
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆట కాదు..భావోద్వేగాల యుద్దం. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా.. ఇండియా, పాకిస్తానే కాదు ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం(ఫిబ్రవరి23 ) పాకిస్తాన్‌తో భారత్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా తిలకించేందుకు సామాన్య క్రికెట్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది దుబాయ్ వెళ్లారు.
టాలీవుడ్ నుంచి చిరంజీవి, సుకుమార్, ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)తో పాటు మరికొంతమంది తారలు హాజరయ్యారు. అయితే వీరందరిలో ఊర్వశి రౌతేలా మాత్రమే అందరికి కళ్లను తనవైపుకు తిప్పుకునేలా చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ చేయడంతో పాటు తన బర్త్‌డే వేడుకను కూడా అక్కడే జరుపుకోవడంతో ఈ బాలీవుడ్ భామసెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మైదానంలో ‘దబిడిదిబిడి’ స్టెప్పులు
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషించడంతో పాటు ‘దబిడి డిబిడి’ అనే ఐటం సాంగ్‌కి స్టెప్పులేసింది. ఆ స్టెప్పులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడంపై నెటిజన్స్ మండిపడ్డారు. అయినా కూడా బాలయ్యతో పాటు చిత్రబృందం ఎవరూ స్పందించలేదు. ఇక తాజాగా ఇదే పాటకు క్రికెట్ స్టేడియంలో మరోసారి స్టెప్పులేసింది ఊర్వశి.
ఓరీ..అదేం పని
ఊర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా భారత్ ఆడిన చాలా మ్యాచ్ లలో మెరిసింది. ఇక తాజాగా దుబాయ్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో ఓరీ(Orry)తో కలిసి డబిడి డిబిడి పాటకు స్టెప్పులేసింది. కిక్కిరిసిన స్టేడియంలో డాన్స్ చేస్తుండగా.. ఓరీ సడెన్‌గా ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఊర్వశి షాక్ అయింది. కొద్ది క్షణాలు అలానే ఆశ్చర్యంగా చూసింది. అనంతరం మళ్లీ సరదగా చిందులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఎవరీ ఓరీ?
ఓర్హాన్ అవత్రమని(Orhan Awatramani)... సింపుల్‌గా ఇతడిని ఓరీ అని పిలుస్తుంటారు.న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, గ్రాఫిక్ డిజైనర్‌గా రకరకాలుగా పని చేసిన ఇతడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. బాలీవుడ్ తారల ప్రతి పార్టీలోనూ ఓరీ కనిపిస్తాడు. చిత్ర విచిత్ర పోజులు ఇస్తూ వారిని నవ్విస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment