మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన హీరోయిన్‌ జాన్వీకపూర్‌ | Sakshi
Sakshi News home page

మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన హీరోయిన్‌ జాన్వీకపూర్‌

Published Thu, Mar 21 2024 2:16 PM

Janhvi Kapoor Tirumala Steps Climb Her Knees - Sakshi

శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్‌  తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటారు. మార్చి 6న తన పుట్టినరోజు సందర్భంగా కాలి నడక ద్వారా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆమె తన స్నేహితులు అయిన శిఖర్‌ పహారియా, ఒరీతో కలిసి వెళ్లారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను ఒరీ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తిరుమల వెళ్లిన సమయంలో వారి యాత్ర ఎలా జరిగిందో అభిమానులతో పంచుకున్నారు.

చెన్నైలోని జాన్వీ కపూర్‌ ఇంటి నుంచి కారులో బయలుదేరిన తమకు తిరుపతి చేరుకునేందుకు  మూడు గంటలు పట్టిందని వారు తెలిపారు. అక్కడి నుంచి జాన్వీ కపూర్‌ బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపారు. ఆ వీడియోను పంచుకున్న అనంతరం జాన్వీ గురించి ఒక ఆసక్తకరమైన విషయాన్ని షేర్‌ చేశారు. కాలి నడక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు  మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ కపూర్‌ - శిఖర్‌ మోకాళ్లపై మెట్లెక్కారని తెలిపారు. దాదాపు 50 సార్లు తిరుమల శ్రీవారిని జాన్వీ దర్శించుకున్నట్లు ఓరీ చెప్పారు. ఈ దేవాలయమంటే తనకెంతో ఇష్టమని గతంలో పలుమార్లు జాన్వీ చెప్పిన విషయం తెలిసిందే. శ్రీదేవి కూడా లెక్కలేనన్ని సార్లు కుటుంబంతో పాటు తిరుమలకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఓరీ షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్‌ టైటిల్‌) పూజా కార్యక్రమంగా తాజాగ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా బుధవారం ప్రారంభమైంది.మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆర్‌సీ 16’ ప్రాజెక్ట్‌కు క్లాప్‌ కొట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement