కెనడాలో ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రిటీష్ కొలంబియాలో అతి పురాతనమైన లక్ష‍్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఆలయ గోడలు, గేట్లపైన ఖలిస్థానీ పోస్టర్లు అంటించారు. ఇటీవల మరణించిన ఖలిస్థానీ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలు ఆ పోస్టర్లపై అంటించి ఉన్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పోస్టర్లు అంటిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ముసుగులు ధరించి ఉన్న నిందితులు.. వరసగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది కెనడాలో ధ్వంసం అయిన నాలుగో దేవాలయం ఇది కావడం గమనార్హం. భారతీయులకు వ్యతిరేకంగా విధ‍్వేషాలను రెచ్చగొట్టడంపై మేయర్ కిర్క్ ప్యాట్రిక్ ఆందోళన వ్యక్తం చేశారు.
ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు దేవాలయంలో అంటించిన పోస్టర్లపై 'జూన్ 18న జరిగిన ఘటనలో భారత పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది' అని రాసి ఉంది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా నిజ్జర్ పనిచేశాడు. ఇతన్ని కెనడాలోని సుర్రేలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
ఇదీ చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్.. మరింత ఆలస్యంగా ఎన్నికలు!
Comments
Please login to add a commentAdd a comment