హీరో మాధవన్ (R Madhavan) తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 3 ఇడియట్స్ మూవీ చేశాడు. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ జర్నీలో ఆమిర్‌ను దగ్గరి నుంచి చూసిన మాధవన్.. ఆయనలా తను అస్సలు ఉండలేనంటున్నాడు. ఆ నాటి జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.
ఏదీ ఫ్రీగా రాదనుకో
మాధవన్ మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ పర్సు వెంటపెట్టుకుని వెళ్లడు. తన స్టార్‌డమ్ వల్ల అలా ఉండగలుగుతున్నాడు. ఆయనకు ఏది కావాలన్నా పక్కనున్న జనాలు తీసుకొస్తారు. అలా అని ఏదీ ఫ్రీగా రాదనుకోండి.. ఆ చుట్టుపక్కన ఉండే జనాలకు ఎలాగో ఆమిర్ ఖాన్ డబ్బు చెల్లించాల్సిందే! కానీ నాకంత సినిమా లేదు. నేను ఒంటరిగా వెళ్లడానికే ఎక్కువ ఇష్టపడతాను. స్వేచ్ఛగా తిరగడం ఇష్టం. జనాలతో కలవడం ఇష్టం. ఎంత ఖర్చు పెడుతున్నాననేది చూసుకోను. నచ్చినట్లు బతికేస్తా.. ఏది కావాలనిపిస్తే అది కొనేస్తాను.
(చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!)
ఖర్చులను అదుపులో పెట్టుకోలేను
అలా అని నా బడ్జెట్‌కు మించినవాటి జోలికి వెళ్లను. ఖర్చుల విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకోలేను.. కానీ నాకున్న పరిధిలో జీవిస్తూ కాస్తంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాను. నాకేదైనా పెద్ద కారు నచ్చిందనుకోండి. అది నా బడ్జెట్‌లో రాలేదన్నప్పుడు కొనడానికి ఇష్టడపను అని చెప్పుకొచ్చాడు. అయితే అతడి ఖర్చులు చూసి భార్య సరిత తిడుతూ ఉంటుందట. ఈ విషయం గురించి చెప్తూ.. నా భార్య నేనొక మూర్ఖుడిని అనుకుంటుంది. నాకు డబ్బులు పొదుపుగా వాడటం తెలియదని తిడుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు.
సినిమా
మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిసాబ్ బరాబర్ . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది.
చదవండి: సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment