
సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు రూ.4వేల పెనాల్టీ విధించింది. లాక్‌డౌన్ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ పౌరుడొకరు సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవీడీఎం విభాగం ఈనెల 22వ తేదీన రూ.4వేలకు ఈ చలానా జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment