తేడాగా పోజిస్తే రూ.30 లక్షలు.. హీరోయిన్‌తో డ్యాన్స్‌ చూశారా? | Orry Earns Rs 20-30 Lakhs A Night Posing For Selfie, Dance With Janhvi Kapoor | Sakshi
Sakshi News home page

Orry: తేడాగా పోజిస్తే రూ.30 లక్షలు.. హీరోయిన్‌తో పోటీపడుతూ డ్యాన్స్‌..

Published Tue, Nov 28 2023 3:08 PM | Last Updated on Tue, Nov 28 2023 3:45 PM

Orry Earns Rs 20-30 Lakhs a Night Posing for Selfie, Dance with Janhvi Kapoor - Sakshi

ఓర్హాన్‌ అవత్రమని... సింపుల్‌గా ఇతడిని ఓరీ అని పిలుస్తుంటారు. ఈ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ బాలీవుడ్‌ తారల పార్టీల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. గతంలో వెయిటర్‌గా, నటుడిగా, గ్రాఫిక్‌ డిజైనర్‌గా రకరకాలుగా పని చేసిన ఇతడు ఇప్పుడు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పార్టీలో దర్శనమిస్తున్నాడు. ఈ మధ్యే హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లోనూ అడుగుపెట్టాడు. కానీ అక్కడ ఉండలేక ఒక్క రోజుకే వెనక్కి వచ్చేశాడు. అసలు ఓరీ ఏం చేస్తాడు? ఎలా సంపాదిస్తాడు? అన్నది ఎవరికీ తెలియదు. ఎవరడిగినా దీనిపై స్పందించడానికే ఇష్టపడలేదు.

అయితే ఎట్టకేలకు తన ఆదాయమార్గాన్ని బయటపెట్టాడు ఓరీ. సెలబ్రిటీలతో వెరైటీగా పోజిచ్చి ఫోటో దిగితే లక్షలు ఇస్తారని చెప్పాడు. పార్టీలో తారల మీద చేయి వేసి ఫోటో దిగితే రూ.20-30 లక్షలు ఇస్తారని తెలిపాడు. తను తాకడం వల్ల వారికి వయసు మీద పడుతున్న భావన పోతుందట. అంతేకాకుండా వారి అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయట. ఈయన మాటలు విని సల్మాన్‌ ఖానే షాకయ్యాడు. తాజాగా ఓరీ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌తో డ్యాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ఫినాలే అస్త్ర.. రేసులో నుంచి వాళ్లిద్దరూ అవుట్‌.. కానీ ఓ ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement