posters
-
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
-
గజినిలా మారిపోయిన ఓరీ.. సడన్‌గా ఎందుకిదంతా?
అల్లాటప్పాగా తిరుగుతూ, చిత్రవిచిత్రంగా పోజులిస్తూ ఫేమస్ అయ్యాడు ఓరీ. బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ, అక్కడున్నవారితో ఫోటోలు దిగుతూ రెండు చేతులా సంపాదించుకుంటున్నానంటాడు. తాజాగా ఇతడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌లా మారిపోయాడు. ఆమిర్ సినిమా లుక్స్‌ను రీక్రియేట్ చేస్తూ స్పెషల్ ఫోటోషూట్ చేశాడు.ఆ పోస్టర్లను రీక్రియేట్ చేసిన ఓరీసినిమా టైటిల్స్‌లోనూ తన పేరును ఇరికించేశాడు. ఈ పోస్టర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన గజిని, తారే జమీన్ పర్, లగాన్, దిల్ చహ్తా హై, రంగ్‌దే బసంతి, తలాష్, 3 ఇడియట్స్, మంగళ్ పాండే, పీకే, దంగల్, రాజా హిందుస్తానీ ఇలా అన్ని సినిమా పోస్టర్లను రీక్రియేట్ చేశాడు. దీని గురించి ఓరీ మాట్లాడుతూ.. '18 ఏళ్లకంటే చిన్నవారికి ఆమిర్ ఖాన్ సినిమాలు తెలిసి ఉండకపోవచ్చు. అందుకోసమే ఇదంతా..ఉదాహరణకు తారే జమీన్ పర్ వచ్చి 17 ఏళ్లవుతోంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసున్న వారికి ఈ సినిమా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్లు ఈ లోకంలో అడుగుపెట్టింది. యంగ్ జెనరేషన్‌లోని చాలామందికి ఈ సినిమాలన్నీ తెలిసి ఉండవు. అలాంటివారికి ఆమిర్ గురించి, ఆయన టాలెంట్ గురించి కచ్చితంగా తెలియాలనే ఇలా చేశాను.బహుముఖ ప్రజ్ఞాశాలిఅనుకున్నట్లుగానే అందరిలోనూ ఈ సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేరేపించాను. ఆమిర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన చిత్రాల ద్వారా ఏదో ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చేవారు. మూవీలో నటించడమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్‌గానూ పని చేశాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ ఇంతవరకు ఆయనను కలుసుకోలేదు.ఎంత ఖర్చయిందంటే?ఈ మూవీ పోస్టర్లు రీక్రియేట్ చేయడానికి నాకు రూ.1.5 లక్షలు ఖర్చయింది. ప్రతి పోస్టర్‌కు హెయిర్‌స్టైల్ మారిపోతూ ఉండాలి. అదే అన్నింటికంటే కష్టంగా అనిపించింది. ఈ సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చినది గజిని' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) చదవండి: అద్దె కట్టేందుకు డబ్బుల్లేవు.. అయినా పైసా తీసుకోకుండా ఐటం సాంగ్స్! -
ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ కలకలం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త పేరుతో కట్టిన పోస్టర్ తీవ్ర కలకలం సృష్టించింది. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాయమాటలు చెబుతోంది. రేషన్ కార్డులు ఇస్తామని ఇంకా ఇవ్వడం లేదు. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే రేషన్ కార్డుల విషయంపై ఆలోచించాలని రాశారు.వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్లో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తాయని అనుకున్నాం. రేషన్ కార్డు లేక, లేబర్ కార్డ్ రావడం లేదు. ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్నాం. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే ముందుగా రేషన్ కార్డు సమస్యను తీర్చండి. గత ప్రభుత్వం మాదిరిగానే మాయమాటలు చెప్పి, ప్రజలకు నమ్మక ద్రోహాన్ని చేయకండి. ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్.. అని పోస్టర్ కట్టారు. దీంతో, ఈ పోస్టర్‌పై ప్రజల్లో చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్ఎస్ నేతలే ఇలా పోస్టర్లు కట్టారంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
TGPSC ఆఫీస్ ముందు పోస్టర్ల కలకలం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరగూడలోని తెలుగు అకాడమీ ముందు గుర్తు తెలియని అగంతకులు పోస్టర్లను అతికించారు.ఆ పోస్టర్లలలో తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.అంతేకాదు గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు, టీజీపీఎస్సీ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లు కనిపించాయి. పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లను ఎవరు అంటించారోనని ఆరా తీస్తున్నారు. -
Visakha: కూటమిలో పోస్టర్ల కలకలం
విశాఖపట్నం, సాక్షి: అభ్యర్థుల్ని ప్రకటించినా.. కూటమిలో గొడవలు మాత్రం సర్దుమణగడం లేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాల్సిందేననే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఉంది. కూటమిలో భాగంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం మొదట్లో బాగా వినిపించింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించారంతా. కానీ, చంద్రబాబు పాచికతో ఈ సీటు టీడీపీకి వెళ్లింది. నారా లోకేష్ తన తోడల్లుడు భరత్‌కు సీటు ఇప్పించారు. దీంతో జీవీఎల్ నొచ్చుకున్నారు. అయినా విశాఖకు తన సేవలు అందిస్తానంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే ఈలోపు విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. జీవీఎల్‌కు సీటు కేటాయించాలంటూ జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీ గేటుకు పోస్టర్లు అంటించారు. టీడీపీ-జనసేన-బీజేపీ తరఫు ఉమ్మడి అభ్యర్థి భరత్ విశాఖ కోసం ఏం చేశాడని.. జీవీఎల్ కనీసం పార్లమెంట్లో గళం వినిపించారని ఆ పోస్టర్ల సారాంశం. జీవీఎల్‌కు టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని రాసి ఉంది అందులో. దీంతో కూటమిలో ఈ పోస్టర్లపై చర్చ జోరందుకుంది. -
బీజేపీకి అభ్యర్థులు కావలెను. ఆసక్తి రేపుతున్న ‘టీఎంసీ’ పోస్టర్లు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య జరుగుతున్న పోస్టర్ వార్ ఆసక్తిరేపుతోంది. బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని అసన్సోల్, డైమండ్ హార్బర్ లోక్‌సభ సీట్ల విషయంలో టీఎంసీ గోడలపై పోస్టర్లు వేసింది. క్యాండిడేట్ వాంటెడ్ అని షాడో ఫేస్ ఉన్న పోస్టర్లను వీధుల్లో అంటించారు. దమ్ముంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత సువేందు అధికారి డైమండ్ హార్బర్ సీటు నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్ విసురుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం టీఎంసీ జనరల్ సెక్రటరీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అసన్సోల్ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన పవన్‌సింగ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అసన్సోల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్లో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీకి షాక్ శివసేన(ఉద్ధవ్)లోకి సిట్టింగ్ ఎంపీ -
కోడ్‌కు విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతులను మాత్రం ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎటువంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. సరిహద్దుల్లో లిక్కర్ రవాణాను నియంత్రించాలి ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు ఎటువంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించాలని, ఏమాత్రం దృఢత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి లిక్కర్, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాలు పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, అటు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రణాళికలు వెంటనే ఇవ్వాలి సి విజిల్ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో నూరు శాతం పరిష్కరించాలని, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలపై ఒత్తిడి పెంచాలని మీనా అన్నారు. ఇంకా కొన్ని జిల్లాల నుంచి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు అందలేదని, వాటిని వెంటనే తమకు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే ఎన్నికల సిబ్బందికి మరోసారి లేదా రెండు సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని పార్టీలకు ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనా ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి మరోసారి గుర్తుచేసింది. ఎన్నికల పర్వంలో పిల్లలు ఎక్కడా కనిపించొద్దని, వారిని ఏ పనులకూ వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ తాజాగా ఒక అడ్వైజరీని పంపింది. ‘‘బాల కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లదే. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చండి’’ అని ఈసీ పేర్కొంది. ‘‘ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని తమ వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదు. పిల్లలతో నినాదాలు ఇప్పించడం, పాటలు పాడించడం, వారితో చిన్నపాటి ప్రసంగాలు ఇప్పించడంసహా పార్టీ ప్రచారాల్లో ఎక్కడా చిన్నారులు ఉపయోగించుకోకూడదు. వారు ప్రచార కార్యక్రమాల్లో కనిపించకూడదు’’ అని తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. మరి కొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికల మొదలుకానున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించకూడదని, వినియోగిస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఇక ఉత్తర్వును రాజీవ్ కుమార్ పునరుధ్ఘాటించారు. -
బీజేపీ ఒంటరి పోరు
సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతోంది. పొత్తులకు సంబంధించి రకరకాల ప్రచారం సాగుతున్నప్పటికీ, జాతీయ పార్టీ సూచనల మేరకు రాష్ట్ర పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గురువారం ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ గురువారమే నియోజకవర్గ కార్యాలయాలను ప్రారంభిస్తోంది. గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులను భాగస్వాములను చేస్తోంది. నెల క్రితమే.. బీజేపీకీ ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం – కేంద్రంలో మరో విడత’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా వాల్ పెయింటింగ్‌లు, పోస్టర్లు వేయించారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు 20 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ముగ్గురేసి ఒక కమిటీగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉండే అభ్యర్ధుల బయోడేటాలు సేకరించారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 2,438 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జాతీయ పార్టీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్‌తో జరిగిన రాష్ట్ర ముఖ్యనేతల భేటీలో లోక్‌సభ స్థానాల్లో పోటీకి అవకాశం ఉన్న నాయకులు, పార్టీ బలాబలాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులతో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న పరిపూర్ణానంద స్వామి కూడా లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు కేవలం నామమాత్రంగా కాకుండా, పూర్తిస్థాయిలో పార్టీ పోటీలో ఉండేలా పార్టీ పలు చర్యలు చేపట్టింది. అభ్యర్ధులకు అన్ని విధాలా తోడ్పాటునందించేందుకు ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు 37 మందితో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో అంశాలను 37 విభాగాలుగా వర్గీకరించారు. ఒక్కొక్క విభాగం బాధ్యతలు ఈ కమిటీలోని ఒకరికి అప్పగించారు. పార్టీ ఎన్నికల కార్యక్రమాలను జాతీయ, రాష్ట్ర పార్టీ సులభంగా పర్యవేక్షించేలా ఐదేసి లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా విభజించి, 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అగ్రనేతలు రంగప్రవేశం.. ఎన్నికలకు సంబంధించి బీజేపీ రానున్న నెల రోజుల కార్యక్రమాలను సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జెపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్లస్టర్ల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇతరత్రా కార్యక్రమాలు ఉండవు. ఒక వేళ రెండో పూట పర్యటన ఉంటే ఆ ప్రాంతంలోని వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు పర్యటించి, బూత్‌లవారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అక్కడ పార్టీ ఏజెంట్లుగా పనిచేసే వారిని గుర్తించి రాష్ట్ర పారీ్టకి నివేదిస్తారు. ఎన్నికల ప్రక్రియ జరిగే నెలన్నరలో రాష్ట్రమంతటా 20 వేల బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘ఇండియా’ కీలక భేటీ.. నితీశ్‌పై ఆసక్తికర పోస్టర్లు
పాట్నా: ఇండియా కూటమి కీలక సమావేశం ఢిల్లీలో మంగళవారం(డిసెంబర్ 19) జరగనుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఈ సమావేశంలో జరుగుతాయని తెలుస్తోంది. ఓ వైపు ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం నేపథ్యంలో పాట్నాలో వెలిసిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పోస్టర్లు చర్చనీయాంశమవుతున్నాయి.‘ ఎన్నికల్లో నిజంగా గెలవలానుకుంటే ధృడ నిశ్చయం కావాలి. నితీశ్ కుమార్ కావాలి’ అని పోస్టర్లపై రాశారు. ఇండియా కూటమికి నితీష్ నాయకత్వం కావాలని అర్థం వచ్చేటట్లుగా ఈ పోస్టర్లున్నాయని పలువురు భావిస్తున్నారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని నితీశ్ కుమార్ పలుమార్లు చెప్పినప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి నితీశ్ కుమారేనన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై స్పందించారు. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని మమత చెప్పడం గమనార్హం. #WATCH | Patna: Posters featuring Bihar CM Nitish Kumar that read 'Agar sach mein jeet chahiye toh fir ek Nischay aur ek Nitish chahiye', were put up ahead of the INDIA bloc meeting, in Delhi. pic.twitter.com/mirs1VGQBd — ANI (@ANI) December 19, 2023 ఇదీచదవండి..భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆచూకీ చెబితే రూ. 50 వేలు!
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్‌పూర్-పఠాన్‌కోట్ లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పఠాన్‌కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్‌లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్‌కోట్, సుజన్‌పూర్‌లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్‌సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్‌సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు! -
Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం!
భోపాల్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట కాబోయే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శుభాకాంక్షలు అంటూ పోస్టరు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లో 230 శాసనసభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. కాగా గురువారం విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఎగ్జిట్‌పోల్స్‌తో సంబంధం లేకుండా ఎవరికివారే తమ పార్టీలు గెలుస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రకటన చేస్తున్నారు. తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్.. తనకు రాష్ట్ర ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉందని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. A poster congratulating Kamal Nath and portraying him as the next Chief Minister of Madhya Pradesh has been put up by a Congress worker outside the Congress office in Bhopal. pic.twitter.com/pX41zyoZgg — ANI (@ANI) December 2, 2023 -
బోధన్‌లో పోస్టర్ల కలకలం.. రాహుల్, రేవంత్ ఫోటోలతో విమర్శలు
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దేనని, మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ.. పోస్టర్లు అంటించారు. వీటిపై రాహుల్, రేవంత్ రెడ్డి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని,ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు. బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు జత చేశారు. ‘కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక. దివాళా తీస్తున్న పరిశ్రమలు.. కాంగ్రెస్ పేరెత్తితేనే జనం తిట్లు. గీ కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా?. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికే నిరుద్యోగుల గోస.’ అంటూ పోస్టర్లు అంటించారు. కాగా బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చదవండి: పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
సుధీర్ రెడ్డిపై పోస్టర్ల కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
DERIVAZ AND IVES: జ్ఞాపకాల ‘రే’ఖలు
సత్యజిత్ రే చిత్రాలు కాలాతీతమైనవి. ఆ జ్ఞాపకాలు ఏ కాలానికైనా అపురూపమైనవి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యాక్షన్ హౌజ్ డెరివాజ్ అండ్ ఐవ్స్ సత్యజిత్ రే సినిమాలకు సంబంధించి రేర్ పోస్టర్లు, ఫోటోగ్రాఫిక్ స్టిల్స్, లాబీ కార్డ్స్, సినాప్సిస్ బుక్‌లెట్స్‌తో పాటు ఆయన రూపొందించిన కళారూపాలను వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొనడానికి రే అభిమానులు, సినీ పండితులు, ఆర్ట్ కలెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాలం కంటే ముందు ఉన్న ఆలనాటి పోస్టర్ డిజైనింగ్, కాలిగ్రాఫిక్ క్వాలిటీని అర్థం చేసుకోవడానికి... స్థూలంగా చెప్పాలంటే ఐకానిక్ ఫిల్మ్‌మేకర్ అద్భుత ప్రయాణాన్ని అన్వేషించడానికి ఈ వేలం ఒక సాధనం అవుతుంది. -
మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనర్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంపై పారాచూట్‌గా వచ్చి వాలుతున్నారంటూ పోస్టర్లు అంటించారు. గో బ్యాక్ నిజామాబాద్’ అంటూ పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. కాగా మధుయాష్కీపై పోస్టర్లు వేయిచింది ఎల్బీనగర్కు చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మధు యాష్కిగౌడ్ కోరారు. ఇక 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మధు యాష్కీ విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి బరిలోకి దిగిన మధుయాష్కీ.. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిచెందారు. చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలకపరిణామం ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీకి దూరంగా ఉండాలని మధు యాష్కీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన ఆయన.. ఎల్బీ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కాగా గాంధీభవన్‌లో నేటి ఉదయం 11 గంటల నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ వ్యక్తిగతంగా సమావేశం కానుంది. స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఒక్కొక్క నేతలతో సాయంత్రం వరకు సమావేశం కొనసాగనుంది. అదే విధంగా పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేయనుంది. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక అందజేయనుంది. చదవండి: ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె! -
దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు..
కెనడాలో ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రిటీష్ కొలంబియాలో అతి పురాతనమైన లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఆలయ గోడలు, గేట్లపైన ఖలిస్థానీ పోస్టర్లు అంటించారు. ఇటీవల మరణించిన ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలు ఆ పోస్టర్లపై అంటించి ఉన్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పోస్టర్లు అంటిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ముసుగులు ధరించి ఉన్న నిందితులు.. వరసగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది కెనడాలో ధ్వంసం అయిన నాలుగో దేవాలయం ఇది కావడం గమనార్హం. భారతీయులకు వ్యతిరేకంగా విధ్వేషాలను రెచ్చగొట్టడంపై మేయర్ కిర్క్ ప్యాట్రిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు దేవాలయంలో అంటించిన పోస్టర్లపై 'జూన్ 18న జరిగిన ఘటనలో భారత పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది' అని రాసి ఉంది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా నిజ్జర్ పనిచేశాడు. ఇతన్ని కెనడాలోని సుర్రేలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్.. మరింత ఆలస్యంగా ఎన్నికలు! -
తిరగబడదాం.. తరిమి కొడదాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచార నగారా మోగించింది. ‘తిరగబడదాం...తరిమికొడదాం’అనే నినాదంతో పోరాటాలే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించింది. బీఆర్ఎస్–బీజేపీ రెండూ తోడు దొంగలని, కలిసే అవినీతి–అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతామని వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్, బీజేపీలపై రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేస్తూ.. కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించింది. శనివారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్‌ల చిత్రాలతో ‘తోడు దొంగలు’పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్లో బీఆర్ఎస్, బీజేపీలపై 15 అంశాలతో కూడిన ప్రజా చార్జిషిట్‌ను నమోదు చేశారు. అనంతరం మధుయాష్కీ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. చార్జిషిట్‌ను ఇంటింటికీ చేరుస్తాం ప్రచార కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో రాష్ట్రంలోని 75 లక్షల కుటుంబాలకు తమ చార్జిషీట్‌ను చేరుస్తామని మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు. ప్రజలను మమేకం చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామని.. 12వేల పంచాయతీల్లో గ్రామ సభలు, 3 వేల డివిజన్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన సందర్భంగా పోస్టర్కార్డుపై ప్రజల సంతకాలు తీసుకుని, బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలపై ప్రజల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. ఈ పోరాటంలో తమతో కలసి వచ్చేందుకు ప్రజలు 7661899899 ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. కాగా.. నియంతలను మించి కేసీఆర్ ప్రజలపై దాడులు చేస్తున్నారని, ఆయనపై ప్రతి గ్రామానికి వెళ్లి చార్జిషిట్ వేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మల్లురవి, రాజయ్య, షబ్బీర్‌అలీ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ప్రజాకోర్టు.. కేసీఆర్‌పై అభియోగాలు.. ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించిన అనంతరం Vటీపీసీసీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ప్రజాకోర్టు నిర్వహించారు. దీనికి కంచె ఐలయ్య జడ్జిగా వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కటౌట్లను బోనులో దోషులుగా నిలబెట్టి వారిపై పీసీసీ నేతలు అభియోగాలు నమోదు చేశారు. చార్జిషిట్‌లోని అంశాలను వాదనలుగా వినిపించారు. న్యాయమూర్తిగా వ్యవహరించిన కంచె ఐలయ్య వారి వాదనలు విన్నారు. సమాజంలో అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని, ఓట్లు వేయకుండా తిరస్కరించాలని తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ దోపిడీపై పోరాటమే: భట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోడగా నిలిచిందని.. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ సమాజం విలవిల్లాడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఇచి్చన పారీ్టగా కాంగ్రెస్ మరోసారి నడుం బిగించిందని.. బీఆర్ఎస్ అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రభుత్వంపై అభియోగాల నమోదుతోపాటు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. పోరాడుదాం, తిరగబడదాం, తరిమికొడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం..’’ అని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు. ఆకాంక్షలను కాలరాసిన కేసీఆర్: రేవంత్ ఉద్యమకారుల ఆకాంక్షలను రాజకీయ ఇంధనంగా మార్చుకుని గద్దెనెక్కిన కేసీఆర్.. తర్వాత ఆ ఆకాంక్షలను కాలరాశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రజాకోర్టు ఏర్పాటు చేస్తున్నామని.. రాజులు, నియంతలను మరిపించే విధంగా ప్రజలపై దాషీ్టకాలకు పాల్పడుతున్న కేసీఆర్, ఆయన కుటుంబంపై చార్జిషిట్ వేస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేవి రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదన్నారు. కాళోజీ స్ఫూర్తితో బీఆర్ఎస్ను తెలంగాణ పొలిమేరలు దాటేవరకు తరిమికొడతామన్నారు. కాంగ్రెస్ ప్రజా చార్జిషిట్‌లోని అంశాలివీ.. భ్రష్ట జుమ్లా పార్టీ (బీజేపీ) తెలంగాణకు ద్రోహం– ఆంధ్రతో స్నేహం కాళేశ్వరంలో అవినీతి–కేసీఆర్‌తో లాలూచీ ప్రాజెక్టులు కట్టలే–జాతీయ హోదా దక్కలే నీళ్లు, నిధుల్లో అన్యాయం–యువతకు ఇవ్వలే ఉద్యోగం రైతులపై అప్పుల భారం–పేదలపై ధరల భారం ప్రభుత్వ ఆస్తులు అమ్ముడు–ప్రజల సొమ్ము దోచుడు బీజేపీ రిష్తేదార్ సమితి (బీఆర్ఎస్) కల్వకుంట్ల కుటుంబం–కావేవీ అక్రమాలకు అనర్హం కాళేశ్వరంతో చోరీ–ఖజానా ఖాళీ కచరా సర్కార్–కర్షకుల ఖూనీకోర్ అబద్ధాలు చెప్పిండు–అధికారంలోకి వచ్చిండు కారు వారసులు–భూబకాసురులు దళిత గిరిజనులకు అవమానం–దక్కలేదు గౌరవం ఇంటికి ఉద్యోగం రాలే–యువత భవిత మారలే అటకెక్కిన ఉచిత విద్య–పడకేసిన ఆరోగ్యం ఆడబిడ్డలపై దాడులు–అయినా ఫామ్‌హౌజ్ వదలరు బడ్జెట్లో కోతలు–సంక్షేమానికి వాతలు (ఈ అంశాలను పోస్టర్లో పేర్కొనడంతోపాటు బైబై మోదీ, బైబై కేసీఆర్ అనే నినాదాలను చేర్చారు) -
ఇదేం బాలేదు.. కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే వార్నింగ్!
భోపాల్: ఈ సారి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీని గద్దె దించేందకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పాలిత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. పోస్టర్ల ప్రచారానికి తెర లేపింది. సీఎం శివరాజ్ 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుపై ఆరోపణలు చేసింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసి దాంట్లో శివరాజ్ బొమ్మను చేర్చి ఆ పోస్టర్లును పలు చోట్ల అంటించింది. పోస్టర్ల రచ్చ అందులో "50% లావో, ఫోన్‌పే కామ్ కరో (మీ పని పూర్తి కావాలంటే 50% కమీషన్ చెల్లించాలి). అయితే ప్రస్తుతం ఆ పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోస్టర్ యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే సంస్థ తమ కంపెనీ పేరు, లోగోను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫోన్‌పే పోస్టర్లపై స్పందిస్తూ, "రాజకీయ లేదా రాజకీయేతర వాటికోసం తమ బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటికి తమ కంపెనీ లోగోను వాడవద్దు అని తన ట్వీట్లో చెప్పింది. అనుమతి లేకుండా లోగోను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్ పే కంపెనీ తెలుపుతూ.. ఆ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరింది. బీజేపీ స్పందన ఇదే భోపాల్, ఇండోర్, గ్వాలియర్, సెహోర్, రేవా, మందసౌర్, ఉజ్జయిని, భింద్, బాలాఘాట్, బుధ్ని, మరికొన్ని నగరాల్లో వెలువడిన ఈ పోస్టర్ల వీడియోలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. పోస్టర్లపై బీజేపీ స్పందిస్తూ.. పలు నగరాల్లో పోస్టర్లు అంటించిన తర్వాత కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. చదవండి: రైలు అక్కడకు రాగానే ‘అంధకారం’.. విచిత్రమో, విడ్డూరమో కాదు! -
ఫాస్ట్ లుక్ పోస్టర్ల పై దారుణమైన ట్వీట్స్
-
‘వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు అంటించను.. అదే నన్ను గెలిపిస్తుంది’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో విజయం కోసం పోస్టర్లు, బ్యానర్లపై కాకుండా సేవా రాజకీయాలపై ఆధారపడాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎలాంటి పోస్టర్లు అంటించబోనని, ఓటర్లు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో, రాబోయే ఎన్నికల్లో తనకు పోలయ్యే ఓట్లు సంఖ్యను కూడా పెంచుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఖచరియావాస్ గ్రామంలో మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ వర్ధంతి కార్యక్రమంలో హాజరైన గడ్కరీ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను గతంలో కష్టతరమైన నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఆ సమయంలో అక్కడి నుంచి పోటీ చేయవద్దని పలువురు సూచించారు. అయినా పట్టుదలతో పోరాడాను. అలానే వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయకూడదని నిర్ణయించుకున్నాను. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారు, ఇష్టం లేనివాళ్లు వేయరు’’ అని ఆయన అన్నారు. 'సేవా రాజకీయాలు', 'అభివృద్ధి కార్యక్రమాలు', గ్రామాల్లోని పేదల సంక్షేమం, పేద ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా ఓట్లు లభిస్తాయి తప్ప పోస్టర్లు, బ్యానర్లతో కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత సతీష్ పూనియా, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి! -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
Vande Bharat Express: కాంగ్రెస్ ఎంపీ పోస్టర్లు కలకలం
కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారమే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ రైలు పాలక్కాడ్‌లోని షోరనూర్ జంక్షన్‌కు చేరుకోగానే..కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీ కందన్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఆ రైలుకి కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిసూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ తదితర ప్రాంతాల్లో హాల్ట్‌లు ఇచ్చారు. అయితే షోరనూర్ జంక్షన్లో వందే భారత్ రైలు హాల్ట్ పొందడానికి ఆయన చూపిన చొరవే కారణమంటూ మద్దతుదారులు కాగ్రెస్ ఎంపీ శ్రీకందన్‌ను ప్రశంసిస్తూ.. రైలు షోరనూర్ చేరగానే స్వాగతం పలుకుతూ ఆయన పోస్టర్లు పెట్టారు. దీంతో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ కె సురేందరన్ ఒక్కసారిగా విరుచకుపడ్డారు. ఆ కాంగ్రస్ ఎంపీ తన మద్దుతుదారులతో కలిసి ఇలాంటి చర్యలకు ఎలా ఒడిగట్టారంటూ మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ శ్రీకందన్ స్పందిస్తూ..రైల్లో తన పోస్టర్లను అతికించడానికి తాను ఎవరికి అధికారం ఇవ్వలేదని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వివాదానికి తెరలేపుతోందని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా..అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో రావడంతో అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. #WATCH | Congress workers pasted posters of Palakkad MP VK Sreekandan on the windows of a wagon of Vande Bharat Express when the train reached Shoranur in Kerala's Palakkad yesterday. Railway Protection Force has registered a case, investigation underway pic.twitter.com/rgqocYIqid — ANI (@ANI) April 26, 2023 (చదవండి: ఏపీ భవన్ విభజన సమావేశం: తొమ్మిదేళ్లైనా కొలిక్కిరాని పంపకాలు) -
తెలంగాణలో మావోయిస్టు పోస్టర్లు కలకలం
-
పోస్టర్ల కలకలం.. కేసీఆర్ ప్రభుత్వ హామీల అమలు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడం లేదంటూ వ్యంగ్యంగా తెలియజేస్తూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో అనేకచోట్ల శనివారం పెద్దఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎన్ఆర్ఐ సెల్, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఉచిత ఎరువులు, దళితులకు మూడెకరాలు తదితర పథకాల గురించి ఆయా ఫ్లెక్సీల్లో పెట్టారు. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రజలను ఉచితాల వైపు మరల్చి, విపరీతంగా చార్జీలు పెంచి, ప్రజలను మద్యానికి బానిసలు చేసినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు అనే ఫ్లెక్సీ కూడా పెట్టారు. ప్రతి ఫ్లెక్సీలో సీఎం మాట ఇస్తే తల నరుక్కుంటాడు.. కానీ ఇచ్చిన మాట తప్పడు అంటూ క్యాప్షన్ రాశారు. అలాగే ‘కేసీఆర్‌కు ఫామ్‌హౌస్, కవితకు దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్, ఎమ్మెల్యేకు జీ.1 మాల్, నిరుపేదలకు డబుల్ ఇళ్లు ఏవి?’అంటూ ఆర్మూర్‌లో హైవే వద్ద ఫ్లెక్సీ పెట్టారు. శుక్రవారం పసుపు బోర్డు గురించి ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్‌గా వీటిని ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది. -
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 8 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసినందుకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అహ్మదాబాద్(గుజరాత్) పోలీసులు. మోదీ హఠావో.. దేశ్ బచావో అంటూ రాతలు ఉన్న ఆ పోస్టర్లను ఆ వ్యక్తులు అహ్మదాబాద్‌లోని పలు చోట్ల అంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంపై అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోస్టర్ల ప్రచారం చేపట్టగా.. ఆ మరుసటిరోజే ఈ అరెస్టుల పర్వం మొదలవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ హఠావో.. దేశ బచావక్ష పేరుతో మొత్తం పదకొండు భాషల్లో(గుజరాతీ, పంజాబీ, తెలుగు, పంజాబీ, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ)లో ఈ పోస్టర్ల ప్రచారం చేపట్టింది ఆప్. ఇదిలాఉంటే.. గతవారం దేశరాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీనిపై 49 ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్‌లకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారట. మొత్తంగా బుధవారం ఒక్కరోజే మోదీ వ్యతిరేక పోస్టర్ల వ్యవహారంపై 138కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓవైపు పోలీసులు ఈ అరెస్టులపై స్పందించారు. పబ్లిక్ ప్రాపర్టీలను పాడు చేయడంతోపాటు సదరు పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన పేరు, అడ్రస్, ఇతర వివరాలను పొందుపర్చలేదని.. అందుకే చట్టం ప్రకారం వాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ పరిణామంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బ్రిటిష్ కాలంలో ఇలాంటి నిరసనలు తెలిపినా.. వాళ్లు స్వాతంత్ర ఉద్యమకారులపై కేసులు పెట్టలేదని అన్నారు. భగత్ సింగ్ నాడు స్వయంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. కానీ, ఏనాడూ ఆయనపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. వందేళ్ల కిందట వ్యతిరేక పోస్టర్ల వ్యవహారంలో బ్రిటిషర్లు కూడా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కానీ, ఇవాళ ఒక్కరాత్రిలో ప్రధానిపై పోస్టర్లు వేశారని 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అమాయకుల్ని అరెస్ట్ చేశారు. దేశంలో అసలేం జరుగుతోంది. ప్రధాని ఆరోగ్యం సక్రమంగానే ఉందా?. మోదీ హఠావో.. దేశ్ బచావో అనే పోస్టర్ల క్యాంపెయిన్ అసలు పెద్ద అంశమేనా?. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఆయన(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) అభద్రతా భావంలోకి కూరుకుపోతున్నారు. బహుశా సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదేమో. అదే నిజమైతే మంచి డాక్టర్‌కు చూపించుకోమని ఆయనకు చెప్పండి. చిరాకులో ఆయన ప్రతీ ఒక్కరినీ జైలులో వేసుకుంటూ పోతున్నారేమో. ప్రధాని ఆరోగ్యం బాగుండాలని నేను ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు. -
మోదీపై ఆప్ దేశవ్యాప్త పోస్టర్ ప్రచారం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆప్ గురువారం నుంచి దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. మోదీ హటావో, దేశ్ బచావో అనే నినాదంతో ప్రాంతీయ భాషల్లో ముద్రించిన పోస్టర్లు, బ్యానర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ ఇచ్చిన అమలు కాని హామీల గురించి ప్రజలకు తెలియజెప్పడమే తమ ఉద్దేశమన్నారు. హామీలను నెరవేర్చకపోగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ మేరకు ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లను 22 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇటువంటి పోస్టర్లు, బ్యానర్లనే ఏర్పాటు చేస్తామన్నారు. -
'మోదీ హఠావో దేశ్ బచావో..' అంటూ ఢిల్లీలో వేల బ్యానర్లు ప్రత్యక్షం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఫుటోవర్‌లు, ఫ్లైఓవర్లు, బిల్డింగులు, రోడ్లు ఇలా అనేక చోట్ల మోదీ హఠావో దేశ్ బచావో(మోదీని గద్దె దించండి దేశాన్ని కాపాడండి) అంటూ ప్లెక్సీలు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి వీటిని తొలగించారు. మొత్తం 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే ఇలాంటి బ్యానర్లు లక్షకుగా పైగా ముద్రించాలని రెండు ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎవరో ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మంగళవారం 10వేల పోస్టర్లను కూడా సీజ్ చేశారు. వీటిని వ్యానులో తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే వాటిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు గానీ, ఎవరు ముద్రించారనే వివరాలు గానీ లేవు. మోదీ వ్యతిరేక బ్యానర్లకు సంబంధించి 100 ఎఫ్ఐర్లు నమోదు చేయడంతో పాటు, ఆరుగురుని అరెస్టు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పథాక్ తెలిపారు. ఆప్ కార్యాలయం నుంచే వ్యాన్ వెల్లిందని పేర్కొన్నారు. ఆప్ సెటైర్లు.. మరోవైపు మోదీ వ్యతిరేక పోస్టర్లను పోలీసులు తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. కేంద్రం నియంత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. ఆ పోస్టర్లలో ఏం తప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు మోదీజీ? అని ప్రశ్నించింది. భారత్ ప్రజాస్వామ్య దేశం అని బహుశా ప్రధాని మర్చిపోయినట్టున్నారని సెటైర్లు వేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది. मोदी सरकार की तानाशाही चरम पर है‼️ इस Poster में ऐसा क्या आपत्तिजनक है जो इसे लगाने पर मोदी जी ने 100 F.I.R. कर दी? PM Modi, आपको शायद पता नहीं पर भारत एक लोकतांत्रिक देश है। एक पोस्टर से इतना डर! क्यों? pic.twitter.com/RLseE9Djfq — AAP (@AamAadmiParty) March 22, 2023 చదవండి: కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ లింక్ చేశారా? -
టీఎస్పీఎస్సీ వద్ద ప్లెక్సీల కలకలం.. ఇచ్చట అన్ని పేపర్లు లభించును..!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ వద్ద బుధవారం ఉదయం ప్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇది జీరాక్స్ సెంటర్.. ఇచట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును.. అంటూ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో గోడ పత్రికలు వెలిశాయి. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంపై ఆవేదనతో ఒక విద్యార్థిగా ఈ విధంగా నిరసన తెలిపినట్లు ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ బాబు తెలిపాడు. గతవారం రోజులుగా విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురి చేసిన టీఎస్పీఎస్పీ కార్యాలయం వద్ద తానే ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. గోడ పత్రికలో ఆయన ఫొటో కూడా ముద్రించుకున్నాడు. పేపర్లు లీక్ చేసిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా పరీక్షను రద్దు చేయడమేంటని ప్రశ్నించాడు. శిక్ష ఎవరికి వేశారు? బోర్డుకా లేకా విద్యార్థులకా? అని ధ్వజమెత్తాడు. కస్టడీలో నిందితులు.. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో హోర్డింగ్ ల కలకలం
-
బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన
-
ఇండస్ట్రీ కళకళ.. లేడీస్ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్ స్పెషల్’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్ను రిలీజ్ చేశాయి. ఆ పో స్టర్స్ పై ఓ లుక్ వేయండి. ఫారిన్ అన్విత ఫారిన్ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్ చేస్తున్నారు మిస్ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శకుంతల ప్రేమ ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి చేరువలో.. ఉమెన్స్ డే రోజున ‘మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేశారు హన్సిక. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక. మిస్ భైరవి ‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పో స్టర్‌ను రిలీజ్ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. గీత సాక్షిగా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించారు. ఇవే కాదు.. మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్ కూడా విడుదలయ్యాయి. -
‘గెట్‌అవుట్‌రవి’.. వాకౌట్ చేసిన గవర్నర్‌పై తమిళుల నిరసన గళం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం పాఠాన్ని పలు చోట్ల విస్మరించడంతో వివాదం రాజేసింది. ద్రవిడ దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం, తమిళనాడు పేరు మార్చాలని వ్యాఖ్యనించటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. చెన్నైలో ట్విట్టర్ నంబర్ 1 ట్రెండింగ్ గెట్‌అవుట్‌రవి అనే పోస్టర్లు వెలిచాయి. పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా డీఎంకే పార్టీ నేతల ఫోటోలతో పోస్టర్లు ఉన్నాయి. గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలు కృతజ్ఞతలు తెలిపారు. This one is ultimate #GetOutRavi pic.twitter.com/Q1B080wW0N — Vignesh Anand (@VigneshAnand_Vm) January 9, 2023 ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ‘వాకౌట్’ -
రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
-
జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి
సాక్షి, తణుకు: ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తణుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ ఫేక్ యాత్రికులారా అంటూ వివిధ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతి పేరుతో టీడీపీ, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుతంత్రాలపై ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గంలోని పోస్టర్లలో నినాదాలు ఇలా ఉన్నాయి.. ► రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రాస్టేట్ ముద్దు ► జగన్ ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన ► జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి ► జగన్ ది సమైక్యవాదం.. చంద్రబాబుది భ్రమరావతి నినాదం ► జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబు ది రాజకీయ కుతంత్రం ► రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం ► మూడు రాజధానులకు ప్రజా ఆమోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం ► జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి ► చంద్రబాబు పార్టీ షేక్ పాదయాత్ర ఫేక్ ► అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష.. అయిన వారు బాగు కోసమే వికేంద్రీకరణకు బాబు వివక్ష ► వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు ► హైదరాబాద్ ప్రయోగం అన్యుల పాలు.. అమరావతి ప్రయోగం చంద్రబాబు అండ్ కోకే మేలు -
విజయవాడలో చంద్రబాబు పోస్టర్ల కలకలం
-
'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ '40 శాతం కమీషన్ సర్కార్' పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించిన విషయం తెలిసిందే. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఓ పోస్టర్లో కాంగ్రెస్ తన ఫోటోను వాడుకుందని కన్నడ నటుడు అఖిల్ అయ్యర్ ఆరోపించాడు. తన అనుమతి లేకుండా తనకు సంబంధం లేని వ్యవహారంలో తన చిత్రాన్ని వాడటంపై అభ్యంతరం తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్‌ను షేర్ చేసి, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్‌ను హెచ్చరించాడు అఖిల్. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్‌ను ట్యాగ్ చేశాడు. I am appalled to see that my face is being used illegally and without my consent for "40% Sarkara" - an @INCIndia campaign that i have nothing to do with. I will be taking legal action against this.@RahulGandhi @siddaramaiah @INCKarnataka request you to please look into this pic.twitter.com/y7LZ9wRXW9 — Akhil Iyer (@akhiliy) September 23, 2022 'అవినీతి ఆకలితో ఉన్న ఈ 40శాతం కమీషన్ సర్కార్ 54,000 మంది విద్యార్థుల కెరీర్‌ను దోచుకుంది. ఇంకా మీలో చలనం రాదా?' అని కాంగ్రెస్ ఓ పోస్టర్‌ను రూపొందించింది. ఇందులో నటుడు అఖిల్ ఫోటోను ఉపయోగించింది. దీనిపైనే ఆయన అభ్యంతరం తెలిపాడు. చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా -
పేటీఎం తరహాలో ‘పేసీఎం’.. క్యూఆర్ కోడ్‌తో నేరుగా..!
బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభించింది. కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్‌ను ఎత్తిచూపేలా ఈ వెబ్సైట్, పోస్టర్లను డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్‌తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ -
గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు
శ్రీనగర్: కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మిషన్ కశ్మీర్ కార్యక్రమంలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఆజాద్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ముష్కర సంస్థ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచురించడం ఆందోళన కల్గిస్తోంది. పోస్టర్లో ఆజాద్‌ను రాజకీయ ఊసరవెల్లి అని ఆరోపించారు ఉగ్రవాదులు. ఆయన ద్రోహి అని విధేయత అంటే ఏంటో తెలియదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ముందస్తు ప్రణాళికతోనే కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తన గార్డులను మార్చడానికి ముందు ఆజాద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఆ పార్టీకి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు ఆజాద్. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో సొంత రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. తనకు ఆ ఆలోచన లేదని ఆజాద్ చెప్పారు. చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ -
రుస్తుమా ఎగిరిపోయింది.. కనిపెట్టిన వారికి రూ.50వేల నజరానా
బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు. #Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ — IndiaObservers (@IndiaObservers) July 19, 2022 వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా?
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో 'చాలు మోదీ, చంపకు మోదీ' అంటూ పలు చోట్ల బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ ఏర్పాటు చేయటం కలకలం రేపింది. యూపీ ప్రయాగ్ రాజ్ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్ పోలీస్ లైన్‌కు సమీపంలో శనివారం 'బై బై మోదీ' అంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన కోలోనెల్‌గంజ్ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్, కార్యక్రమ నిర్వహకుడు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మద్దతుదారు అది ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టయిన వారిలో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అభేయ్ కుమార్ సింగ్, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్ కేసరి, కాంట్రాక్టర్ రాజేశ్ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్ ధర్మేంద్రలుగా గుర్తించారు. కోలేనెల్‌గంజ్ డిప్యూటీ ఎస్పీ అజీత్ సింగ్ చౌహాన్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ' ప్రధాని మోదీపై వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసిన ఐదుగురిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అరెస్ట్ చేశాం. తెలంగాణలోని సికింద్రబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు ఆధ్వర్యంలో ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జులై 8-9 తేదీల మధ్య రాత్రి బెలి రోడ్డులో దీనిని ఏర్పాటు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని తెలిపారు. ఈ వివాదాస్పద హోర్డింగ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు చెప్పారు డిప్యూటీ ఎస్పీ అజిత్ సింగ్. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, టీఆర్ఎస్ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. జులై 7న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సైతం ఇలాంటి పోస్టర్లే వెలిచాయని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారయన్నారు. టీఆర్ఎస్ మద్దతుదారు సాయి.. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాలపై ఆరా తీసినట్లు విచారణలో తేలిందన్నారు అజిత్ సింగ్. ఆయా ప్రాంతాల వివరాలు ఆర్గనైజర్ పంపించగా.. బెలి రోడ్డులో ఏర్పాటు చేయాలని, అందుకు రూ.10వేలు సైతం ఇచ్చినట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాయి డైహార్డ్ ఫ్యాన్‌గా చెప్పుకొచ్చారు. ఇదీ చూడండి: టోల్గేట్ వద్ద 'ది గ్రేట్ ఖలీ' హల్చల్.. సిబ్బందిపై పంచ్‌లు! -
శివసేన కార్యకర్తల ఆగ్రహం.. కోడిగుడ్లతో రోడ్లపైకి వచ్చి..
ముంబై: మహారాష్ట్రలో పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. షిండేకు వ్యతిరేకంగా జరిగిన తాజా నిరసనలో నాసిక్‌లో కొందరు శివసేన కార్యకర్తలు అతని పోస్టర్‌పై ఇంక్ చల్లడంతో పాటు కోడిగుడ్లు విసిరి నిరసనను తెలిపారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. రెబల్ పార్టీ నేత ఏక్నాథ్ షిండేతో కలిసి గౌహతి క్యాంప్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే సదా సర్వాంకర్ పోస్టర్‌పై ‘మోసగాడు’ అని రాసి శివసేన కార్యకర్తలు తమ నిరసనను తెలిపారు. ఈ ఘటన ఆయన సొంత నియోజకవర్గం మహిమ్లో చోటు చేసుకుంది. పార్టీ శాసనసభ్యులు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటులో చేరిన తర్వాత మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం చెలరేగింది. షిండే శిబిరానికి ప్రస్తుతం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వీరిలో కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. #WATCH Shiv Sena supporters throw black ink and eggs at a poster showing a picture of rebel MLA Eknath Shinde, also raise slogans against him, in Nashik pic.twitter.com/DUtKE2R2S5 — ANI (@ANI) June 24, 2022 చదవండి: Maharashtra political crisis: షిండే తొలగింపు చెల్లుతుంది! -
గుజరాత్లో నూపుర్ శర్మ వ్యతిరేక పోస్టర్లు
Prophet remarks row: బీజేపీ తాజా మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు వ్యతిరేకంగా గుజరాత్లో పోస్టర్లు వెలిశాయి. ముహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన కామెంట్లపై దుమారం చల్లారడం లేదు. ఈ తరుణంలో గుజరాత్ సూరత్‌లోని జిలాని బ్రిడ్జి మీద నూపుర్ వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలంటూ ఆ పోస్టర్లో ఉంది. ఈ పని ఎవరు చేశారన్నది తెలియకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇస్లాం దేశాలు ఒక్కొక్కటిగా తమ వ్యతిరేకతను ప్రకటనల రూపంలో ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఆమెపై కేసులు సైతం నమోదు అవుతున్నాయి. చదవండి: నూపుర్‌కు అల్‌ఖైదా వార్నింగ్ -
బస్సులో చిల్లర అడిగితే జైలుశిక్ష..
సాక్షి,శివాజీనగర(కర్ణాటక): బస్సుల్లో చిల్లర డబ్బు కోసం కండక్టర్‌ను ప్రయాణికులు అడగడం, కొన్నిసార్లు గొడవ జరగడం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో కూడా ఈ ఉదంతాలు నవ్విస్తాయి. చిల్లర ఇవ్వాల్సిందేనని ప్రయాణికులు కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్లను బస్టాండ్లలో అతికించింది. సంస్థ ఏకపక్ష ధోరణిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంతకీ పోస్టర్లో ఏముందంటే.. బస్సుల్లో చిల్లర అడగడం ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుంది. నేరం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది అని పోస్టర్లో హెచ్చరిక ఉంది. చిల్లర అడిగితే జైలుకు పంపుతారా, ఇదెక్కడి చోద్యం అని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అభ్యంతరకరమైన, ఆశ్లీల చిత్రాలు హైదరాబాద్ నగర బస్సులపై కనిపించవని ఆయన స్పష్టం చేశారు. ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్ ఆర్టీసీ బస్సుపై ఉండటాన్ని అభిరామ్ నేత అనే నెటిజన్ బుధవారం ట్విటర్లో పోస్టు చేశాడు. దీనికి టీఎస్ఆర్టీసీ ఎండీ ఆఫీస్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో సజ్జనార్ స్పందించారు. ఇవి మన బస్సులూ.. ఇదీ మన బహిరంగ ప్రచారం..💁@tsrtcmdoffice @TSRTCHQ ఎవర్ని రెచ్చగొడుతున్నాం..? ఏం కోరుకుంటున్నాం? : సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరూ చెప్పొద్దూ..! pic.twitter.com/ck9QZwGxby — ABHIRAM NETHA (@AbhiramNetha) September 15, 2021 సంస్థ దీనిపై చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన రీట్వీట్ చేశారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జనార్ చర్యపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. In order to Prevent #disfigurement & objectionable Posters on #RTC Buses #MD @TSRTCHQ Sri #VCSajjanar #IPS has Passed instructions to all Officers to Remove all such Kind of Posters immediately #ActNow#Revolution #publictransport@TelanganaCMO @KTRTRS @puvvada_ajay @DonitaJose pic.twitter.com/Zhfn9ImKj4 — TSRTC MD Office (V.C Sajjanar IPS) (@tsrtcmdoffice) September 16, 2021 -
త్వరలోనే ప్రధానమంత్రిగా ఎంఎస్ ధోనీ!
చెన్నై : తమిళ స్టార్ విజయ్ను ఇటీవలె టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసిన సంగతి తెలిసిందే. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్లో భాగంగా చెన్నై వెళ్లిన ధోనీ ..అదే లొకేషన్లో ఉన్న విజయ్ను కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ అనందంతో కొందరు ఫ్యాన్స్ సృష్టించిన పోస్టర్లు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. భవిష్యత్తులోఎంఎస్ ధోనీని ప్రధానమంత్రిగానూ, విజయ్ను ముఖ్యమంత్రిగానూ చూడోబోతున్నాం అంటూ కొందరు అభిమానులు మధురైలో పోస్టర్లు అంటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లపై దుమారం రేగుతోంది. -
Congress: మమ్మల్నీ అరెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్లు వేసిన వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం, కేసులు నమోదు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని తాము కూడా అలాంటి ప్రశ్నలను అడుగుతాం, ప్రజల అవసరాలు తీరేదాకా అడుగుతూనే ఉంటాం, అరెస్ట్ చేస్తారా అని అగ్రనేత రాహుల్ సహా ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు ఆదివారం తమ ట్విట్టర్ ఖాతాల్లో ప్రొఫైల్ ఫొటోల స్థానంలో ‘కోవిడ్ టీకాలను విదేశాలకు ఎందుకు ఎగుమతి చేశారు?’ అనే పోస్టర్‌ను ఉంచారు. టీకాలు, మందులు, ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే ప్రజలు ఇలాంటి కఠిన ప్రశ్నలనే ప్రధాని మోదీని అడుగుతారని వారు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో ‘మోదీజీ, మా పిల్లలకు అందాల్సిన టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?’ అని ఉన్న పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘నన్నూ అరెస్ట్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ‘మా ఇంటి ప్రహరీ గోడపై ఇలాంటి పోస్టర్లను రేపే అంటిస్తా. వచ్చి అరెస్ట్ చేయండి’ అంటూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సవాల్ చేశారు. ‘ప్రధానిని విమర్శిస్తూ పోస్టర్లు వేయడం కూడా నేరమేనా? దేశంలో ఇప్పుడు మోదీ పీనల్ కోడ్ అమల్లో ఉందా? మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఢిల్లీ పోలీసులకు ఇది తప్ప మరే పనీలేదా?’ అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రస్తుతం కోవిడ్ టీకా, మందులు, ఆక్సిజన్ అవసరం తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ప్రజలు అవి అందేదాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారన్నారు. పోస్టర్ల వెనుక ఆప్ నేత ఈ పోస్టర్ల వ్యవహారం వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హస్తం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టయిన కొందరు ఆప్ నేత అర్వింద్ గౌతమ్ పేరును విచారణ సందర్భంగా వెల్లడించారని పేర్కొన్నారు. అర్వింద్ గౌతమ్ ఢిల్లీ మంగోల్‌పురి ప్రాంతంలోని 37వ వార్డు ఆప్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు. పోస్టర్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశామన్నారు. చదవండి: 'కోవిడ్‌పై ప్రభుత్వ విధానం వినాశకరం' -
ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 25 మందిని అరెస్ట్ చేయడంతోపాటు 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కనిపించిన ఆ పోస్టర్లపై ‘మోదీజీ..మా పిల్లల వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎందుకు పంపించారు?’ అని ఉందని పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీస్ అధికారి ఒకరు స్పందిస్తూ..‘ ప్రస్తుతానికి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎవరి ప్రోద్బలం మేరకు ఈ పోస్టర్లను అంటించారనే దానిపై విచారణ చేపట్టాం. బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. ఈ పోస్టర్లను అంటించినందుకు తనకు రూ.500 ఇచ్చారని నార్త్ ఢిల్లీలో అరెస్టయిన వ్యక్తి పోలీసు విచారణలో వెల్లడించాడు. -
శ్రీరామ నవమి స్పెషల్: కొత్త సినిమాల పోస్టర్లు చూశారా
పండగ వచ్చిందంటే చాలు.. సినిమాలకు సంబంధించి కొత్త కబుర్లు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు, స్పెషల్ పోస్టర్లు విడుదల అవుతుంటాయి. పండగ పూట కొంతమంది హీరోల సినిమాల విడుదలైతే.. మరికొన్ని సినిమాల టీజర్స్, ట్రైలర్లు అంటూ సందడి చేస్తాయి. అయితే కరోనా పుణ్యమా అని ఈ శ్రీరామ నవమికి సినిమాలు అయితే విడుదల కాలేదు కానీ, కొత్త పోస్టర్లు మాత్రం సందడి చేశాయి. శ్రీరామ నవమి పురస్కరించుకొని చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ విడుదల చేసారు. అవేంటో చూసేద్దాం. -
బాలుడి ఆచూకీ చెబితే రూ.లక్ష!
గీసుకొండ: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా రేణి గ్రామానికి చెందిన పలువురు గత ఏడాది కొమ్మాల జాతరలో ఆట వస్తువులు అమ్ముకునేందుకు వచ్చారు. వీరిలో భగర్య ధర్మవీర్– సీత దంపతుల కుమారుడు భగర్య ప్రదీప్(6) అదే ఏడాది మార్చి 10న జాతరలో తప్పిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులతోపాటు, బాలల సంరక్షణ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. బస్సులపై పోస్టర్లు అంటించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు ఎప్పటికైనా తిరిగి రాకపోతాడా అని తల్లిదండ్రులు కొన్ని నెలల పాటు ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. అయితే, బాలుడు తప్పిపోయి ఏడాది గడిచిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. కాగా, శనివారం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చిన మామునూరు ఏసీపీ నరేష్కుమార్ బాలుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నజరానా అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే, ఈసారి జాతరలో కూడా బాలుడి వాల్‌పోస్టర్లు వేయిస్తామని పేర్కొన్నారు. చదవండి: నిర్లక్ష్యం: స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకుంటూ.. -
భర్త చీటింగ్.. పోస్టర్లతో భార్య నిరసన!
లండన్: తన భర్త మోసం చేస్తే ఏ మహిళ అయినా ఏం చేస్తుంది. మొబైల్‌తో మెస్సెజ్ లేదా కాల్ చేసి తన కోపాన్ని తీర్చుకుంటుంది. పెద్దలకు దృష్టికి తీసుకువెళుతుంది. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండి దూరంగా వెళ్ళపోవడమో.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడమో చేస్తుంది. అయితే యూకేలోని ఓల్డ్ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త చేసిన మోసానికి వెరైటిగా నిరసన తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్హోమ్కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. తన భర్త ఫోటోను ఏ4 సైజ్‌లో ప్రింట్ తీయించి గోడలకు అంటించింది. ఆ పోస్టర్ కింద ఇతనొక పెద్ద మోసగాడు అని కూడా రాసింది. చెట్లు, కార్లు వేటిని వదలకుండా అన్నిచోట్ల అతికించి తన కోపాన్ని వెల్లగక్కింది. అంతటితో ఆగకుండా మోసాలకు పాల్పడుతున్న మగాళ్ళను ఉద్దేశించి కూడా మరికొన్ని పోస్టర్లను గోడలకు అతికించింది. ‘మీ భార్యను మోసం చేస్తున్నారా? తొందర్లోనే మీ బండారం బయట పడుతొంది’ అని కామెంట్లు కూడా రాసింది. అయితే భార్యలను ఉద్దేశించి ‘ఈరోజు మీ భర్త మీతోనే ఉన్నాడా? నిన్నరాత్రి? గతవారం కూడా మీతోనే ఉన్నాడా?’ అని రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అతికించి ప్రచారం చేసింది. అయితే గుర్తు తెలియని ఈ మహిళ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎమిలీ అనే మహిళ కూడా తన లవర్ మోసం చేశాడని అతని గది చుట్టూ ఇటువంటి పోస్టర్లను అతికించి నిరసన తెలిపింది. కాగా, 2019లో ఓ యువకుడు ఏకంగా తనను మోసంచేసిన అమ్మాయి ఫోటోను పట్టుకొని రద్దీగా ఉండే వీధిలో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనను మోసం చేసిందని రోడ్డుకెక్కాడు. ఆమెకు తను బ్రేకప్ చెప్తున్నాను అంటూ రోడ్డుపైనే ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా! -
బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు: అధికారుల కొరడా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 4 వేలకు పైగా పోస్టర్లు, బ్యానర్లు తొలగించినట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. (చదవండి: దుబ్బాక దెబ్బ: కేసీఆర్ వ్యూహం మార్చుతారా?) తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీ గోడలు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని డి.ఎస్.లోకేష్ కుమార్ వివరించారు. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల) -
నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు
ముంబై : గురువారం ముంబైలోని మహమ్మద్ అలీ రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పోస్టర్లు కలకలం రేపాయి. అలా రోడ్డుపై వందల సంఖ్యలో పోస్టర్లు దర్శనమివ్వటంతో పాదచారులు, వాహనదారులు ఆసక్తిగా వాటిని తిలకించారు. సమాచారం అందుకున్న ఫైధోనీ పోలీసులు రోడ్డు వద్దకు చేరుకుని పోస్టర్లను తీసివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( నా పిల్లలకు ఈ మాట చెప్పండి..) కాగా, గురువారం ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో ఓ దుండగుడు కత్తి దాడి జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనిపై ఇమాన్యుయేల్ స్పందిస్తూ.. దాన్ని మతోన్మాదుల దాడిగా పేర్కొన్నారు. ‘ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోస్టర్లు ముంబైలోని రోడ్డుమీద కనిపించటం చర్చనీయాంశంగా మారింది. -
మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో ఒకప్పుడు మావోలకు కంచుకోటగా ఉన్న బోథ్ ప్రాంతంలో నాలుగురోజుల క్రితం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ స్వగ్రామమైన బోథ్ మండలం పొచ్చెరతో పాటు సోనాలలో పోస్టర్లు వెలియడంతో రెండు దశాబ్దాలపాటు ఎలాంటి అలజడిలేని గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, కంతి లింగవ్వ, వర్గీస్, సుదీరాము, మంగుల టీమ్ సభ్యులు ఎవరికి వారే వారి కోరియర్ల ద్వార ఆదివాసీ రైతులు, వ్యాపారస్తులు, కిరాణా దుకాణాదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పోస్టర్లలో ఆరోపించారు. ఆదివాసీ యువతను అడ్డం పెట్టుకుని మైలరాపు అడెల్లు, కంతి లింగవ్వ, వర్గీస్‌లు వారికి అనుకూలమైన ప్రాంతంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ యువతను బలవంతంగా పార్టీలో చేర్చుకుని స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ యువత చైతన్యవంతులై మావోయిస్టుల ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాగా మారుమూల గ్రామాల్లో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆడిట్ భయం! ఆదిలాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఆడిట్ భయం పట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ, జమ వివరాలతో పాటు జీపీల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు అధికారులు సిద్ధం కానుండడంతో వణుకు మొదలైంది. చిన్నా పెద్ద పంచాయతీలనే తేడా లేకుండా అన్నీ జీపీల్లో పకడ్బందీగా ఆడిట్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఏ పంచాయతీ అవినీతి బాగోతం బయటకు వస్తుందోనని పలువురిలో ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను ఏడాదికి రెండుసార్లు అన్ని జీపీలకు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రారం«భం నుంచి ప్రత్యేక, ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేస్తోంది. జీపీల్లో ఈ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడత ఆగస్టులో నిర్వహించగా, రెండో విడత మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. వంద జీపీల్లో పూర్తి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో (25 శాతం)100 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా నేరుగా జీపీలకు వెళ్లి ఆడిట్ చేయడం అప్పట్లో కష్టంగా మారిన నేపథ్యంలో ఆన్లైన్లో ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పంచాయతీల్లో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా ఆడిట్ నిర్వహించారు. ఇందుకు రెండు నెలల సమయం పట్టింది. మిగతా జీపీల్లో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని వంద జీపీల్లో నిర్వహించిన ఆడిట్లో చాలా విషయాలు వెలుగుచూశాయి. 2019–20 సంవత్సరంలో కొన్ని జీపీలు ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించలేదని, ఐటీ కట్టడం లేదని, జీఎస్టీ బకాయిలు ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం లేదని ఆడిట్లో తేలింది. అయితే ప్రభుత్వ ఖజానాలో నిధులు జమచేయడం లేదనే అంశాలు వెలుగుచూశాయి. అయితే ఆడిట్ సమయంలో రికార్డులు చూపించని జీపీలు 40 రోజుల్లోగా సరైన రికార్డులతో పాటు హార్డ్ కాపీలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఆడిట్లో తేలిన విషయాలనే ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఆడిట్ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు మిగతా పంచాయతీల్లో ఆడిట్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేపటి నుంచి షురూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు జిల్లాలోని అధికారులు గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించనున్నారు. మొదటి విడత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు వంద పంచాయతీల్లో నిర్వహించగా, రెండోవిడత మిగతా 367 పంచాయతీల్లో మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. రేపటి నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు వెళ్లి ఆడిట్ చేస్తారు. టీం సభ్యులంతా ఒకే దగ్గర ఆడిట్ చేయాల్సి వస్తే మండల పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో ఆడిట్ చేస్తారు. ఇందుకు ఆయా జీపీలకు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాల రికార్డులు, పనులకు సంబంధించి ఎంబీ రికార్డులను ఎంపీవో అఫీసుకు జీపీ అధికారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాలో ఏడుగురు ఆడిట్ అధికారులతో రెండు టీంలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐదుగురు సీనియర్ ఆడిట్ అధికారులుండగా, ఇద్దరు జూనియర్, ఇద్దరు అసిస్టెంట్ ఆడిట్ అధికారులున్నారు. ఆడిట్ చేస్తారిలా.. జీపీల్లో నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను పరిశీలిస్తారు. ఏ నిధులతో ఏ పనులు చేశారు? అందుకు సంబంధించిన ఎంబీ రికార్డులు పరిశీలిస్తారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, వాటికి సంబంధించిన ఖర్చుల రికార్డులు, మిగిలి ఉన్న నిధులు వివరాలు పరిశీలిస్తారు. ఏఏ పనులు చేశారో క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను పరిశీలించి అన్నీ సక్రమంగా చేశారా? లేదా అన్నది చూసి గ్రామాల వారీగా రిపోర్టు తయారు చేస్తారు. రికార్డులు లేని వాటిని రిమార్క్ రాసి ఉంచుతారు. పంచాయతీ అధికారులు చూసి ఆడిట్ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం ఇస్తారు. వివరాలు ఆడిట్ చేసిన అధికారి నుంచి టీం లీడర్‌కు, ఆ తర్వాత జిల్లా ఆడిట్ అధికారికి చేరుతాయి. ఆ తర్వాత డీఏవో సరైన వివరాలు లేని వాటికి సమాధానం ఇవ్వాలని కోరుతారు. గడువులోగా హార్డ్ కాపీలతో పాటు వివరాలు అందజేయాలి. లేదంటే జీపీల్లో చేసిన ఆడిట్ వివరాలనే ప్రభుత్వానికి, కలెక్టర్‌కు పంపిస్తారు. ఆ తర్వాత డీఏవో పంపిన నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 6 నుంచి ఆడిట్ ప్రారంభిస్తాం ఈ నెల 6 నుంచి పంచాయతీల ఆడిట్‌ను ప్రారంభించనున్నాం. ఇది వరకే పైలెట్ ప్రాజెక్టు కింద వంద జీపీలను ఆన్లైన్లో ఆడిట్ చేశాం. ఇప్పుడు నేరుగా పంచాయతీలకు లేదా ఎంపీవో కార్యాలయాలకు వెళ్లి ఆడిట్ చేయనున్నాం. ఈ నెలాఖరులోగా జిల్లాలోని అన్ని జీపీల్లో ఆఫ్‌లైన్ ద్వారా ఆడిట్ పూర్తి చేస్తాం. – కె.రాజ్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి -
అన్నాడీఎంకేలో ‘సీఎం’ వేడి
చెన్నై: ఎన్నికలకు మరో 9 నెలల సమయముండగానే అన్నాడీఎంకేలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై వేడి రాజుకుంది. కొన్నాళ్లుగా ఈ విషయంలో మంత్రులు బాహటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీనికితోడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ శనివారం పలుచోట్ల పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి సీఎం పళనిస్వామి, పన్నీరు సెల్వంలతో భేటీ అవుతున్నారు. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం అభ్యర్థిపై ప్రచారాలు మొదలు కావడంతో పళనిస్వామి, పన్నీరు సెల్వం శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమష్టిగా జరుగుతాయని, వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ బాహాటంగా ప్రకటించకూడదని కోరారు. ‘ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంతో సహా నిర్ణయాలన్నీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొనే జరుగుతాయి. విజయం కోసం పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’అని ఆ ప్రకటనలో అగ్రనేతలిద్దరూ హెచ్చరించారు. ఇటీవల సహకారశాఖ మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనే దానిపై నిర్ణయం ఉంటుందని అన్నారు. మరో మంత్రి కేటీ రాజేంద్ర స్పందిస్తూ పళనిస్వామే సీఎం అభ్యర్థని ప్రకటించారు. దీంతో పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగి ‘ఏఐఏడీఎంకే లక్ష్యం... వరుసగా మూడోసారి నెగ్గడం. అదే అమ్మ (జయలలిత) కల కూడా. అందరూ క్రమశిక్షణతో ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని ట్వీట్ చేశారు. -
రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్ఎంసీ పెనాల్టీ
సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు రూ.4వేల పెనాల్టీ విధించింది. లాక్డౌన్ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ పౌరుడొకరు సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవీడీఎం విభాగం ఈనెల 22వ తేదీన రూ.4వేలకు ఈ చలానా జారీ చేసింది. -
‘డిగ్రీ కాలేజి’ నిర్మాత, దర్శకులపై కేసు
అమీర్‌పేట: అమీర్‌పేట మైత్రివనమ్ కూడలిలో డిగ్రీ కాలేజ్ సినిమాకు చెందిన అశ్లీల పోస్టర్లు అతికించినందుకు సినిమా దర్శకుడు,నిర్మాతలపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెపెక్టర్ మురళీకృష్ణ తెలిపిన మేరకు.. డిగ్రీ కాలేజ్ సినిమాకు సంబంధించిన అశ్లీలంగా ఉన్న పోస్టర్లను మైత్రివనమ్ పరసర ప్రాంతాల్లో అతికించారు. వీటిని చూసి విస్తుపోయిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. టాస్క్ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌రావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు.ఈ కేసును సుమోటోగా నమోదు చేసుకున్న ఎస్ఆర్నగర్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.కాగా నింధితుల్లో ఒకరైన దర్శకుడు నర్సింహ నంది జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకులుగా అవార్డు అందుకున్నారు. -
ముంబైలో బాల్ ఠాక్రే - ఇందిరా గాంధీ పోస్టర్లు..
ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కార్ మహారాష్ట్రలో గురువారం కొలువుతీరనున్న నేపథ్యంలో ముంబైలో సేన వ్యవస్ధాపకులు బాల్ ఠాక్రే, దివంగత ప్రధాని ఇందిరా గాంధీల పోస్టర్లు వెలిశాయి. బాలాసాహెబ్ స్వప్నం ఫలించింది ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడని ఈ పోస్టర్లపై రాసిఉంది. గతంలో బాల్ ఠాక్రే, ఇందిరాగాంధీ భేటీ అయిన చిత్రాలతో కూడిన ఈ పోస్టర్‌ను శివసేన భవన్‌కు సమీపంలో ఏర్పాటు చేశారు. రెండు భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల అధినేతలను ఒక్కటి చేస్తున్న ఈ పోస్టర్లను అందరూ ఆశ్చర్యంగా తిలకిస్తుండటం విశేషం. మరోవైపు శివసేన అధిపతి బాల్ ఠాక్రే ఇందిరా గాంధీ విధానాలకు సంఘీభావం తెలిపేవారని, పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ను ఆయన సమర్ధించారని శివసేన నేతలు గుర్తుచేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవగా ఆమె నిర్ణయాన్ని బాల్ ఠాక్రే సమర్ధించారు. 1966లో శివసేనను స్ధాపించిన బాల్ ఠాక్రే పార్టీ విధానాలకు అద్దంపట్టేలా సామ్నా పత్రికను నెలకొల్పారు. 2012లో 86 ఏళ్ల వయసులో ఆయన మరణించేంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ సైతం ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
‘తూనీగ’ డైలాగ్ పోస్టర్ల విడుదల
హైదరాబాద్ : వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన ‘తూనీగ’ చిత్ర డైలాగ్ పోస్టర్లను దర్శకుడు వేణు ఉడుగుల ట్విటర్ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సరికొత్త ఆలోచనలతో రూ పొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నూతన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ కష్టం ఫలించి, ఈ చిత్ర రూపకర్తగా ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవాలని కోరుకున్నారు. సృజనకు ఎల్లలు లేవని నిరూపించాలని, ఆ దిశగా వేస్తున్న తొలి అడుగు ఫలప్రదం కావాలని అభిలషించారు. ప్రోమో డైలాగ్ రైటర్ రత్నకిశోర్ శంభుమహంతిని, డైలాగ్ పోస్టర్లను అందంగా రూపొందించిన ప్రముఖ ఆర్టిస్టులు గిరిధర్ అరసవల్లి, బాబు దండ్రుపెల్లి, ధనుంజయ అండ్లూరిని, ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరహా వినూత్న ప్రచారం తననెంతో ఆకట్టుకుందని, ముందున్న కాలంలో డిజిటల్ మాధ్యమాలు మరిన్ని కొత్త ఆలోచనలకు నాంది కానున్నాయని, వాటికి సంకేతంగా ఈ పోస్టర్స్ ఉన్నాయని విశ్లేషించారు. డైలాగ్ పోస్టర్ల విడుదల అనంతరం చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంది. డైరెక్టర్ వేణు ఉడుగులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని స్వరాలు సమకూరుస్తున్నారు. రిషి ఎదిగ సినిమాటోగ్రఫర్‌గా, ఆర్కే కుమార్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రేమ్ పెయింటింగ్స్ పతాకంపై క్రౌడ్ ఫండింగ్ విధానంలో నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్ర ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. డైరెక్టర్ ప్రేమ్ సుప్రీమ్ స్వస్థలం శ్రీకాకుళంతో సహా విశాఖ, హైద్రాబాద్, బెంగళూరు నగరాల పరిసర ప్రాంతాల్లో ‘తూనీగ’ తెరకెక్కింది. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. -
పోస్టర్ల మహాసముద్రం
కాపీ కొట్టేవాళ్లని ‘కాపీక్యాట్’ అంటారు. చైల్డ్ వర్డ్ అది. పెద్దవాళ్లు కాపీ కొడితే అది చైల్డిష్ కాదు. షేమ్‌లెస్! లేటెస్ట్గా ఓ పిల్లి పోస్టర్‌పై వివాదం మొదలైంది. కంగనా నటించిన ‘జడ్జ్‌మెంటల్ ౖహె క్యా’ చిత్రం పోస్టర్‌ను తన ఆర్ట్‌వర్క్ చూసి కాపీ కొట్టారని ఓ హంగేరియన్ ఆర్టిస్ట్ ఆరోపిస్తున్నారు. మనం ఎప్పటిలా మానేస్తాం.. కాపీ క్యాట్‌లా మ్యావ్ అనడం! ఎవరూ చూడ్డం లేదని పాలు తాగేశాక ఇలాగే కదా.. పిల్లి మ్యావ్ అంటూ వెళ్లిపోయేది! హాల్ లోపల వెండితెర, హాల్ బయట ‘వాల్’తెర.. రెండూ రెండు ప్రాణాలు సినిమాకు. లోపలిది చలన చిత్రం. వెలుపలిది నిశ్చలన చిత్రం. ఎంత చలన చిత్రం అయినా, హాల్ లోపలికి ప్రేక్షకుల్ని నడిపించేది మాత్రం బయట వాల్‌పై కనిపించే నిశ్చలన చిత్రమే. టీజర్లొచ్చి, యూట్యూబ్ ట్రైలర్లు వచ్చినా మైదా రాసి గోడకు అంటించే పోస్టర్‌కు ఉండే స్మెల్ వేరే దేనికీ రాలేదు. పోస్టర్ మేకింగ్ ఇప్పటికీ సినిమా తీసినంత పని. గోడపైన హీరోనో, హీరోయిన్నో లేదా ఇంకేదైనా సీన్నో చూడగానే గుండెకో, మైండ్కో పట్టేసేటట్లు ఉండాలి. తేలికేం కాదు. సినిమాలొచ్చిన కొత్తలో పోస్టర్ల డిజైనింగ్ ఇంత కష్టంగా ఉండకపోయేదేమో. సినిమాలు ఎక్కువయ్యాక పోస్టర్లు క్రియేట్ చెయ్యడానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లా పెద్ద టీమ్ సిద్ధమౌతోంది. మెప్పించి, రప్పించాలి కదా ఆడియన్స్‌ని థియేటర్లకు. తొలి చిత్రాల పోస్టర్లు 1932లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ తెలుగులో తొలి టాకీ చిత్రం. పోస్టర్లే లేని ఆ కాలంలో పోస్టర్ చెయ్యడం అన్నది చంద్రయాన్ ప్రయోగమే. అయినా చేశారు. చెయ్యకపోతే సినిమా గురించి తెలిసేదెలా? అయితే అది పెద్ద సైజు పాంప్లెట్‌లా ఉంది తప్ప పోస్టర్లా లేదు. పాంప్లెటే పోస్టర్ అనుకోండి. ఆ పోస్టర్లు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాక, థియేటర్ల వాళ్లు కొట్టించుకున్నవి. ‘భారత మూవీటోన్ అనబడుతున్న శ్రీ కృష్ణా ఫిల్ము కంపెనీ వారిచే అధిక వ్యయ ప్రయాసలకోర్చి తయారు చేయబడిన ‘భక్త ప్రహ్లాద’ 100 శాతం సంపూర్ణ తెలుగు టాకీ అని బెజవాడలోని అప్పటి ‘శ్రీ దుర్గా కళామందిరము’ పోస్టర్ కొట్టించింది. చుట్టూ సినిమా వివరాలు, ఆ వివరాల మధ్యలో భక్తప్రహ్లాదుడి మూవీ స్టిల్. ఇదీ ఆ పోస్టర్. నిర్మాణ సంస్థ మూవీటోన్ నేరుగా కొట్టించిన పోస్టర్ కూడా ఉంది. అది ఇంగ్లిష్‌లో ఉంటుంది. సిమెట్రికల్గా సినిమాలోని ఓ ఏడు సన్నివేశాలతో భక్తప్రహ్లాద పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా విశేషాలను ఇచ్చారు. చూడ్డానికి ఇప్పుడా సినిమా లేదు. పుణె ఆర్కైవ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన వాటిలో భక్తప్రహ్లాద ఫిల్మ్ రీళ్లు కూడా ఉన్నాయి. ఏవో రెండు స్టిల్స్, ఓ సినిమా పోస్టర్ మాత్రమే ప్రస్తుత జ్ఞాపకాలు. తొలి తెలుగు సినిమా కంటే కాస్త ముందు తొలి హిందీ సినిమా ‘ఆలం ఆరా’ తయారైంది. నిర్మాణం ఇంపీరియల్ మూవీటోన్. 1931లో విడుదలైంది. భక్త ప్రహ్లాద పోస్టర్లా నలుపు తెలుపులో కాక, ఆ సినిమా పోస్టర్ సింగిల్ కలర్లోనే రెండు షేడ్లుగా వచ్చింది. పోస్టర్ మీద ఒక అందమైన బంజారా యువతి గుండెలపై చేతులు వేసుకుని నిలబడి ఉంటుంది. కింద ఒక ప్రణయ సన్నివేశం ఉంటుంది. పైన ఓ మూల.. గుంపు పన్నివేశం ఉంటుంది. ‘ఆలం ఆరా’ అనే టైటిల్ ఉంటుంది. టైటిల్ కింద.. ఆల్ డ్యాన్సింగ్, సింగింగ్ అండ్ డాన్సింగ్ అని ఉంటుంది. పోస్టర్ అడుగున స్ట్రిప్ ఉంటుంది ‘ఇంపీరియల్ మూవీ–టోన్, బాంబే’ అని. ఈ సినిమా ఫిల్ములు కూడా కాలిపోయాయి. పోస్టర్ ఒక్కటే ప్రాణంతో ఉంది. మట్టిగోడలపై లీడ్ రోల్స్ రఫ్‌గా ఓ వందేళ్లుగా టాకీలు ఆడుతున్నాయి. వాటి మూకీ వెర్షన్లుగా వాల్ పోస్టర్లూ వందేళ్లుగా ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నాయి. మట్టి గోడకు సినిమా పోస్టర్ అంటించి ఉన్న గుడిసెలోని సినిమాటోగ్రఫీ.. వంద అడుగుల ఎత్తు ఫ్లెక్లీ ఉన్న ఐమాక్స్ థియేటర్ ప్రాంగణంలో ఉంటుందా! అందుకే సినిమాలు కాలగతిలో కలిసిపోతున్నా కూడా సినిమా పోస్టర్లు మనసు గదులకు అంటుకునే ఉంటున్నాయి. పోస్టర్‌లోని మంత్రముగ్ధత అది. ఎంతగానంటే ఇప్పటికీ ఒకర్ని చూసి ఒకరు ఇన్స్పైర్ అయి పోస్టర్లను కాపీ కొట్టేసుకునేంత! ఎక్కువ కాపీయింగ్ హాలీవుడ్లోంచి మిగతా వుడ్లలోకే. కాపీ కొట్టడం తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే ఎవరిది వాళ్లు కాపీ కొట్టుకోవడం ఎవరి పర్సులోంచి వాళ్లు దొంగతనం చేసినట్లుగా ఉంటుంది. ఈ ట్రెండు హాలీవుడ్లో బాగా ఉంది. వాళ్లది వాళ్లే పిక్ పాకెటింగ్ చేసేస్తుంటారు! బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు ఆనుకుని నిల్చునే పోస్టర్లు, హీరోయిన్ కాళ్ల మధ్య నుంచి సీన్‌ని చూపించే పోస్టర్లు, ఒంటికన్ను పోస్టర్లు, లీడ్ రోల్ వెనక్కు తిరిగి ఉండే పోస్టర్లు, జంతువుల పోస్టర్లు, నేచర్ బ్లూ పోస్టర్లు హాలీవుడ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇవేకాదు, బెడ్‌మీద కపుల్ పోస్టర్లు, ‘బ్లూ రన్ అండ్ టిల్ట్’ పోస్టర్లు, (మహేశ్‌బాబు ఒక సైడ్‌కి వాలి పరుగు తీస్తుంటాడు కదా.. అలా), వెనుక సముద్రం ఉండే ఓషన్ సిల్హౌటీ పోస్టర్లు, ఎర్రటి ఎరుపు డ్రెస్ వేసుకుని తెల్లటి కాళ్లు బయటపెట్టే యంగ్ లేడీ పోస్టర్లు హాలీవుడ్లో ఒకర్ని చూసి ఒకరు డిజైన్ చేస్తున్నవే. సెర్బియన్ బ్లాగర్ క్రిస్టోఫ్ కోర్టిస్కి ఇదంతా ఫన్నీగా కనిపిస్తుంది. ‘కాపీ అనలేం, ఇన్స్పిరేషన్ అనాలి’ అంటారు కోర్టిస్. ఆయన బ్లాగ్‌లో పెద్ద కాపీ కలెక్షనే ఉంది. పోస్టర్ల మహాసముద్రం హాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ఇంత ‘క్రియేటివ్’గా డంపింగ్ జరుగుతున్నప్పుడు హాలీవుడ్ నుంచి నుంచి ఇతర వుడ్లలోకి పోస్టర్లు డంప్ అవడం తప్పుగా ఏం అనిపించదు కానీ, తప్పే అని అంటున్నారు ఫ్లోరా బార్సీ అనే ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. ఇరవై ఆరేళ్ల ఈ హంగేరియన్ యువతి విజువల్ ఆర్ట్‌లో, ఫొటోగ్రఫీలో, ఫొటోషాప్‌లో, ఫొటో మానిపులేషన్లో నిపుణురాలు. గతవారం రిలీజ్ అయిన కంగనా రనౌత్ సినిమా ‘జడ్జిమెంటల్ హై క్యా’ పోస్టర్లను తన ఆర్ట్‌వర్క్ చూసే కాపీ కొట్టారని, కనీసం తన అనుమతి కూడా తీసుకోలేదని ఫ్లోరా తన ఫేస్బుక్లో ఆరోపించారు. ఆరోపణ కాదు, నిజమే అనిపిస్తుంది.పోస్టర్లో కంగనా కన్ను ఒకదాన్ని కవర్ చేస్తూ పిల్లి కన్ను ఉంటుంది. ఫ్లోరా ఎప్పుడో తీసిన ఆర్ట్ ఫొటోలోని యువతి కన్నును కూడా ఒక పిల్లి కన్ను కవర్ చేస్తుంటుంది. ఆమె ఆరోపణకు జడ్జిమెంటల్ హైక్యా నిర్మాణ సంస్థ ‘బాలాజీ మోషన్ పిక్చర్స్’ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. ఇదంటే, ఆర్ట్‌వర్క్ నుంచి పోస్టర్ కాపీ. డైరెక్ట్‌గా పోస్టర్ టు పోస్టర్ కాపీలు కూడా బాలీవుడ్లో పుష్కలంగా ఉన్నాయి. వాటి సంగతేంటి? ఎవరూ అడగలేదు. ఎవరూ మాట్లాడలేదు. ‘పికె’లో ఆమిర్ ఖాన్ దిగంబరంగా రేడియో పట్టుకుని నిలబడి ఉండే పోస్టర్.. క్విమ్ బారీరోస్ అనే పోర్చుగీస్ గాయకుడి 1973 నాటి సాంగ్స్ ఆల్బమ్ కవర్‌కు కాపీ! పికె 2014లో రిలీజ్ అయింది. షారుక్‌ఖాన్ ‘దిల్వాలే’ పోస్టర్ ఆ ముందు ఏడాదే వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది బెస్ట్ ఆఫ్ మి’ పోస్టర్‌కి కాపీ. ఆకాశంలోని మబ్బుల్లో హీరో హీరోయిన్ ఉంటారు. ‘అతిథి తుమ్ కబ్ జావోగీ’ పోస్టర్ ‘లైసెన్స్ టు వెడ్’ పోస్టర్‌కి (బెడ్ మీద భార్యాభర్తల మీద అతిథి పడుకుని ఉంటాడు), ‘ఫూంక్2’ పోస్టర్ ‘ఛేజర్’ పోస్టర్‌కి (ముఖం మీద పెట్టుకున్న అరిచేయిలోంచి ఒక కన్ను కనిపిస్తుంటుంది), ‘మర్డర్2’ పోస్టర్ ‘యాంటీ క్రైస్ట్’ పోస్టర్‌కి (దేహవాంఛలు దెయ్యాల్లా చుట్టుముట్టి ఉంటాయి), ‘ఐత్రాజ్’ పోస్టర్ ‘ది గ్రాడ్యుయేట్’ పోస్టర్‌కి (యువతి అండర్వేర్ వేసుకుంటుంటే హీరో నిలబడి చూస్తుంటాడు), ‘అంజానా అంజానీ’ పోస్టర్ ‘యాన్ ఎడ్యుకేషన్’ పోస్టర్‌కి (వెల్లికిలా రివర్స్‌లో పడుకుని ఉన్న హీరో హీరోయిన్ చెంపలు తాకించుకుంటూ ఉంటారు), ‘జిందగీ న మిలేగీ దొబారా’ పోస్టర్ ‘లార్డ్స్ ఆఫ్ డాగ్టౌన్’ పోస్టర్‌కి (ఒంటిపైన షర్ట్ లేని వ్యక్తితో పాటు ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటారు), ‘రా.వన్’ పోస్టర్ ‘బాట్స్మ్యా¯Œ బిగిన్స్’ పోస్టర్‌కి (హీరో రెండు చేతులతో హీరోయిన్ని మోసుకుంటూ వస్తుంటాడు).. ఇవన్నీ అచ్చు గుద్దినట్లుగా కాపీ. హాలీవుడ్ పోస్టర్లను చూసి ముచ్చటపడి తెలుగువుడ్ తయారు చేసుకున్న పోస్టర్లు కూడా ఉన్నాయి. సైమన్ బిర్చ్–బాహుబలి, యాన్ ఆఫీసర్ అండ్ జెంటిల్మన్–తుపాకీ, హ్యారీ పోట్టర్: ఇట్ ఆల్ ఎండ్స్–రోబో 2.ఓ, బ్లేడ్ రన్నర్–సాహు, టిక్‌టిక్: ది ఆస్వంగ్ క్రానికల్స్–కబాలి, మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్–విశ్వరూపం, ది డ్రాగన్బాల్–అఖిల్, కొల్లాటరల్ బ్యూటీ–యు టర్న్.. ఇలా పోస్టర్లలో పోలికలు కనిపిస్తాయి.ఇవన్నీ కాపీలు కాదనీ, అనుకరణలు అనుసృజనలు మాత్రమేనని అనుకున్నా ఎక్కడ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యామో వారికి క్రెడిట్ ఇవ్వడం కనీస ధర్మం. ఈ ధర్మాన్ని పాటించనప్పుడే ధర్మయుద్ధాలు మొదలవుతాయి. అయినా మనది కాని దాన్ని మనది అని చెప్పుకోవడం ఏం బాగుంటుంది? ఎవరి గొప్పతనాన్ని వారికి ఇచ్చేయడం కూడా గొప్పతనమే. హాలీవుడ్ : ఎవరిది వాళ్లే కాపీ! (బ్యాక్ టు బ్యాక్ పోస్టర్లు వేసిన చిత్రాలు) మనసును మీటిన తొలి పోస్టర్ హాలీవుడ్లో ఫస్ట్ టాకీ మూవీ ‘ది జాజ్ సింగర్’. 1927లో వచ్చింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, విటాఫోన్ కార్పోరేషన్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. కలర్‌ఫుల్ మూవీ పోస్టర్ . పోస్టర్ మీద సినిమాలోని పాత్రలు యూజినీ బెసెరెర్, అల్ జోల్సన్ ఉంటారు. తల్లీ కొడుకులు. ‘వాసు’ సినిమాలో వెంకటేశ్ పెద్ద సింగర్ అవాలనుకుంటే వెంకటేశ్ తండ్రి అతడిని పెద్ద పోలీస్ ఆఫీసర్ అవమంటాడు. తండ్రీకొడుకులకు మధ్య ఘర్షణ మొదలౌతుంది. మాతృ హృదయం కొడుకులోని ‘కళా తపస్వి’ని అర్థం చేసుకుంటుంది. అలాంటి తల్లి మనసే ‘ది జాస్ సింగర్’ పోస్టర్ డిజైన్‌లో కనిపిస్తుంది. ‘చూశావా అమ్మా నేనెంత గొప్పగా ప్లే చేస్తున్నానో’ అన్నట్లు అల్ జోల్సన్.. జాస్ని ప్లే చేస్తూ తల్లి కళ్లలోకి చూస్తుంటే.. ‘‘నా బంగారు కొండ..’’ అన్నట్లు కొడుకును మురిపెంగా చూస్తుంటుంది యూజినీ బెసెరెర్. ఆ పోస్టర్ ప్రతి ఇంటినీ టచ్ చేసి, ఇంటిల్లపాదినీ థియేటర్లకు రప్పించింది. -
రఫేల్‌పై తాజా పోస్టర్ కలకలం
భోపాల్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలక, విపక్ష పార్టీల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని పదితలలతో కూడిన రావణుడిగా చూపుతూ ఏర్పాటైన పోస్టర్ కలకలం రేపుతోంది. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో పాలక బీజేపీని దోషిగా చూపుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. రఫేల్ విమానంపై ప్రధాని మోదీ ఫోటోను చూపుతూ ‘ కాపలాదారే దొంగ’ అనే క్యాప్షన్‌ను పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్ధానిక నేతలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఈ తరహా పోస్టర్లను ప్రదర్శించడం వివాదాస్పదమవుతోంది. బిహార్ రాజధాని పట్నాలో ఇటీవల రాహుల్‌ను రాముడిగా చూపుతూ వెలిసిన పోస్టర్లు దుమారం రేపాయి. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు రాహుల్ గాంధీని శివభక్తుడిగా చూపే పోస్టర్లు భోపాల్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రియాంక, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ శ్రేణులు కూడా గతంలో పలు నగరాల్లో హోర్డింగ్‌లు, పోస్టర్లను ప్రదర్శించాయి. -
దాచేపల్లిలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం
గుంటూరు, దాచేపల్లి(గురజాల): మావోయిస్ట్ పార్టీ పల్నాడు రీజియన్ కమిటీ పేరుతో దాచేపల్లిలో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. దాచేపల్లిలోని ముత్యాలంపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం గోడకు అధిక వడ్డీ, రేషన్ బియ్యం వ్యాపారులను హెచ్చరిస్తూ వెలసిన ఈ పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. మావోయిస్ట్ పార్టీ పల్నాడు రీజియన్ కమిటీ పేరుతో వెలసిన ఒక పోస్టర్లో ‘‘రోజువారీ, వారాలవారీ, నెలవారీ వడ్డీలు, తాకట్టు రిజిస్ట్రేషన్లు, అధిక వడ్డీ వ్యాపార మార్గాల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరిక. అధిక వడ్డీల ద్వారా ప్రజల శ్రమను దోచుకునే వారందరి వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఇది చివరి అవకాశంగా భావించి ఒక నెల రోజులలో మీరు మీ అక్రమ వడ్డీ వ్యాపారాలు అన్నీ మానేసి సక్రమ పద్ధతిలో జీవనం సాగించాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రజా కోర్టులో తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. మరో పోస్టర్లో.. ‘‘రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావు, దొంగ బియ్యం రవాణాకు నెలవారీ లంచాలు, మామూళ్లు తీసుకుని సహకరిస్తున్న రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు ఇదే మా మొదటి, చివరి హెచ్చరిక. ఒక నెల రోజుల్లో మీ అక్రమ వ్యాపారాన్ని మానివేయాలి. లేకపోతే ప్రజాకోర్టులో తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. గోడపై వెలసిన ఈ పోస్టర్లను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టర్లు నిజంగా మావోయిస్టులు అంటించారా.. లేకపోతే స్థానికుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహ్మద్ రఫీ చెప్పారు. ఒకప్పుడు మావోయిస్ట్‌ల ప్రభావం అధికంగా ఉన్న పల్నాడులో తాజాగా పోస్టర్లు వెలియటంతో స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దాచేపల్లిలోని మన్నెంవారి కుంటలో జరుగుతున్న ఇళ్ల స్థలాల అక్రమాలపై ముగ్గురు వ్యక్తులను హెచ్చరిస్తూ 2017 ఫిబ్రవరి 2న దాచేపల్లిలోని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మావోయిస్ట్ పార్టీ పేరుతో ఒక పోస్టర్‌ను వేశారు. ఈ పోస్టర్ అప్పట్లో తీవ్ర సంచలనమైంది. -
కేసీఆర్ పోస్టర్లపై వీహెచ్ అసహనం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావ్! తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావ్ పోస్టర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుకు అతికించిన కేసీఆర్ పోస్లర్లను చించేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలిగించకపోవటంతో వీహెచ్ ఆగ్రహానికి గురయ్యారు. నాచారంలో ఆర్టీసీ బస్సుపై ఉన్న కేసీఆర్ ప్రచార పోస్టర్లను చింపేశారు. ప్రయాణికులందరూ సహకరించాలని ఆయన విజ్ణప్తి చేశారు. -
పరువు హత్య పోస్టర్ల కలకలం
విజయవాడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో కన్నకూతురిపైనే తండ్రి హత్యాయత్నం ఉదంతాలు కలకలం రేపాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీశాయి. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న నవదంపతులు, ఇప్పటికే ప్రేమలో మునిగి పెళ్లికి సిద్ధపడుతున్న ప్రేమ పక్షుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అయితే ఈ భయాలకు ఆజ్యం పోస్తూ విజయవాడలో పరువు హత్య పోస్టర్లు సంచలనం సృష్టించాయి. విజయవాడ నగరంలోని సత్యానారాయణపురంలో దర్శమిచ్చిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. స్థానిక శివాలయ వీధిలో ఈ పోస్టర్లు వెలిశాయి. ‘పరుపు హత్యకు గురి కానున్న సోని రాహు ప్రియ’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. దీంతో కలకలం మొదలైంది. మరోవైపు ఈ వివాదాస్పద పోస్టర్లపై పోలీసులు దృష్టి సారించారు. వీటిపై ఆరా తీస్తున్నారు. అసలు సోని రాహు ప్రియ ఎవరు? ఎవరిని భయపెట్టడానికి ఈ పోస్టర్లు? ఇది కేవలం ఆకతాయిల పనేనా? లేక నిజంగానే మరో అఘాయిత్యం చోటు చేసుకోబోతోందా? ఈ దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
తనకు తానే నివాళి పోస్టర్లు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: భార్యపై కోపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతూ.. తన నివాళి పోస్టర్లను తానే ముద్రించుకున్నాడు ఓ వింతైన వ్యక్తి. ఈ ఉదంతం తమిళనాడు ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. పుంజైపులియంపట్టి సమీపంలో పుదుప్పాళయం గ్రామానికి చెందిన అన్బరసన్ (37) భవన నిర్మాణ కార్మికుడు. ఆగస్టు 31వ తేదీన అతడు మరణించినట్లుగా ‘కన్నీటి అంజలి’పేరుతో శుక్రవారం ఊరంతా పోస్టర్లు వెలిశాయి. వీటిని చూసి ఆవేదనకు గురైన బంధుమిత్రులు శనివారం తండోపతండాలుగా అన్బరసన్ ఇంటికి చేరుకుని, అతను కులాసాగా కూర్చుని ఉండడంతో బిత్తరపోయారు. ఇదేమి చోద్యమని బంధువులు అతడిని ప్రశ్నించగా, ‘‘మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య తగవు పెట్టుకుంది. దీంతో విరక్తి చెంది కన్నీటి అంజలి పోస్టర్లు వేశాను. ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాను. అయితే బంధువులు ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణం పోలేదు. వైద్యులతో చెప్పి ఇంటికి చేరుకున్నా’’నని వివరించాడు. -
మావోయిస్టు కరపత్రాల కలకలం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. గురువారం మావోయిస్టులు కరపత్రాల ద్వారా కొంతమంది ప్రజాప్రతినిధులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరులతో పాటు మరి కొంతమందిని మావోయిస్టులు హెచ్చరించారు. ‘విజయనగరం గ్రామంలో ఇసుక దందా, భూ సెటిల్మెంట్స్, భూకబ్జాలకు పాల్పడుతూ.. కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న ఎనిమిది మందికి వార్నింగ్. పద్ధతి మార్చుకోకపోతే ఏరివేత తప్పద’ని కరపత్రాలలో పేర్కొన్నారు. మావోయిస్టు చర్ల, దుమ్ముగూడెం ఏరియా కార్యదర్శి పేరిట ఈ కరపత్రాలు వెలిశాయి. -
కలకలం రేపిన పోస్టర్లు
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు : జిల్లాలోని పలు మహిళా కళాశాలల్లో, హాస్టళ్ళ వద్ద రాత్రికి రాత్రి హెచ్చరిక పోస్టర్లు ఏర్పాటుకావడం కలకలం రేపింది. తస్మాత్ జాగ్రత్త అంటూ విద్యార్థిని చైతన్య వేదిక పేరుతో ఈపోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు ఎవరు అంటించారని విద్యార్థినులు, కళాశాల యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి. గతంలో కూడా ఏలూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మహిళా కళాశాలల వద్ద ఇదే రకమైన పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా ఈ పోస్టర్ల పట్ల కలకలం రేగింది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)ను వ్యతిరేకిస్తూ ఈ పోస్టర్లు ఉన్నాయి. సీఎంఎస్ మావోయిస్టు ముసుగు సంఘం అని, మావోయిస్టులతో సంబంధం కలిగి ఉన్న సంస్థ అని పోస్టర్లలో ఉంది. వీరంతా సీఎంఎస్ పేరుతో కళాశాలల్లో చొరబడి నూతన విద్యార్థినిలకు స్వాగతం పలుకుతూ వారికి దగ్గరై మావోయిజం వైపు ఆకర్షితులను చేస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశం అయ్యింది. విద్యార్థినులకు మాయమాటలతో మావోయిస్టు భావజాలం బోధిస్తారని, మావోయిజం వైపు ఆకర్షితులను చేసి విద్యార్థినులను మావోయిస్టు దళాల్లో చేర్చడం సీఎంఎస్ బృందం మహిళల, యువతుల లక్ష్యమని అందువల్ల వీరిని నమ్మవద్దని, కళాశాలల్లో అనుమతించవద్దని పోస్టర్లలో పేర్కొన్నారు. పోస్టర్లలో మావోయిస్టు, మావోయిస్టు సానుభూతిపరుల చిత్రాలను ముద్రించారు. మావోయిస్టుల్లో పనిచేసిన అన్నపూర్ణ, సిఫోరా, ఆమె కుమార్తెలు ఇందు, మంజు, మావోయిస్టు సానుభూతిపరురాలు సంధ్య ఫొటోలు పోస్టర్లలో ముద్రించారు. వీరు కళాశాల ప్రారంభం సమయంలో ఆయా కళాశాలల వద్దకు వచ్చి నూతనంగా చేరే విద్యార్థినులను మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షించేలా పాటలు, మావోయిస్టుకు సంబంధించిన కథనాలను వివరిస్తూ ఆకర్షితులను చేస్తారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రత్యేకంగా సీఎంఎస్ సభ్యులు మావోయిస్టు రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తుందని పోలీసుల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. దీంతో సీఎంఎస్ సభ్యులకు ఆకర్షితులు కావద్దని విద్యార్థిని చైతన్య వేదిక పేరుతో పోస్టర్లు వెలవడం చర్చనీయాంశం అయ్యింది. ఏలూరు, తాడేపల్లిగూడెం మహిళా కళాశాలల వద్ద, హాస్టళ్ళ వద్ద ఈ పోస్టర్లను అతికించారు. సీఎంఎస్ సభ్యులు పట్టుదలతో కొంతమందినైనా ఆకర్షితులు చేయకపోతారా అని మావోయిస్టు సంఘం ఆయా కళాశాలల వద్దకు చైతన్య మహిళా సంఘం పేరుతో పంపుతున్నట్లు తెలుస్తోంది. -
కరపత్రాలు, పోస్టర్లపై చిరునామా తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. సర్పంచ్, వార్డు స భ్యుల ప్రచారం కోసం ముద్రించే కరపత్రాలు, పోస్టర్లపై కచ్చితంగా ప్రచురణదారు పేరు, చిరునామా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అభ్యర్థుల ప్రచార సరళి, కరపత్రాలు, పోస్టర్ల ముద్రణ తదితర అంశాలకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. డిక్లరేషన్ ఇచ్చాకే: ప్రింటింగ్ ప్రెస్‌లు, పబ్లిషర్లుగానీ.. ప్రచురణకర్తల పేర్లు, చిరునామాలు లేకుండా కరపత్రాలు, పోస్టర్లను ముద్రించకూడదు. అభ్యర్థుల తరఫున కరపత్రాలు, పోస్టర్లు ముద్రించాలనుకున్న వారు.. తమ వ్యక్తిగత గుర్తింపు ధ్రువపత్రాలను, తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరు సంతకాలతో ప్రింటర్‌కు ఇవ్వాలి. ముద్రించిన కరపత్రాలు, పోస్టర్ల కాపీలకు ప్రచురణకర్త డిక్లరేషన్‌ను జత చేసి నిర్దిష్ట సమయంలో ఎన్నికల సంఘం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాలకు పంపిన తర్వాతే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష, లైసెన్సు రద్దు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన 3 రోజుల్లోగా అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు వారి పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్‌లు, పబ్లిషర్లకు ఎన్నికల నిబంధనలను తెలియజేయాలి. కరపత్రాలు, పోస్టర్లను ముద్రించిన 3 రోజుల్లోగా వాటి కాపీలను డిక్లరేషన్‌తో సహా జిల్లా మేజిస్ట్రేట్, ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని ఆదేశించాలి. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించిన ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. ఇక, నిబంధనలు పాటించకుండా కరపత్రాలు, పోస్టర్లను ముద్రించి ప్రచారంలో వినియోగించే ప్రచురణకర్తలకు 6 నెలల జైలు, రూ. 2 వేల జరినామా విధిస్తారు. కరపత్రాలు, పోస్టర్లను ఏ నమూనాలో ముద్రించాలనే దానిపైనా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేయ నుంది. కరపత్రాలు, పోస్టర్లలోని సమా చారం ఆధారంగా ఏ అభ్యర్థికి ప్రయోజనకరమో గమనించి వారి ఎన్నికల వ్యయంలో ఈ ఖర్చులనూ జమ చేస్తారు. -
అభిమానికి స్టార్ హీరో అశ్రు నివాళి
సాక్షి, చెన్నై: కోలీవుడ్ స్టార్ శింబు(శిలంబరసన్) హిట్ కొట్టి దశాబ్దంపైనే అవుతోంది. అయినా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. వివాదాల్లో చిక్కుకున్న సమయంలో కూడా ఆ అభిమానులే ఆయనకు అండగా నిలిచారు. అలాంటి ఫ్యాన్స్ కోసం శింబు కూడా అదే స్థాయిలో స్పందిస్తుంటాడు. ఆర్థికంగా ఎందరినో ఇప్పటికే ఆదుకున్నాడు కూడా. తాజాగా మరో అభిమాని కోసం శింబు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. టీనగర్‌కు చెందిన మదన్ అనే వ్యక్తి పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మదన్ ఎస్టీఆర్(శింబు) ఫ్యాన్ క్లబ్ కార్యదర్శి. బీప్ సాంగ్ వివాద సమయంలో మదన్ శింబుకు మద్ధతుగా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడిపాడు కూడా. అలాంటి మదన్ మృతి చెందంటంతో శింబు చలించిపోయాడు. అయితే ఆ సమయంలో దుబాయ్‌లో షూటింగ్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. తిరిగొచ్చాక ఆశ్రునివాళి పేరిట పోస్టర్లను రూపొందించి నగరంలో మొత్తం అంటించాలని ఫ్యాన్స్ అసోషియేషన్‌కు సూచించాడు. అంతేకాదు తానే స్వయంగా ఆ కార్యక్రమంలో శింబు పాల్గొన్నాడు. మదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, వారికి చేతనైనంత సాయం అందిస్తానని శింబు మీడియాకు తెలిపాడు. -
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మరోసారి మావోయిస్టుల కలకలం రేపారు. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా అవుపల్లి ధారావరం ప్రధాన రహదారిలో చెట్లను నరికి పడేసి రోడ్డును దిగ్భంధించారు. మరోవైపు మహారాష్ట్ర గడ్చిరోలి పరిధిలోని పెరిమిలి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోల పోస్టర్లు వెలిశాయి. గత కొంతకాలంగా మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లకు ప్రతీకారం తీర్చుకుంటామనే హెచ్చరికలు పోస్టర్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా మావోయిస్టుల చర్యలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. -
ఇదిగో.. ఇసుక దొంగలు!
సిరిసిల్ల శివారులోని మానేరువాగులోంచి అక్రమంగా ఇసుక తరలించే దొంగల బండారం బయటపడింది.. నిన్నామొన్నటి దాకా గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నదెవరనేది సామాన్యులకు అంతుచిక్కకుండా ఉన్నా.. అజ్ఞాతవాసి ఒకరు ఇసుకాసురుల జాబితా వెల్లడించడం.. అదికూడా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించడం ద్వారా బహిర్గతమైంది. ఈ జాబితాలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, విలేకరులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉండడం గమనార్హం. ఈజాబితా సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఇది అసలుదా..? నకిలీదా? అనే విషయం అటుంచితే.. ఇసుక దందాపై ‘సంతకం ఏదీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సైతం సంచలనం కలించింది. సిరిసిల్లక్రైం : ప్రభుత్వం కేటాయించిన రీచ్‌లు కాకుండా అధికార పార్టీ నాయకులు, పలుకుబడి కలిగిన నాయకులు, కొందరు వ్యాపారులు మానేరువాగులో అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసుకుని ఇసుక తవ్వేస్తున్నారు. అనుమతిలేని ప్రాంతాల్లోంచి ఇసుక దొంగచాటుగా తరలిపోతోందనే సమాచారం రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలతోపాటు కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కానీ, స్థానిక అవసరాల కోసం నిబంధనలకు లోబడి నిర్దేశిత సమయంలో ఇసుక రవాణాకు అవకాశం కల్పించామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, నిర్దేశిత సమయంలో వేబిల్లు ఆధారంగా ఇసుక ట్రిప్పులు అధికంగా చేశారనే ఫిర్యాదులు అందినా.. అట్లాంటిదేమీ జరగలేదని సదరు అధికారులు ట్రాక్టర్ యజమానులను వెనకేసుకొచ్చినట్లు విమర్శలు వచ్చాయి. అజ్ఞాతవాసిదే హాట్‌టాపిక్.. రెవెన్యూ అధికారుల సంతకాలు లేకుండా వేబిల్లు తీసుకున్న టీఆర్ఎస్ నాయకుడి వ్యవహారంపై ‘సంతకం ఏదీ’ కథనం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితం కావడం సంచలనమే కలిగించింది. కానీ, ఇంతకన్నా మరోవాస్తవాన్ని ఓ అజ్ఞాతవాసి వాల్‌పోస్టర్ల ద్వారా బహిర్గతం చేయడం అధికారులు, అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసుక రవాణా చేస్తున్నది కేవలం ఒక వ్యక్తి కాదని, పార్టీలోని అనేక మందితోపాటు ఆర్థిక, అంగబలం ఉన్నవాళ్లు, కొందరు విలేకరులూ ఇసుకాసురులుగా అవతారం ఎత్తారని వాల్‌పోస్టర్లలో ముద్రించాడు. వీటిని సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణతోపాటు పలు ప్రధాన కూడళ్లలో అతికించాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పోస్టర్‌లోని జాబితాలో ఉన్న వ్యక్తులకు ఈ విషయం తెలియడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. విలేకరులు.. అధికార పార్టీ నేతల అండతో.. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూర్, సర్ధాపూర్ గ్రామాల నుంచి రోజూ రాత్రి 9 – ఉదయం 6 గంటల వరకు ఇసుక జోరుగా అక్రమంగా తరలిపోతోంది. ఇందుకు అధికార పార్టీ నాయకులు, కొందరు విలేకరుల అండ ఉంది. ఇట్లాంటి వారిపై తగిన చర్య తీసుకోవాలని అజ్ఞాతవాసి వాల్‌పోస్టర్లలో జిల్లా ఎస్పీని అభ్యర్థించడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆరా..? అధికారుల సంతకాలు లేకుండా జారీ చేసిన వే బిల్లులు ఎలా బహిర్గతమయ్యాయనే విషయంపై రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యంగా సిరిసిల్ల ఏంఎంసీ చైర్మన్ పేరిట జారీ అయిన వేబిల్లుపై రెవెన్యూ సిబ్బంది, అధికారి సంతకాలు లేకుండా ఎలా బయటకు వెళ్లిందని బాధ్యులను మంగళవారం అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఎలా సమాధానం ఇవ్వాలనే ఆలోచనలో సదరు బాధ్యులు తికమకపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
అమేథీలో కలకలం
లక్నో: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోస్టర్ల యుద్ధానికి తెర లేచింది. రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ ముద్రించిన పోస్టర్లు కలకలం రేపాయి. రావణుడు(మోదీ)పై రాముడు(రాహుల్) బాణాలు ఎక్కుపెట్టినట్టుగా పోస్టర్లో చూపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు అభయ్ శుక్లా ఈ పోస్టర్లు పెట్టారు. ‘భారతీయ జనతా పార్టీ చేస్తున్న అరాచక పాలనకు ముగింపు పలికి 2019లో రాహుల్ గాంధీ దేశంలో రాహుల్ రాజ్యం(రామ రాజ్యం) తీసుకొస్తార’ని పోస్టర్లపై ముద్రించారు. మరోచోట రాహుల్‌ను కృష్ణుడి అవతారంలో చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. యోధుడు ప్రయాణం మొదలు పెట్టాడని ఈ పోస్టర్లపై రాశారు. కాంగ్రెస్ పోస్టర్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమేథీ ఎంపీ మిస్సింగ్ మరోవైపు అమేథీ ఎంపీ కనిపించడం లేదంటూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. విద్య, ఆరోగ్యాలను విస్మరించారని.. అమేథీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని పోస్టర్లపై ముద్రించారు. అభివృద్ధికి దూరమైన అమేథీ ప్రజలు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సలోన్‌లో ఉద్రిక్తత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో సలోన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే దాల్ బహదుర్ కోరి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అమేథీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు కష్టపడాల్సివచ్చింది. -
‘నేను మీ సీఎం.. ఈ గుంతలకు నేనే కారణమా?’
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా మారిపోయాయి. వీటిలో చిక్కి వాహనదారులు ప్రమాదాలు, మరణాలకు గురవుతున్న నేపథ్యంలో రోడ్లను బాగు చేయాల్సిన ఆవశ్యకతపై నగర వాసులు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. నవ భారత డెమొక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఇందిరానగర్ వంద అడుగుల రోడ్డులో గుంతలు పడిన చోట ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్ల పోస్టర్లను అంటించి ప్రజలు ఆక్రోశం వెళ్లగక్కారు. ‘నేను మీ ముఖ్యమంత్రిని, ఈ గుంతలకు నేనే కారణమా?’, ‘నేను మీ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిని, గుంతలకు నేను కారణమా?’ అని వారిని ఎద్దేవా చేస్తున్నట్లు ఈ పోస్టర్లపై రాసి ఉంది. నగర పౌరులు ఈ పోస్టర్లను ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
మావోల పోస్టర్లు కలకలం
వెంకటాపురం: జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో మంగళవారం మావోల పోస్టర్లు కలకలం రేపాయి. మావోయిస్టు వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ కరపత్రాలు వెలిశాయి. తెలంగాణలో పట్టు సాధించాలని మావోల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. -
జయదేవ్ సినిమా పోస్టర్ల చించివేత
-
జయదేవ్ సినిమా పోస్టర్ల చించివేత
నర్సీపట్నం(విశాఖపట్నం జిల్లా): ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. ఈ సంఘటన నర్సీపట్నంలోని రాజుథియేటర్లో చోటుచేసుకుంది. రాజకీయ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుండా పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కుమార్ విశ్వాస్ ఒంటరయ్యారా?
న్యూఢిల్లీ : కుమార్ విశ్వాస్‌పై ఆరోపణలు సంధించేవారి సంఖ్య ఆమ్ ఆద్మీ పార్టీలో రోజు రోజుకు పెరుగుతోంది. కుమార్ విశ్వాస్ బిజెపితో కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే అమానతుల్లా చేసిన ఆరోపణలు సద్దుమణకగముందే తాజాగా ఆయనను బిజెపి మిత్రునిగా అభివర్ణిస్తూ ఆప్ కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. కుమార్ విశ్వాస్ను బిజెపికి మిత్రునిగానే కాకుండా ఆప్ ద్రోహిగా, మోసగాడికి ఈ పోస్టర్లు పేర్కొన్నాయి. బిజెపి పట్ల కుమార్ విశ్వాస్ అనుసరిస్తోన్న మెతక వైఖరిని ప్రశ్నిస్తూ ఆప్ నేత దిలీప్ పాండే ట్వీట్ చేసిన కొద్ది రోజులకే వెలుగు చూసిన ఈ పోస్టర్లు కుమార్ విశ్వాస్ గురించిన నిజాన్ని బయటపెట్టినందుకు దిలీప్ పాండేకు కృతజ్ఞతలు తెలిపాయి. పోస్టర్లు ముద్రించిన వారు తమ పేరు బయట పెట్టకుండా కేవలం కుమార్ విశ్వాస్ను పార్టీ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అమానతుల్లా ఖాన్ ఆరోపణలతో ఆగ్రహించిన కుమార్ విశ్వాస్ను ఆప్ బుజ్జగించి రాజస్థాన్‌గా ఇన్చార్జిగా చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఇన్చార్జ్ హోదాలో నిర్వహించిన సమావేశంలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చాలా మందికి రుచించడం లేదు. దానితో పార్టీలో పలువురు నేతలు ఆయనపై కత్తులు నూరుతున్నారు.దిలీప్ పాండే వంటి వారు కొందరు బాహాటంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.కొత్తగా పార్టీ ట్రెజరర్‌గా నియమితుడైన దీపక్ బాజ్‌పేయి కూడా ఇటీవల ఆయనపై మండిపడ్డారు. గోవా ఎన్నికలలో పార్టీ నేతలు ఐదు నక్షత్రాల హోటళ్లలలో బస చేసి పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలపై దీపక్ బాజ్‌పేయి ట్విట్టర్‌పై మండిపడ్డారు. నలువైపుల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలతో, విమర్షలతో కుమార్ విశ్వాస్ పార్టీలో ఒంటరైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి బయటకు తరిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కుమార్ విశ్వాస్ను కొద్ది రోజులలో ఆప్ బహిష్కరిస్తుందని ఆయన అన్నారు కూడా.