలిసి ఫొటోలు దిగుతాడంతే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వైరల్ అయిపోతుంటాడు. అయితే ఇలా ఫొటోలు దిగడం ఏదో సరదా కోసమని అనుకున్నారేమో. కానీ ఇదే పనితో ఏకంగా లక్షలు సంపాదిస్తున్నాడట.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)ఫొటోలు దిగితే ఏమొస్తుందిలే అనుకున్నే వాళ్లకు ఓరీ అలియాస్ ఓర్హన్ అవత్రమని షాకిచ్చారు. తను రోజుకి ఓ రెండు ఫొటోలు వరకు దిగుతానని, తలో రూ.25 లక్షలు చొప్పున దీనికోసం అందుకుంటానని తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. గతంలో రూ.30 లక్షలు అని చెప్పాడు. ఇప్పుడేమో రేటు పెంచేశాడు.అయితే తనని ఎవరైనా ఫొటో అడిగితే రూ.25 లక్షలు తీసుకుంటానని.. తనకి ఇవ్వాలని అనిపిస్తే మాత్రం ఫ్రీగానే ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఎవరైనా టచ్ చేయమని చెబితే దానికి కూడా ఏకంగా రూ.20 లక్షలు ఛార్జ్ చేస్తానని అన్నాడు. తనకు పనిచేయడం అంటే ఇష్టముండదని, అందుకే ఇలా ఈవెంట్స్‌కి హాజరవుతూ, ఫొటోలకు పోజులిస్తూ ఆదాయం పెంచుకుంటున్నానని ఓరీ చెప్పాడు. ఇదంతా విన్నోళ్లు అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
సల్మాన్ బ్రదర్ ఇంట ఈద్ పార్టీ.. ఏదీ ఓసారి టచ్ చేసి చూడు! (ఫోటోలు)
-
మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన హీరోయిన్ జాన్వీకపూర్
శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటారు. మార్చి 6న తన పుట్టినరోజు సందర్భంగా కాలి నడక ద్వారా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆమె తన స్నేహితులు అయిన శిఖర్ పహారియా, ఒరీతో కలిసి వెళ్లారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను ఒరీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తిరుమల వెళ్లిన సమయంలో వారి యాత్ర ఎలా జరిగిందో అభిమానులతో పంచుకున్నారు. చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో బయలుదేరిన తమకు తిరుపతి చేరుకునేందుకు మూడు గంటలు పట్టిందని వారు తెలిపారు. అక్కడి నుంచి జాన్వీ కపూర్ బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపారు. ఆ వీడియోను పంచుకున్న అనంతరం జాన్వీ గురించి ఒక ఆసక్తకరమైన విషయాన్ని షేర్ చేశారు. కాలి నడక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ కపూర్ - శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారని తెలిపారు. దాదాపు 50 సార్లు తిరుమల శ్రీవారిని జాన్వీ దర్శించుకున్నట్లు ఓరీ చెప్పారు. ఈ దేవాలయమంటే తనకెంతో ఇష్టమని గతంలో పలుమార్లు జాన్వీ చెప్పిన విషయం తెలిసిందే. శ్రీదేవి కూడా లెక్కలేనన్ని సార్లు కుటుంబంతో పాటు తిరుమలకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఓరీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమంగా తాజాగ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ప్రారంభమైంది.మెగాస్టార్ చిరంజీవి ‘ఆర్సీ 16’ ప్రాజెక్ట్‌కు క్లాప్ కొట్టారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) -
అంబానీకి కాబోయే కోడలితో డ్యాన్సులు, ఫోటోలు.. ఎవరీ వ్యక్తి?
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓరీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. తారలు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్లో ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోతాడు. వారిపై చేయి వేసి ఫోటో దిగుతుంటాడు. అలా అతడు చేయి ఆనిస్తే అవతలి వారి వయసు తగ్గిపోయినట్లు ఫీల్ అవుతారట! ఎవరీ ఓరీ.. ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్ కూడా ఆడతాను. పార్టీలో ఫోటోలు దిగితే.. నా దృష్టిలో జీవితమంటే కలలు కనడం.. ఆ కలల్లో విహరించడం.. వాటిని సాకారం చేసుకునేందుకు దొరికిన అవకాశాన్ని వాడుకోవడం' అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అది సరే.. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు? అనుకుంటున్నారా? స్టార్ హీరోహీరోయిన్లకన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. జస్ట్ ఒక్క పార్టీకి వెళ్లి అక్కడున్నవారితో ఫోటోలు దిగితే చాలు.. రూ.20-30 లక్షలు ఇస్తారట! ఓరీయే ఈ విషయం చెప్పాడు. తింటాడు, కానీ బిల్లు కట్టడు ఇతడికి ఐదుగురు మేనేజర్లు ఉన్నారు. ఇద్దరు సోషల్ మీడియా మేనేజర్స్, ఒక పీఆర్ మేనేజర్, అన్ని బ్రాండ్లు చూసుకోవడానికి ఓ మేనేజర్, తను ఏం తింటున్నాడో చూసేందుకో మేనేజర్ ఉన్నారు. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే కూడా ఎంచక్కా కావాల్సింది తినేసి బిల్లు కట్టకుండా దానికి బదులు సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోతాడట! ఈ మధ్య అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లోనూ తెగ హడావుడి చేశాడు. అనంత్‌కు కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి దాండియా ఆడాడు. ఫోటోలు దిగాడు. ఆ సెలబ్రేషన్స్‌కు వచ్చిన పాప్ సింగర్ రిహాన్నాతో కలిసి ఫోటోలు క్లిక్‌మనిపించాడు. తన ఇయర్ రింగ్స్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) #orry and #RadhikaMerchant wonderful garba dance #AnantRadhikaWedding pic.twitter.com/wBrVupiH9W — Media Buzz (@brain_bursts_) March 13, 2024 చదవండి: టాలీవుడ్ లేడీ విలన్ అరెస్ట్? నటి ఏమందంటే? -
ఆఖరికి అంబానీ ఇంట పార్టీ అయినా ఓరీ ఉండాల్సిందే! (ఫొటోలు)
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే
టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ శృతిహాసన్. అవును మీరు సరిగానే విన్నారు. 2023లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి హీరోలు హిట్ కొట్టారు. అయితే వీళ్ల సినిమాలన్నింటినిలోనూ శృతిహాసన్ ఉంది. అలా ప్రస్తుతం అదృష్ట కథానాయికగా మారిపోయింది. వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ వార్త ఎందుకొచ్చింది? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) గతంలో హీరో సిద్ధార్థ్‌తో శృతిహాసన్ రిలేషన్ లో ఉందని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరూ సెపరేట్ అయిపోయారు. కొన్నాళ్లకు ఓ ఫారినర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. పెద్ద టైమ్ తీసుకోకుండానే ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది. కొన్నాళ్ల నుంచి అసోంకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజరికాతో కలిసి ఉంటోంది. శృతి అయితే శంతను తన ఫ్రెండ్ అని చెబుతూ వస్తోంది. కానీ వీళ్లని చూస్తే మాత్రం అలా అనిపించదు. ఇకపోతే బాలీవుడ్లో ఈ మధ్య ఒర్రీ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు. పలువురు హీరోయిన్లతో ఫొటోల్లో కనిపిస్తున్న ఇతడు.. తాజాగా ఓ ప్రశ్నకు బదులిస్తూ శృతిహాసన్పై కామెంట్స్ చేశాడు. అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుందని, తనతో కూడా రూడ్‌గా ప్రవర్తించిందని ఒర్రీ చెప్పాడు. శృతి భర్త శంతను మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన శృతిహాసన్.. 'నేను పెళ్లి చేసుకోలేదు. అయినా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను. నా గురించి తెలియని వాళ్లు నోరు మూసుకుంటే మంచిది' అని ఒర్రీ కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చింది. (ఇదీ చదవండి: హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్) -
తేడాగా పోజిస్తే రూ.30 లక్షలు.. హీరోయిన్‌తో డ్యాన్స్ చూశారా?
ఓర్హాన్ అవత్రమని... సింపుల్‌గా ఇతడిని ఓరీ అని పిలుస్తుంటారు. ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. గతంలో వెయిటర్‌గా, నటుడిగా, గ్రాఫిక్ డిజైనర్‌గా రకరకాలుగా పని చేసిన ఇతడు ఇప్పుడు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పార్టీలో దర్శనమిస్తున్నాడు. ఈ మధ్యే హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లోనూ అడుగుపెట్టాడు. కానీ అక్కడ ఉండలేక ఒక్క రోజుకే వెనక్కి వచ్చేశాడు. అసలు ఓరీ ఏం చేస్తాడు? ఎలా సంపాదిస్తాడు? అన్నది ఎవరికీ తెలియదు. ఎవరడిగినా దీనిపై స్పందించడానికే ఇష్టపడలేదు. అయితే ఎట్టకేలకు తన ఆదాయమార్గాన్ని బయటపెట్టాడు ఓరీ. సెలబ్రిటీలతో వెరైటీగా పోజిచ్చి ఫోటో దిగితే లక్షలు ఇస్తారని చెప్పాడు. పార్టీలో తారల మీద చేయి వేసి ఫోటో దిగితే రూ.20-30 లక్షలు ఇస్తారని తెలిపాడు. తను తాకడం వల్ల వారికి వయసు మీద పడుతున్న భావన పోతుందట. అంతేకాకుండా వారి అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయట. ఈయన మాటలు విని సల్మాన్ ఖానే షాకయ్యాడు. తాజాగా ఓరీ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) చదవండి: ఫినాలే అస్త్ర.. రేసులో నుంచి వాళ్లిద్దరూ అవుట్.. కానీ ఓ ట్విస్ట్