అల్లాటప్పాగా తిరుగుతూ, చిత్రవిచిత్రంగా పోజులిస్తూ ఫేమస్ అయ్యాడు ఓరీ. బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ, అక్కడున్నవారితో ఫోటోలు దిగుతూ రెండు చేతులా సంపాదించుకుంటున్నానంటాడు. తాజాగా ఇతడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌లా మారిపోయాడు. ఆమిర్ సినిమా లుక్స్‌ను రీక్రియేట్ చేస్తూ స్పెషల్ ఫోటోషూట్ చేశాడు.
ఆ పోస్టర్లను రీక్రియేట్ చేసిన ఓరీ
సినిమా టైటిల్స్‌లోనూ తన పేరును ఇరికించేశాడు. ఈ పోస్టర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన గజిని, తారే జమీన్ పర్, లగాన్, దిల్ చహ్తా హై, రంగ్‌దే బసంతి, తలాష్, 3 ఇడియట్స్, మంగళ్ పాండే, పీకే, దంగల్, రాజా హిందుస్తానీ ఇలా అన్ని సినిమా పోస్టర్లను రీక్రియేట్ చేశాడు. దీని గురించి ఓరీ మాట్లాడుతూ.. '18 ఏళ్లకంటే చిన్నవారికి ఆమిర్ ఖాన్ సినిమాలు తెలిసి ఉండకపోవచ్చు.
అందుకోసమే ఇదంతా..
ఉదాహరణకు తారే జమీన్ పర్ వచ్చి 17 ఏళ్లవుతోంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసున్న వారికి ఈ సినిమా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్లు ఈ లోకంలో అడుగుపెట్టింది. యంగ్ జెనరేషన్‌లోని చాలామందికి ఈ సినిమాలన్నీ తెలిసి ఉండవు. అలాంటివారికి ఆమిర్ గురించి, ఆయన టాలెంట్ గురించి కచ్చితంగా తెలియాలనే ఇలా చేశాను.
బహుముఖ ప్రజ్ఞాశాలి
అనుకున్నట్లుగానే అందరిలోనూ ఈ సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేరేపించాను. ఆమిర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన చిత్రాల ద్వారా ఏదో ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చేవారు. మూవీలో నటించడమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్‌గానూ పని చేశాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ ఇంతవరకు ఆయనను కలుసుకోలేదు.
ఎంత ఖర్చయిందంటే?
ఈ మూవీ పోస్టర్లు రీక్రియేట్ చేయడానికి నాకు రూ.1.5 లక్షలు ఖర్చయింది. ప్రతి పోస్టర్‌కు హెయిర్‌స్టైల్ మారిపోతూ ఉండాలి. అదే అన్నింటికంటే కష్టంగా అనిపించింది. ఈ సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చినది గజిని' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: అద్దె కట్టేందుకు డబ్బుల్లేవు.. అయినా పైసా తీసుకోకుండా ఐటం సాంగ్స్!
Comments
Please login to add a commentAdd a comment